Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున మొక్కు అంటూ నేల మీద అన్నం వడ్డించుకొని తినడం హరివర్ధన్ చూసి ఏం చేస్తున్నావ్ మిథున.. నేల మీద తినడం ఏంటి.. నువ్వు ఈ హరివర్ధన్ కూతురివి.. ఎంత గారాభంగా పెంచుకున్నా నిన్ను.. సిరిసంపదలతో పెరిగావ్ ఇలా నేల మీద తినాల్సిన పని ఏంటి.. ఇది మొక్కా ఇలా నేల మీద తినడం మొక్కా ఇలాంటి మొక్కు మొక్కుకోవాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతాడు.

మిథున తాళి తీసి దీని కోసం అని అంటుంది. హరివర్ధన్, దేవా ఇద్దరూ అబ్బా అని చిరాకు పడతారు. నా భర్త క్షేమం కోసం నా కాపురం కోసం అని మిథున చెప్తుంది. వీడు నీ మెడలో తాళం కట్టడం ఓ దరిద్రం వాడి కోసం నువ్వు వచ్చేయడం ఇంకో దరిద్రం.. ఇలాంటి రౌడీతో నీ బతుకు బాగుండాలి అనుకోవడం నీకు నువ్వు కోరి తెచ్చుకున్న దరిద్రం అని మండి పడతాడు.

మిథున తండ్రితో మాది పార్వతి పరమేశ్వరుల నిర్ణయం.. నా భర్తతో అందమైనా కాపురం నిర్మించుకోవడానికి నా తపన అని అంటుంది.ఏయ్ ఆపు ఇదా నా కూతురి భవిష్యత్ ఇదా నేను కలగన్న నా కూతిరి జీవితం అని ఛీ కొట్టి హరివర్ధన్ వెళ్లిపోతాడు. తర్వాత దేవా కూడా వెళ్లిపోతాడు. మిథున నేల మీద తింటుంది.

దేవా హరివర్ధన్ దగ్గరకు వెళ్తాడు. రేయ్ నా కూతుర్ని ఏం చేయాలి అనుకుంటున్నావ్‌రా నేల మీద తినడం ఏంట్రా తనకు అలాంటి దుస్థితి ఏంట్రా అని హరివర్దన్ ఏడుస్తాడు. నా బంగారు తల్లిని ఎలా పెంచుకున్నానురా.. వెండి ప్లేట్‌లో తినేది ఇలా నేల మీద తినడం ఏంట్రా నీ వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.. నీ కారణంగా నా కూతురి ప్రాణాలు ఎప్పుడు పతాయా అని భయం ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏంట్రా ఇదంతా.. ఇప్పుడు అనిపిస్తుంది నీ తరుఫున వాదించకపోతే నా కూతురు నా దగ్గరకు వచ్చేది అని అంటాడు.

దేవా హరివర్ధన్తో నేను ఇది అడగటానికే వచ్చా సార్ జడ్జి స్థానంలో ఉన్నా మీకు ఇది మంచి అవకాశం.. మరి ఎందుకు వదిలేశారు అని అడుగుతాడు. ఎందుకంటే ఒక ఆడపిల్ల కోసం నువ్వు వాడిని కొట్టావ్ కాబట్టి.. రవణమ్మ ఒకప్పుడు మా ఇంటి వాచ్‌మెన్ భార్య.. రవణమ్మ నాకు చెప్పింది తన కూతురి కోసమే అని నువ్వు కొట్టడం నాకు తప్పు అనిపించలేదు అందుకే నిన్ను కాపాడాను..దేవా నువ్వు ఇంత మంచోడివి కదా.. ఆ తల్లి బాధ అర్థమైన నీకు నా కూతురి విషయంలో నా బాధ ఎఉందుకు అర్థం కావడం లేదు అని అడుగుతాడు. నా కూతురి జీవితంలో నుంచి వెళ్లిపోతా అన్న మాట నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు.. నాకూతుర్ని ఎందుకు పంపలేదు అని అడుగుతాడు. దేవా ఏం మాట్లాడదు. నా రుణం తీర్చుకోవాలి అనుకుంటే నా కూతుర్ని నా ఇంటికి పంపేయ్ అని అంటాడు.

దేవాతో మాట్లాడి వెళ్తున్న హరివర్ధన్‌ కారు తీసుకురమ్మని డ్రైవర్‌కి చెప్తాడు. ఇక అప్పుడే హరివర్ధన్‌ని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. దేవాని మిథునని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని శారద చెప్తుంది. ఇక మిథున దేవాతో ఇద్దరూ కలిసి శారద, లలిత దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పిల్లాపాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండమని కోరుకుంటారు. దేవా మిథునని తీసుకొని ఇంటికి బయల్దేరుతాడు. డ్రైవర్ లలితతో సార్ కోపంగా వెళ్లిపోయినట్లున్నారు అని అంటాడు.

దేవా జైలుకి వెళ్లే ప్రతీసారి మీ చెల్లి తెచ్చేది.. ఈసారి మీ నాన్న తీసుకొచ్చారు అని త్రిపుర రాహుల్‌తో అంటుంది. లలిత ఇంటికి వచ్చేస్తుంది. కొడుకు కోడలికి ప్రసాదం ఇస్తుంది. మీ నాన్న రూంలో ఉన్నారా అని రాహుల్‌ని అడుగుతుంది. మామయ్య ఇంటికి రాలేదు అని మిథున చెప్తుంది. కోపంతో వచ్చేశారు అని నేను వచ్చా అని గుడిలో జరిగింది లలిత రాహుల్ వాళ్లకి చెప్తుంది. మిథున దేవా రోడ్డు మీద వెళ్తూ పొట్లాడుకుంటారు. ఇద్దరూ ఓ సిగ్నల్ దగ్గర ఆపుతారు. ఆ బైక్ వెనకే హరివర్ధన్‌ ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.