ప్రపంచంలోని 14వ ర్యాంక్ జట్టు నెదర్లాండ్స్ మాజీ ఛాంపియన్ పాకిస్తాన్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. 2026 T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చివరి ఓవర్లలో అతికష్టమ్మీద నెగ్గింది. ఫహీమ్ అష్రఫ్ 19వ ఓవర్లో 24 పరుగులు సాధించడంతో పాక్ పరువు నిలిచింది.

పాకిస్తాన్ జట్టు పొట్టి ప్రపంచ కప్ తొలి మ్యాచులో ర్యాంకింగ్‌లో చాలా కింద ఉన్న నెదర్లాండ్స్‌తో అతికష్టం మీద నెగ్గడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. బాబర్ ఆజం ఫ్లాప్ షో, పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా రాణించలేదు. ఫహీమ్ అష్రఫ్ చివర్లో రాణించకపోతే అంతర్జాతీయ వేదిక మీద ఎక్స్‌ట్రాలు చేసిన పాక్ పరువు పోయేదే. అష్రఫ్ చివరి ఓవర్లలో 11 బంతుల్లో 29 పరుగులు చేయడంతో నెదర్లాండ్స్ మీద పాక్ విజయం సాధించింది.

In the opening match of the T20 World Cup itself, it became clear why Pakistan was boycotting India's match. If they were taken fearless and people were not allowed to breathe easy, then imagine what would have happened to them in front of India. Pakistan became naked. 🤣🤣🤣

— ICC Commentry (@INDCricketGuide) February 7, 2026

పాకిస్తాన్‌పై నెటిజన్ల ట్రోలింగ్
ఒక సోషల్ మీడియా యూజర్ ఇలా పోస్ట్ చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎందుకు టీమ్ ఇండియాతో ఆడదో ఇప్పుడు అర్థమైంది. నెదర్లాండ్స్‌తో ఇలా ఉంటే, భారత్‌తో ఆడితే ఏమవుతుందో అని... పాకిస్తాన్ జట్టును చిన్న జట్టు దాదాపు బట్టలూడదీసినంత పని చేసిందన్నాడు. పాక్ తాజా ప్రదర్శన ఈ T20 ప్రపంచ కప్‌ నెగ్గడం పాకిస్తాన్ కు అంత తేలిక కాదని స్పష్టం చేసింది. మహ్మద్ కైఫ్ కామెంటరీ సమయంలో పాకిస్తాన్‌ను ట్రోల్ చేశారని ఒక భారత అభిమాని పేర్కొన్నాడు.

I can see Pakistan's bright future exit in the T20 World Cup.

— Dev Sharma (@SharmaDev90) February 7, 2026

‼️Mohammad Kaif trolled Pakistan during commentary‼️

Mohammad Kaif:- 🗣️

Pehle match to jeet lo Net run Rate baad main dekh lena …..😂😂😂#T20WorldCup #T20WC #BabarAzam #PAKvNED pic.twitter.com/Gjvix55y72

— Cricket Mindset (@CricketMindset) February 7, 2026

హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఫహీమ్ అష్రఫ్ రాణించి తృటిలో ఓటమిని తప్పించాడు. లేకుంటే పాకిస్తాన్ T20 ప్రపంచ కప్‌లో భారీ ఓటమిని చవిచూసేది. కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 147 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ ఛేజింగ్ అంత తేలిక కాలేదు. చివరి ఓవర్‌లో 3 వికెట్లు తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, బాస్ డి లీడే 37 పరుగులు, 30 పరుగులు చేశారు. మైఖేల్ లెవిట్ 24, కాలిన్ అకెర్మాన్ 20 పరుగులు చేశారు. పాకిస్తాన్‌కు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. స్వల్ప టార్గెట్ ఛేదించడంలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 47 పరుగులు చేశాడు. సామ్ అయూబ్ 13 పరుగులు, కెప్టెన్ సల్మాన్ అఘా 12, బాబర్ అజామ్ 15 పరుగులకే ఔటయ్యారు.

తృటిలో ఓటమిని తప్పించుకున్న పాకిస్తాన్
ఒక దశలో పాకిస్తాన్ 2 వికెట్లకు 98 పరుగులు చేసి 58 బంతుల్లో 50 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. కానీ ఆ తర్వాత, వికెట్ల పతనం ప్రారంభమైంది, ముఖ్యంగా పాల్ వాన్ మీకెరెన్ పాకిస్తాన్ బ్యాటర్లను దెబ్బతీశాడు. పాక్ 100 పరుగులు చేసేలోపే జట్టులో సగం మంది పెవిలియన్‌కు చేరారు.

స్కోరు 114 పరుగులకు చేరుకునేలోగా ఆల్ రౌండర్లు, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తమ వికెట్లను కోల్పోయారు. 114 పరుగులకే పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుకు చేరింది. ఫహీం అష్రఫ్ చిరవ్లో 11 బంతుల్లో 29 పరుగులతో రాణించడంతో పాకిస్తాన్ పెద్ద ఓటమిని తప్పించుకుంది.