Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా, మిథున కలిసిపోయారని కాంతం కడుపు మంటతో మండిపోతుంటుంది. మిథున అంతు తేల్చుతా అని కాంతం వెంటనే భానుకి కాల్ చేస్తుంది. భానుతో నీ జీవితం నాశనం అయిపోతుంది అని మిథున, దేవాలు కలిసిపోతున్నారు అని రొమాంటిక్‌ సాంగ్స్‌ వేసుకొని చాలా చాలా దగ్గరైపోయారని అంటుంది.

భాను బిత్తరపోయి ఏమైందక్కా అని అడిగితే కాంతం జరిగింది మొత్తం చెప్తుంది. దేవా ఇకు నీకు దక్కడు అని త్వరగా మేలుకో అని చెప్తుంది. మంటలు పెట్టి కాపురాలు కూల్చేయడంతో నువ్వు పీహెచ్‌డీ చేసేశావ్ బంగారం అని రంగం కాంతంతో అంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చని కాంతం అనుకుంటుంది.

మిథున కాలు నొప్పితో బాధ పడుతుంటుంది. శారద మిథున దగ్గరకు వెళ్తుంది. నిజంగానే కాలు బెనికిందా అమ్మా,, వాడు నిన్ను ఎత్తుకొని వస్తుంటే నేను ఏదో ఏదో ఉహించుకున్నా అని శారద అంటుంది. శారద కాలు చూసి ఏం కాదులే మామూలుగానే బెనికింది కొంచెం మసాజ్ చేస్తే చాలు అని అంటుంది. నేను వెంటనే నడవాలి అత్తయ్య లేదంటే నన్ను ఎత్తుకోలేక మా ఆయన ఆల్లాడిపోతాడని మిథున అనడంతో అత్తాకోడళ్లు ఇద్దరూ నవ్వుకుంటారు. ఉన్నట్టుంది శారద డల్ అయిపోతుంది. ఏమైంది అని మిథున అడిగితే ఒక అమ్మలా కూతురి కాపురం గురించి అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నా.. రెండు రోజులు మీ ఇద్దరే ఉన్నారు కదా.. మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నారా.. మీ మధ్య చనువు ఏర్పాడిందా.. మీ మధ్య ఏమైనా జరిగిందా అని శారద అడుగుతుంది. మిథున చాలా బాధగా ఆయన నన్ను ఓ పులిని చూసినట్లు చూస్తున్నారు.. కానీ పర్లేదు అత్తయ్య ఆయన్ను నేను అర్థం చేసుకున్నా అని అంటుంది. దాంతో పిచ్చి పిల్ల చిన్ని వాటికే సంతోషపడిపోతావ్ అని శారద అంటుంది.

దేవా గ్యారేజ్‌ దగ్గరకు వెళ్తే ఈ రెండు రోజులు ఎక్కడికి వెళ్లావ్ అన్న అని అడుగుతారు. దాంతో దేవా చిన్ననాటి ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తానురా అని అంటాడు. ఇంతలో భాను అక్కడికి వస్తుంది. రేయ్ ఎంతమందినిరా ఇలా మాటలతో మోసం చేస్తావ్ అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని దేవా అంటే మరేంట్రా వాళ్లు రెండు రోజులు నువ్వు ఎక్కడికి వెళ్లావ్ అంటే చిన్నప్పటి ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లా అన్నావ్.. నిజంగానే చిన్నప్పటి దోస్త్‌ని కలిశావా.. ఇంటికి తాళం వేసి ఇంటి లోపల నా భార్యతో కలుకుతున్నా అని ధైర్యంగా చెప్పు.. పెళ్లాంతో ఎంజాయ్ చేయడానికి ఫోన్ ఆపేశా అని చెప్పు అని అంటుంది. నువ్వు బయటకు చెప్పేవి అబద్ధాలు లోపల మాత్రం ఒకటి ఉంది.. అని అంటుంది. ఏం జరిగిందో తెలీకుండా మాట్లాడకు అని దేవా అంటాడు.

దేవా కోపంగా అసలు నీ గోల ఏంటి.. నేను ఎక్కడుంటే నీకు ఏంటి.. నేను ఎవరితో ఉంటే నీకు ఎందుకు అని అడుగుతాడు. భాను ఏడుస్తూ నాకేంటినా నువ్వు ఆ మిథునతో ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు అంటుంది. దానికి దేవా నేను నిన్ను ప్రేమించానా.. నువ్వు ఇక్కడికి ఇంకోసారి రాకుండా ఉండటానికి నీకో మాట చెప్తున్నా విను.. మిథున నా భార్య.. నేను తాళి కట్టిన నా భార్య.. మేం ఒకే ఇంట్లో ఉంటే నీకు ఏంటి.. ఎత్తుకుంటే నీకు ఏంటి.. బయట ఉంటే నీకు ఏంటి.. అన్నింటికంటే ముఖ్యంగా ఏకాంతంగా ఉంటే నీకు ఏంటి అని అంటాడు. ఇంకోసారి నన్ను టార్చర్ చేయకుండా పెళ్లి చేసుకొని నీ బతుకు నువ్వు బతుకు అని అంటాడు. భాను ఏడుస్తూ నన్ను ఇంత బాధ పెట్టావ్ ఏదో ఒక రోజు నువ్వు ఇంతకంటే ఎక్కువ బాధ పడకుంటే అలా అడుగు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది.

ఆనంద్‌ మేనేజర్‌తో పది లక్షలు క్యాష్ అయింది బ్యాంక్‌లో వేయాలి.. సెక్యూరిటీని ఏర్పాటు చేయించమని అంటాడు. సెక్యూరిటీకి వేరే పని మీద పంపాను.. మీరు ఒంటరిగా వెళ్లి కట్టేయండి అని చెప్పి కారు కూడా తీసుకెళ్లమని మేనేజర్ చెప్తాడు. కనీసం స్టాఫ్‌ని అయినా తీసుకెళ్లొచ్చా అని ఆనంద్ అంటే అవసరం లేదు అని మేనేజర్ అంటాడు. పది లక్షల బ్యాగ్‌తో ఆనంద్ బయల్దేరుతాడు. మేనేజర్ ఎవరికో కాల్ చేసి ఒంటరిగా వస్తున్నాడు పని కానివ్వండి అని చెప్తాడు.

దేవా ఇంటికి రాగానే శారద దేవాతో మిథున కాలు బెనికింది కదా మర్దన చేయరా అంటే నాకు ఇలాంటి పనులు చెప్పకు అమ్మా అని దేవా వెళ్లిపోతాడు. సత్యమూర్తి దేవా ప్రవర్తనకు బాధ పడతాడు. శారద భర్తతో దేవా ఎలా అంటున్నాడో చూడండి అని అంటుంది. దేవా వాడి మూర్ఖత్వంతో తన జీవితం నాశనం చేసుకుంటున్నాడు. బంగారం లాంటి అమ్మాయికి బాధ పెడుతున్నాడని అంటాడు. భర్తలా వాడు పట్టించుకోకపోయినా అత్తామామల్లా మనం పట్టించుకోవాలి.. ఒక అమ్మలా నువ్వే తనకు సేవలు చేయు అని అంటాడు. దేవా గదిలోకి వెళ్లే సరికి మిథున నొప్పి అని కాలు పట్టుకొని అరుస్తుంది. సైలెంట్‌గా పడుకో గోల ఏంటి అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.