Thiruveer Aishwarya Rajesh's Oh Sukumari Movie Teaser Review : టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ విలేజ్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ సుకుమారి'. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

మగధీరకు లింక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర స్టోరీతో లింక్ ఉన్నట్లుగా చూపించిన కాన్సెప్ట్ హైప్ క్రియేట్ చేస్తుంది. అమ్మాయికి ఉన్న సమస్య దాచి పెట్టి పెళ్లి చేస్తే ఆ జంట జీవితంలో ఏం జరిగింది? అనేదే ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ధామిని రోల్‌లో ఐశ్వర్య నటించారు.

లోకల్ పొలిటికల్ లీడర్ అయిన ఓ యువకుడు చేసుకోబోయే అమ్మాయికి ఓ అరుదైన సమస్య ఉంటుంది. ఆ సమస్య దాచి పెట్టి పెద్దలు పెళ్లి చేసేస్తారు. అమ్మాయిని టచ్ చేస్తే ఓ షాక్‌లా కొడుతుంది. మగధీర సినిమాలో రామ్ చరణ్ కాజల్‌ను టచ్ చేస్తే గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినట్లు ఈ మూవీలోనూ ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ ఉంది. 'మగధీర... రామ్ చరణ్, కాజల్ మీది జన్మజన్మల బంధంరా' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అసలు ఆ అమ్మాయికి ఉన్న సమస్య ఏంటి? ఎందుకు ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Also Read : Aishwarya Rajesh : విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్