Peddapalli Dog Attack: వీధికుక్కల దాడిలో చనిపోయిన చిన్నారి, మృతదేహాన్ని పీక్కుతిన్న శునకాలు! పెద్దపల్లిలో ఘోరం

1 month ago 6
ARTICLE AD
<p>ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్ర రక్తస్రావంతో బాలిక చనిపోగా, పొలాల్లోకి మృతదేహాన్ని లాక్కెల్లి వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకున్న ఒక అత్యంత విషాదకర ఘటన స్థానికులను కలచివేసింది. సుల్తానాబాద్&zwnj; మండలం కాట్నపల్లి గ్రామంలోని ఒక ఇటుకల బట్టీ వద్ద ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి ప్రాణాలు తీశాయి.&nbsp;</p> <p>ఒడిశా రాష్ట్రం బర్గ జిల్లాకు చెందిన భుభూన్, సరస్వతి దంపతులు పొట్టకూటి కోసం కొన్ని నెలల కిందట ఇక్కడికి వలస వచ్చారు. భార్యాభర్తలు ఇటుకల బట్టీలో పని చేస్తున్నారు. సోమవారం ఉదయం వారి కుమార్తె దివ్య బెహరా ఇంటి బయట తోటి పిల్లలతో ఆడుకుంటుండగా, ఒక్కసారిగా వీధికుక్కలు దాడిచేశాయి. ఈ భయానక దాడిలో మిగతా పిల్లలు ప్రాణభయంతో పారిపోగా, కుక్కలు చిన్నారి దివ్య మెడను పట్టుకుని సమీపంలోని పంట పొలాల్లోకి లాక్కెళ్లాయి. అక్కడ బాలిక శరీరంపై పలు చోట్ల తీవ్రంగా గాయపరచడంతో చనిపోయింది. ఆ తరువాత వీధికుక్కలు బాలిక మృతదేహాన్ని పీక్కుతిన్నాయి.&nbsp;</p> <p>ఘటన జరిగిన సమయంలో తండ్రి బయటకు వెళ్లగా, తల్లి ఇంట్లోనే ఉన్నప్పటికీ బాలింత కావడంతో బయట జరుగుతున్న ఘోరాన్ని గమనించలేదు. దాంతో ఆ కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ ఎస్సై అశోక్&zwnj;రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీధికుక్కల దాడిలో ఒక పసి ప్రాణం బలికావడంతో గ్రామస్తులు తమ పిల్లలకు ఏమవుతుందోనని తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.</p>
Read Entire Article