న్యూఢిల్లి: ఆపరేషన్ సిందూర్ గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడులకు సంబంధించిన మరిన్ని విజువల్స్‌ను ఐఏఎఫ్ విడుదల చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్ లో వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత వైమానిక దళం (IAF)కు రెండు కీలక లక్ష్యాలు కేటాయించారని తెలిపారు.

ఐఏఎఫ్‌కు ఇచ్చిన టార్గెట్స్‌లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న మురిద్కే (లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం)తో పాటు పాకిస్తాన్ లోపల 100 కి.మీ దూరంలోని బహావల్పూర్ (జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం) ఉన్నాయని ఎయిర్ మార్షల్ తివారీ తెలిపారు. నియంత్రణ రేఖ (LOC)కు సమీపంలో ఉన్న మిగతా 7 ఏడు ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యానికి టార్గెట్ ఇచ్చినట్లు కీలక విషయాలు వెల్లడించారు.

మురిద్కేలో బాంబులు తయారీ, ఇతర బ్లాకులు, నిర్మాణాలను ఐఏఎఫ్ ధ్వంసం చేసిందని ఎయిర్ మార్షల్ తివారీ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాదాపు 50 వరకు ఆయుధాలను ప్రయోగించారు. ఈ ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన ఐఏఎఫ్ చేసిన దాడుల్లో పాక్ లోని ఉగ్ర స్థావరాలు ఎంతగా ధ్వంసమయ్యాయో ఆయన డ్రోన్ విజువల్స్, ఫుటేజ్ ప్రదర్శించారు. ఐఏఎఫ్ దాడుల్లో రెండు ఉగ్రవాద స్థావరాలు, ఆ ప్రాంతంలో భారీ నిర్మాణ నష్టాలు జరిగినట్లు ధృవీకరించారు.

#NDTVDefenceSummit2025 | Air Marshal Narmdeshwar Tiwari, Vice Chief of the Air Staff Shows New Videos Of #OperationSindoor Strikes pic.twitter.com/Soddp78NIj

— NDTV (@ndtv) August 30, 2025

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ విదేశీయుడు సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భారత త్రివిధ దళాలు ఎదురుదాడికి సిద్ధమైంది. ఉగ్రవాదులను ఏరివేయడానికి ప్లాన్ చేసి దాడులు చేసినట్లు తివారీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ లో మేం చేసింది మా సామర్థ్యంలో చిన్న భాగం మాత్రమే అన్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత ఎయిర్ మార్షల్ ఓ కార్యక్రమంలో మాట్లాడటం ఇదే మొదటిసారి.