Holistic health through Ayurveda, Yoga, and Naturopathy | నేటి ఒత్తిడితో కూడిన బిజీ లైఫ్‌లో సహజ చికిత్సలు, దీర్ఘాయుష్షు కోరుకునే వారికి దాని వెల్నెస్ సెంటర్ ఒక ఆదర్శవంతమైన ప్రదేశంగా మారింది. పతంజలి ప్రకారం బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ స్థాపించిన ఈ సెంటర్ అటు ఆయుర్వేదం, యోగాతో పాటు ప్రకృతి వైద్యం వంటి పురాతన భారత వైద్య విధానాలను ఆధునిక పద్ధతులతో కలిపి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య వాతావరణాన్ని అందిస్తుందని పతంజలి పేర్కొంది. ఈ కేంద్రం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసికంగా, ఆధ్యాత్మిక సమతుల్యతను కూడా పెంపొందిస్తుంది.

పతంజలి వెల్‌నెస్ సెంటర్ ప్రకారం.. “మా సెంటర్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే దాని పరిపూర్ణ విధానం. వ్యాధుల లక్షణాలను మాత్రమే కాకుండా, అందుకు గల మూల కారణాలపై కూడా దృష్టి పెడతాం. పంచకర్మ వంటి ఆయుర్వేద చికిత్స పద్ధతులు శరీరాన్ని డిటాక్సీనేషన్ చేసి కణజాలాలను పునరుద్ధరిస్తుంది. అభ్యంగం (మూలికల నూనెతో చేసే మసాజ్) మీ ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ప్రకృతి వైద్యంలో హైడ్రోథెరపీ, మడ్ థెరపీతో పాటు సన్ థెరపీ (Sun therapy) వంటి సహజ చికిత్సలు శరీరం సొంతంగా రికవర్ అయ్యే సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తాం” అని తెలిపింది.

ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి – పతంజలి
పతంజలిలో ఒక ముఖ్యమైన భాగమైన యోగ మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పతంజలి ప్రకారం.. వెల్‌నెస్ సెంటర్‌లో క్రమం తప్పకుండా యోగా సెషన్లు (Yoga sessions,), ప్రాణాయామం, ధ్యానానికి సంబంధించి ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తుంటాం. ఇవి శారీరక ఒత్తిడి, ఆందోళన, మానసిక అశాంతిని తగ్గించడంలో దోహదం చేస్తాయి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడ ముఖ్యమైన విషయం. పతంజలి సెంటర్లో ఆహార నిపుణులు వ్యక్తిగత ఆరోగ్య అవసరాల ఆధారంగా అక్కడికి వచ్చే వారికి పోషకాలున్న భోజనాన్ని సిఫార్సు చేస్తారు. ఇది చికిత్స ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రభావితం చేస్తుంది.

వెల్నెస్ సెంటర్ ప్రకానం.. ఇక్కడి ప్రశాంతమైన, పర్యావరణ అనుకూల వాతావరణం మీకు అందించే చికిత్సను మరింత ప్రభావవంతం చేస్తుంది. ఈ వెల్నెస్ సెంటర్లు హరిద్వార్, ఢిల్లీ, పంచకుల, గౌహతి వంటి నగరాల్లో ఉన్నాయి. పరిశుభ్రమైన, ప్రశాంతమైన పరిసరాలు పేషెంట్లను రోజువారీ ఒత్తిడి నుండి దూరంగా ఉంచి, ఆత్మపరిశీలన, ఆరోగ్యంపై దృష్టి సారించడానికి ప్రేరేపిస్తాయి. అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన బృందం వ్యక్తిగత సంరక్షణను నిర్ధారించడంతో పాటు, ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ప్రత్యేకంగా చికిత్సలను అందిస్తుంది.