Ram Charan Peddi Movie 22 Days Collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా సందేశంతో తెరకెక్కిన ఈ సినిమాకు 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా విజయయాత్ర ఇంకా కొనసాగుతోంది. థియేటర్లలో విడుదలై మూడు వారాలు దాటినా... మరోవైపు 'మా ఇంటి బంగారం' వసూళ్ళకు గండి కొట్టినా... నాలుగో వారంలోనూ కలెక్షన్లు రాబడుతోంది. థియేటర్లలో విడుదలైన 22వ రోజు సినిమా ఎంత కలెక్ట్ చేసింది? టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...

కోటి కంటే కిందకు పడిన 'పెద్ది'...
మూడు వారాల్లో ఎంత కలెక్ట్ చేసింది?
Peddi Three Weeks Collection: 'పెద్ది' సినిమా జూన్ 4వ తేదీ (గురువారం) రిలీజ్ అయ్యింది. ముందు రోజు బుధవారం ప్రీమియర్లు వేశారు. జూన్ 24 (బుధవారం)కు సినిమా విడుదలై మూడు వారాలు. అయితే... ట్రేడ్ లెక్కల్లో గురువారం నుంచి గురువారానికి వారంగా లెక్క కడతారు. జూన్ 25కు సినిమా విడుదలై మూడు వారాలు. 'పెద్ది' త్రీ వీక్స్ కలెక్షన్స్ ఎంత?

Also Read: Maa Inti Bangaram First Week Collections - మళ్ళీ పెరిగిన బంగారం కలెక్షన్లు... ఫస్ట్ వీక్ టోటల్ ఎంత? ఏడో రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

థియేటర్లలో విడుదలైన 22వ రోజు 'పెద్ది' సినిమాకు 80 లక్షలు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ముందు రోజు (జూన్ 24, బుధవారం) 21వ రోజు కలెక్షన్లు 70 లక్షల కంటే 14.3 శాతం ఎక్కువ.

ఇప్పటివరకు ఇండియాలో... మూడు వారాల్లో 'పెద్ది' నెట్ కలెక్షన్లు రూ. 237.40 కోట్ల.

గ్రాస్ విషయానికి వస్తే... మూడు వారాల్లో రూ. 280.88 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 'పెద్ది'.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్లు వచ్చాయి. మూడు వారాల్లో ఈ సినిమా ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్లు రూ. 52.90 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా మూడు వారాల్లో టోటల్ కలెక్షన్లు రూ. 333.78 కోట్లు.

Also Read: Puri Jagannadh Charmy Kaur - ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు

క్లీన్ హిట్ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రావాలి?
ఈ ఏడాది (2026లో) హయ్యస్ట్ గ్రాస్ సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా 'పెద్ది' నిలిచింది. తమిళ హిట్ 'కరుప్పు' (రూ. 308 ప్లస్ కోట్లు) కలెక్షన్స్ రికార్డును బీట్ చేసింది. మొదటి రోజు 110 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి... తెలుగు సినిమా చరిత్రలో 100 కోట్ల ఓపెనింగ్ సాధించిన 11వ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది 'పెద్ది'. రామ్ చరణ్ కెరీర్‌లో 'ఆర్ఆర్ఆర్', 'రంగస్థలం' తర్వాత రూ. 200 కోట్లు దాటిన మూడో సినిమా కూడా 'పెద్ది'.

సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో 'పెద్ది' తెరకెక్కింది. ఈ సినిమా క్లీన్ హిట్‌ కావాలి అంటే సుమారు రూ. 500 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. మరి ఆ మార్కు చేరుతుందా? లేదా? అనేది చూడాలి. లాంగ్ రన్‌లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం కనిపించడం లేదు.

Also Read: OG 2 Update - పవన్ ఫుల్ హ్యాపీ... 'ఓజీ 2'కు అంతా రెడీ... సుజీత్ క్లూస్ ఇచ్చారా?