Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. ఇద్దరు కార్మికులు సజీవదహనం

4 months ago 10
ARTICLE AD

Anakapalli Fire Accident | అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఫార్మాసిటీ పరిధిలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరణించిన ఇద్దరు కార్మికులను అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వాసులుగా అధికారులు గుర్తించారు.

మంటల్లో చిక్కుకున్న మరికొందరు..
ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ లోపల మరో ఇద్దరు కార్మికులు కూడా మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సాధ్యమైనంత త్వరగా అక్కడికి  చేరుకున్నారు. వారు ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Entire Article