Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, దేవా రేషన్ తీసుకొని ఇంటికి వెళ్తుంటారు. మిథున దారిలో పానీ పూరి చూసి బైక్ ఆపిస్తుంది. దేవా తిడుతూ మిథునని తీసుకెళ్తాడు. ఇంతలో అలంకృత కూడా వస్తుంది. ఇద్దరూ పానీపూరీకి వచ్చారు అంటే ప్రేమ జంట కలిసిపోయారన్న మాట అంటుంది. రోడ్డు మీద ఏడుస్తుందని తీసుకొచ్చానని దేవా అంటాడు.

మిథున తింటూ దేవాకి కూడా తినిపించాలి అంటే దేవా కోప్పడతాడు. నువ్వు తిను అంటాడు. మిథున ప్లేట్ తర్వాత ప్లేట్ లాగించేస్తుంది. ఎన్ని ప్లేట్‌లు తింటావే అని దేవా అంటాడు. ఇష్టాన్ని చంపుకోలేనని మిథున అంటుంది. ఇక దేవా అయితే పానీ పూరి కాబట్టి అన్ని తింటున్నావ్.. అదే పచ్చి మిర్చి అయితే ఒక్కటి కూడా తినలేవ్.. నేను కూడా మిర్చి టైప్ అది ఎంత త్వరగా అర్థం చేసుకుంటే నీకు అంత మంచిది అని అంటాడు. మిథున పంతానికి పోయి అక్కడున్న మిర్చి తింటుంది. అలంకృత వద్దని చెప్పినా వినదు. దేవా ఆపాలి అని చూసినా ఆగదు.. ఒక్కసారి ప్రేమ పుడితే ఎంత మంట అయినా భరించగలను.. ప్రాణం పోయినా భరిస్తా తప్ప వెనక్కి తగ్గను వదిలేసి వెళ్లను గుర్తు పెట్టుకో అని మిథున అంటుంది.

అలంకృత దేవాతో బావ మా అక్క ఎంత మంచిదో అంత మొండిది.. మా నాన్న అంటే అక్కకి ప్రాణం ఒక్క నిమిషం కూడా వదిలి ఉండదు.. అలాంటిది మా నాన్నని వదిలేసి వచ్చేసింది.. నువ్వు అంటే తనకు ఎంత ప్రేమో తెలుసు కదా. దయచేసి అర్థం చేసుకో.. నీ మనసులో అక్క మీద ప్రేమని వదిలేసుకోకు. అంత మంచి అక్కని దూరం చేసుకోకు అని చెప్తుంది.

సత్యమూర్తి దసరా పండగకు డబ్బులు లేక ఇబ్బంది పడతాడు. రంగం, కాంతం డబ్బులు తీసుకొని వస్తుంటారు. సత్యమూర్తి రంగానికి ఒక పదివేలు ఉంటే ఇవ్వమని అంటాడు. అస్సలు లేవని దరిద్రంలో ఉన్నామని రంగం, కాంతం చెప్తారు. కావాలి అంటే వందో నూటయాభై ఇస్తామని అంటారు. అవి మీ దగ్గరే పెట్టుకొని దొంగచాటుగా బిర్యాని తీసుకొచ్చి తినండి అని శారద సెటైర్లు వేస్తుంది. ఇంతలో ఆనంద్ వచ్చి స్వీట్స్ ఇచ్చి దసరా పండగ అని పది వేలు ఇచ్చారని స్వీట్స్ కోసం 300 తీసుకున్నా అని మిగతా డబ్బు తండ్రి చేతిలో పెడతాడు. ఏంట్రా జాబు అని అంటే డబ్బు లెక్కలు చూసి బ్యాంక్‌లో కట్టాలని అని 20 లక్షలు వరకు కట్టాల్సి వస్తుందని చెప్తాడు. కాంతం నోరెళ్లబెడుతుంది.

శారద కొడుకుకి డబ్బుతో జాగ్రత్త అని చెప్తుంది. డబ్బుతో ముడి పడిన జాబ్‌ కదా అందుకే జాగ్రత్తరా అని సత్యమూర్తి చెప్తాడు. ఇక సత్యమూర్తి డబ్బు భార్య చేతిలో పెట్టి ఖర్చులకు వాడు అని చెప్తాడు. చూసి నేర్చుకోండిరా అని అంటుంది. ఇక రంగం కాంతంతో త్రిపుర వాళ్లు ఇంత మంచి జాబ్‌లో పెట్టి మంచి జీతం ఇస్తున్నారు అంటే వాడిని ఏం చేస్తారో అని అనుకుంటారు.

ఆదిత్య చెస్ ఆడుతూ దేవా, మిథునల్ని ఎంత దూరం చేయాలి అంటే అంత దగ్గరవుతున్నారు.. ఏదో చేయాలి అని పురుషోత్తాన్ని గుర్తు చేసుకొని దేవాకి చెక్ పెట్టాలి అంటే అటు నుంచి నరుక్కురావాలి అని అనుకుంటాడు. వెంటనే పురుషోత్తానికి కాల్ చేసి తాను క్రిమినల్ లాయర్.. జడ్జి హరివర్ధన్ అల్లుడు అని చెప్పి పురుషోత్తాన్ని కలవాలని అంటాడు. దేవా త్వరగా ఇంటికి వచ్చి కాంతంతో వదిన పెరుగు ఎక్కడ... పంచదార ఎక్కడ అని అడిగి రెండు కలిపి తీసుకొని వెళ్తాడు. ఏమైంది ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడని కాంతం అనుకుంటుంది.

దేవా వాటిని తీసుకెళ్లి మిథునకు తినమని చెప్తాడు. మిథున ఎంత చెప్పినా వినదు.. భరిస్తాను అంటుంది. దేవా చాలా బతిమాలుతాడు.. నువ్వు మిర్చి లాంటి వాడివి అని నేను నిన్ను భరించలేను అన్నావ్ కదా నేను నిన్ను కూడా భరించగలను అని అంటుంది. ఎంత చెప్పినా మిథున వినకపోవడంతో దేవా వెంటపడి మిథునని తిట్టి చెప్తే అర్థం కావడం లేదా అని అరిచి కూర్చోపెట్టి బలవంతంగా తినిపిస్తాడు. నీకు నాకు ముడి పడదు కుదరదు అని చెప్పడానికి మిర్చి తినమని చెప్పా.. కానీ వెనకా ముందు ఆలోచించకుండా అన్ని ఎందుకు తిన్నావ్ అని దేవా అడుగుతాడు. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు చెప్పడానికి అందుకు మిర్చి ఏంటి అవసరం అయితే విషయం కూడా తింటా అని అంటుంది. మిథున నేను మీ నాన్నకి మాట ఇచ్చా అని దూరం అవుతున్నా అనుకుంటున్నావ్ కానీ నేను నీకు దగ్గర అయితే కదా దూరం అవ్వడానికి అని అంటాడు. దేవా నువ్వు చెప్తుంది అబద్ధం అని నీకు తెలుసు నాకు తెలుసు అని అంటుంది. ఆకాశం, భూమి కలవడం ఎంత కష్టమో మనం కలవడం కూడా అంతే కష్టం అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.