Sivakarthikeyan's Parasakthi Movie OTT Release Date Locked : రీసెంట్‌గా రిలీజ్ అయిన సంక్రాంతి మూవీస్‌లో కాంట్రవర్శీస్‌తో ఎక్కువగా ట్రెండ్ అయిన మూవీ 'పరాశక్తి'. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

'పరాశక్తి' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'ZEE5' సొంతం చేసుకోగా ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించగా... రవి మోహన్, అథర్వ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వం వహించగా... ఆకాష్ భాస్కరన్‌కు చెందిన డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై 150 కోట్ల బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించారు.

Also Read : 90s ఫేమస్ బీజీఎం... 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' - రిలీజ్ ఎప్పుడో తెలుసా?