<p><strong>Vizag Modi Tour : </strong>దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు మోదీ అని <a title="పవన్ కల్యాణ్" href="https://telugu.abplive.com/topic/Pawan-Kalyan" data-type="interlinkingkeywords">పవన్ కల్యాణ్</a> అన్నారు. మోదీ పర్యటనలో భాగంగా విశాఖలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్‌గా మారుతుందని.. సదాశయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నడిస్తే..అది స్వచ్ఛ భారత్‌ అవుతుందని పవన్ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలను అభివృద్ధి పథంలో.. నడిపిస్తున్న దార్శనికులు చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని.. భారత్‌ను గొప్ప దేశంగా మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారని ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారు... మోదీ రాకతో ఏపీకి రూ.2.1 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మోదీ రాకతో 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని.. ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడు మోదీ అని పవన్ ప్రశంసించారు. సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మోదీ ఆశయమని.. గత ఐదేళ్లు అవినీతి, అరాచక పాలనతో ఏపీలో అంధకారం నెలకొందన్నారు. అభివృద్ధి అంటే ఆంధ్రా అనేలా <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> కృషి అని.. రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న మోదీకి అండగా ఉంటామని తెలిపారు. </p>