తెలుగు చిత్రసీమలో హ్యాపెనింగ్స్ ఏమిటి? మార్చి 2026 మొదటి వారంలో జరిగిన ఈవెంట్స్ అన్నిటికి కలిపి ఒక టైటిల్ ఇస్తే? 'పెళ్లి సందడి' అనేది సరిగ్గా సెట్ అవుతుంది. ఇద్దరు యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఫిబ్రవరి నెలాఖరున (28, 2026) విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఏడు అడుగులు వేశారు. మార్చి 6న అల్లు శిరీష్ - నయనికా రెడ్డిల పెళ్లి. అయితే... ముందుగా రిసెప్షన్ ఇచ్చింది అల్లు ఫ్యామిలీ. పెళ్లి తర్వాత రిసెప్షన్ ఇచ్చింది విరోష్ జంట. ఆల్మోస్ట్ ఆల్ టాప్ హీరోలు అందరూ ఈ రెండు ఈవెంట్స్‌లో కనిపించారు. మరి డుమ్మా కొట్టింది ఎవరో తెలుసా?

అక్కడ చిరు... ఇక్కడ బాలయ్య
మేనల్లుడు అల్లు శిరీష్ (Allu Sirish)ని పెళ్లి కొడుకు చేసినప్పుడు కొణిదెల ఫ్యామిలీ అటెండ్ అయ్యింది. అయితే, రిసెప్షన్‌లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులతో పాటు మెగా కోడలు ఉపాసన సైతం కనిపించలేదు. మెగా సంతానం రామ్ చరణ్, సుష్మితా కొణిదెల, మేనల్లుళ్లు సాయి దుర్గా తేజ్ - వైష్ణవ్ తేజ్ సహా పలువురు శిరీష్ రిసెప్షన్‌లో సందడి చేశారు. పెళ్లిలో మెగా ఫ్యామిలీ అందరూ కనిపిస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

Also Read: Balakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

అల్లు శిరీష్ - నయనిక రిసెప్షన్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. కొత్త జంటకు ఆయన ఆశీస్సులు అందించారు. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్‌కు బాలకృష్ణ హాజరు కాలేదు. ఒక చోట చిరు, మరొక చోట బాలయ్య కనిపించలేదు.

రెండిటికీ డుమ్మా కొట్టిన పవన్, ప్రభాస్
మార్చి 2న జరిగిన అల్లు శిరీష్ - నయనికా రెడ్డి రిసెప్షన్, అలాగే మార్చి 4న జరిగిన విజయ్ దేవరకొండ - రష్మికా మందన్నా రిసెప్షన్... రెండింటిలోనూ పవర్ స్టార్ & ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించలేదు. ఈ రెండు ఈవెంట్స్‌లో వాళ్ళ సందడి లేదు. ఆ మాటకు వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కనిపించలేదు. రాజమౌళి 'వారణాసి' షూటింగ్ కోసం ఆయన విదేశాలు వెళ్లారు. ఆయన బదులు వైఫ్ నమ్రత, అమ్మాయి సితార వచ్చారు.

Also Read: Krish Jagarlamudi: హైదరాబాద్‌లో 19న పూజ, మర్నాడు వెస్ట్ బెంగాల్‌కు... క్రిష్ కొత్త సినిమా డీటెయిల్స్!

పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ అల్లు అరవింద్ దంపతులు, అల్లు శిరీష్ శుభలేఖ ఇచ్చారు. పెళ్లికి పవన్ ఫ్యామిలీ హాజరు అవుతుందని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులతో పాటు మెగా ఫ్యామిలీ అంతా అటెండ్ అవుతుందని చెప్పవచ్చు. ప్రభాస్ మాత్రం డౌట్ అని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఇటీవల ఆయన పబ్లిక్ ఫంక్షన్స్, ఈవెంట్స్ వంటివి అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకో మరి?

Also Read: Tollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా