<p><strong>OG Ticket Record:</strong> పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవికి సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 02 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన అప్డేట్ అంతకుమించి వైబ్స్ క్రియేట్ చేస్తోంది. అభిమాన హీరోపై అభిమానాన్ని చాటుకున్న తీరు వైరల్ అవుతోంది. మోస్ట్ అవైటెడ్ మూవీ OG కి సంబంధించి ఫస్ట్ నైజాం టికెట్ 5 లక్షలకు అమ్ముడైనట్టు టాక్. ఈ టికెట్ ని పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా అభిమాన బృందం కొనుగోలు చేసిందట. </p>
<p>సెప్టెంబర్ 25న విడుదలకానున్న OG మూవీకోసం ప్రీ సేల్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వేసిన వేలంలో ఫస్ట్ టికెను 5 లక్షలకు కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ టికెట్ అమ్మగా వచ్చిన 5 లక్షల రూపాయలను <a title="జనసేన" href="https://telugu.abplive.com/topic/Janasena" data-type="interlinkingkeywords">జనసేన</a> పార్టీకి విరాళంగా ఇస్తున్నట్టు అభిమానులు ప్రకటించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఓ సినిమా టికెట్ ధర 5 లక్షలు పలకడం ఓ రికార్డ్ అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ఉన్న బజ్ కి ఇదే నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.</p>