Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథునని తన పుట్టింట్లో వదిలేసి వచ్చిన దేవాకు మిథున ఆలోచనలే వస్తాయి. ఇదేంటి నేను తన గురించి ఆలోచిస్తున్నాను అని తనని తానే తిట్టుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు కాదు వదిలేసి వచ్చినా తనెందుకు గుర్తొస్తుంది టార్చర్ పెడుతుంది అని అనుకుంటాడు. ఇక మిథున ఏం మాట్లాడకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది. మిథునని తండ్రీ చూస్తూ మురిసిపోతాడు. మిథున చెల్లి మళ్లీ నీ రాకతో ఇంటికి కల వచ్చిందని చెప్పి జ్యూస్ ఇస్తుంది. ఇక మిథున బామ్మ నీకు పట్టిన గ్రహణం వదిలేసిందని అంటుంది. అందరూ మిథునని గారాబం చేస్తారు. తల్లి లలిత గోరు ముద్దలు పెడుతుంది. కానీ మిథున ఎవరితోనూ ఒక్క మాట మాట్లాడదు.

లలిత కూతురికి తినమని చెప్పినా తినదు. తాళి కట్టిన వాడు రౌడీ అయినా గూండా అయినా వాడితోనే జీవితం అని వెళ్లిపోయావ్ కానీ వాడు నిన్ను ఎలా వదిలేశాడో చూశావా అని జడ్జి కూతురితో అంటాడు. అలాంటి వాడినా నువ్వు నమ్మి మా అందరినీ వదిలేసుకొని వెళ్లిపోయావా అని అడుగుతాడు. ఆ రౌడీ కోసం ఈ కన్నతండ్రిని కూడా వదిలేసి ఎదురించి వెళ్లిపోయావ్ అని అంటాడు. తండ్రి మాటలకు మిథున ఏం మాట్లాడకుండా అలా వింటూనే ఉంటుంది. జరిగింది ఓ పీడ కలలా మర్చిపోయి మెడలో నుంచి తాళి తీసేయమని చెప్తారు. తండ్రి మాటలు విన్న మిథున గుడిలో తన పెళ్లి గుర్తు చేసుకొని తాళి తీయను అని తల అడ్డంగా ఊపుతుంది.

దేవా తీన్మార్ డ్యాన్స్ వేసుకుంటూ ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరిని పిలుస్తాడు. పెద్దన్న, చిన్నన్న, పెద్ద వదిన, చిన్న వదిన అమ్మా అని అందరిన్ని పిలుస్తాడు. దేవాని చూసి తల్లి ఏడుస్తుంది. జీవితాంతం జైలులో ఉండిపోతావేమో అని భయపడ్డానని ఏడుస్తుంది. దాంతో దేవా అదంతా వదిలేయమని మీకు ఇంకో శుభవార్త చెప్తానని అంటాడు. మోడ్రన్ మహాలక్ష్మీని ఇప్పుడే తన ఇంటి దగ్గర వదిలేసి వచ్చానని ఇక మనం హ్యాపిగా ఉండొచ్చని నెత్తి మీద ముళ్ల కిరీటం తొలగిపోయిందని అంటాడు. మిథునని వదిలించుకున్నందుకు అందరి ముందు తీన్మార్ డ్యాన్స్ వేస్తూ అందరికీ పార్టీ ఇస్తానని సందడి చేస్తాడు. ఎవరూ కిక్కుమని మాట కూడా మాట్లాడరు.

ఇంతలో దేవాకి గజ్జెల శబ్ధం వినిపిస్తే మహా తల్లి వెళ్లి పోయినా ఇంకా ఇంట్లోనే తిరుగుతున్నట్లుందని అనుకుంటాడు. ఇంతలో మిథున చేత చీపురు పట్టుకొని నిల్చొవడంతో దేవా షాక్ అయిపోతాడు. నిన్ను మీ ఇంట్లో వదిలేశాను కదా మళ్లీ ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. మిథున సీరియస్‌ లుక్ ఇచ్చి దేవాకి రౌండ్ అవుతుందని అన్నట్లు చీపురు సర్దుతుంది. దేవా ప్రశ్నలు అడిగితే పని చేసుకో నివ్వు అని అంటుంది. నిన్ను మీ ఇంట్లో వదిలేశాను కదా మళ్లీ ఎందుకు వచ్చావ్ అని దేవా అడిగితే మెడలో తాళి చూపిస్తుంది. దాంతో దేవా గోడకు తల బాదుకుంటాడు. దేవాతో తన తల్లి నీకున్న సమస్యల్లో ఇదే పెద్ద సమస్య దీన్ని నువ్వే వదిలించుకో అని అంటే దానికి మిథున నేను సమస్య కాదు.. ఈ ఇంటి కోడలిని. నాకు బంధం అయినా బాధ్యత అయినా.. చావు అయినా బతుకు అయినా అన్నీ నా అత్తారింట్లోనే అని తెగేసి చెప్తుంది.

దేవా మళ్లీ మొదలు పెట్టిందిరా అనుకొని తల పట్టుకుంటాడు. దేవా చిన్న అన్న చిన్న వదిన గోదారి గట్టు మీద రామ చిలుకవే అని గెంతులేస్తారు. దేవాతో తన పెద్ద అన్న నీ వల్ల ఇంట్లో ఎవరికీ ప్రశాంతత లేదు సమస్య పరిష్కరించురా అంటే ఇంతలో దేవా తండ్రి వచ్చి వీడి వల్ల ప్రశాంతత కాదు.. భూమికి భారం అని అంటాడు. అసలు వీడు పుట్టకపోయి ఉంటే బాగుండేదని అనుకుంటున్నానని అని వెళ్లిపోతారు. ఆ మాటలు విన్న మిథున కూడా బాధ పడుతుంది. దేవా మిథునని కోపంగా చూసి బయటకు వెళ్లిపోతాడు. ఇక మిథున తండ్రి మిథున గురించి ఆలోచిస్తూ బాధ పడతాడు. మిథున అన్నావదినలు ఆయన్ను ఓదార్చుతారు. మిథునని మన ఇంటికి రప్పిస్తేనే మనతో పాటు మిథున సంతోషంగా ఉంటుందని ఈ సారి చట్ట పరిధి దాటి ప్రయత్నించమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: నీకు నాకు ఏ సంబంధం లేదు: మిథునని పుట్టింట్లో వదిలేసిన దేవా.. దేవాపై పిచ్చి ప్రేమలో భాను!