Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు

11 months ago 8
ARTICLE AD
<p>Pawan Kalyan made sensational comments on Allu Arjuns arrest | అమరావతి: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటన జరిగిన వెంటనే బాధితులను పరామర్శించాలని, గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారంటూ చిట్ చాట్ లో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మాత్రమే కాదు, వాళ్ల టీమ్ అయినా వెంటనే మృతిచెందిన వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శిస్తే సరిపోయేదన్నారు. రేవంత్ రెడ్డి కాబట్టే హీరో అయిన అల్లు అర్జెన్&zwnj;ను అరెస్టు చేయగలిగారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అరెస్ట్ చేస్తారని కామెంట్ చేశారు.&nbsp;</p> <p>తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలుగు పరిశ్రమకు రేవంత్ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోంది. పుష్ప 2 బెనిఫిట్ షోలు ఇవ్వడం, టికెట్ రేట్లు పెంపు నిర్ణయం సినిమాలను ప్రోత్సహించడమే అన్నారు.&nbsp;</p>
Read Entire Article