తెలుగు చలన చిత్రపరిశ్రమలోని సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (Pavala Shyamala) అంత్యక్రియలు ఈ రోజు (జులై 29, బుధవారం) హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ఏరియాలో గల మహాప్రస్థానంలో నిర్వహించారు. 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అంతిమ సంస్కారాలను నిర్వహించింది. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పావలా శ్యామల... మంగళవారం తెల్లవారుజామున 1.52 గంటలకు ఉస్మానియా ఆస్పత్రిలో గుండెపోటుతో కన్ను మూసిన సంగతి తెలిసిందే.

వృద్ధాశ్రమం నుంచి మహా ప్రస్థానానికి!
ఉస్మానియా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన పావలా శ్యామల భౌతిక కాయాన్ని, ఆ ఆస్పత్రి నుంచి వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ వృద్ధాశ్రమానికి తీసుకు వెళ్లారు. ప్రేక్షకుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని అక్కడ ఉంచారు. మంగళవారం కనుక జూలై 28న అంత్యక్రియలు చేయలేదు. ఈ రోజు ఉదయం మహాప్రస్థానానికి పావలా శ్యామల భౌతిక కాయాన్ని తరలించారు.

మహా ప్రస్థానంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Movie Artists Association) నుంచి పలువురు సినీ నటులు, దర్శక నిర్మాతలు, అభిమానులు పావలా శ్యామలకు నివాళులు అర్పించారు. అంత్యక్రియల ఏర్పాట్లను నటి కరాటే కళ్యాణి దగ్గరుండి పర్యవేక్షించారు. హేమ, రఘుబాబు తదితరులు హాజరయ్యారు.

Also Read: Bomma Bomma Song Lyrics - బొమ్మ బొమ్మ లిరిక్స్... పూజా హెగ్డేతో దుల్కర్ రొమాంటిక్ మెలోడీ - 'శ్రీ శ్రీ' కోసం అనంత శ్రీరామ్ ఏం రాశారంటే?

మెగాస్టార్ చిరంజీవి 'ఛాలెంజ్' (1984) సినిమాతో పావలా శ్యామల తెలుగు తెరపై అడుగుపెట్టారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో వందకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ఆమె చివరి చిత్రం 'మత్తు వదలరా' (2019). ఆ తర్వాత తెరపై కనిపించలేదు. అయితే... కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో పావలా శ్యామల సతమతం అయ్యారు.

Also Read: Kalatheylaa Song Lyrics - కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్

పావలా శ్యామల మృతి పట్ల తెలుగు చిత్రసీమ సంతాపం వ్యక్తం చేసింది. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ట్రస్ట్ నుంచి రూ. 50 వేలు, దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్రరావు వ్యక్తిగతంగా రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. లక్ష రూపాయలను ఆమె కుటుంబానికి అందించనున్నారు.

Also Read: Kotha Soku Lyrics - కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్