Nuvvunte Naa Jathaga Serial Today Episode గుడిలో మిథున ఓ ప్రేమ జంటకు పెళ్లి చేస్తుంది. దాంతో దేవ ఆ జంటని విడదీయాలని ప్రయత్నిస్తాడు. తాళి తెంచి ఇంటికి రమ్మని ఆ అమ్మాయితో చెప్తే మిథున ఒప్పుకోదు. దాంతో దేవ మిథున మెడలో తాళి కట్టేస్తాడు. మిథున గొప్పింటి అమ్మాయి. దేవ బస్తీకి చెందిన వాడు. తాళి కట్టిన వాడితోనే జీవితం అనుకొని మిథున దేవ వెనకాలే బస్తీకి వచ్చేస్తుంది. దేవ మాత్రం తనకు పెళ్లి ఇష్టం లేదని బుద్ది చెప్పాలని తాళి కట్టానని మిథునని వెళ్లిపోమన్నా అక్కడే మిథున ఉంటుంది.

దేవ తన ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తే మిథున కూడా తన వెనకాలే వెళ్తాడు. అక్కడ ఓ వ్యక్తి తన భార్యని కొడితే మిథున వాడిని చితక్కొడుతుంది. ఇక మిథున దేవా వాళ్ల దగ్గరకు వస్తే దేవా ఫ్రెండ్స్ మిథునని ఆటో ఎక్కిస్తామని అంటారు. దాంతో దేవా వద్దని తానే తీసుకెళ్తానని అంటాడు. దేవా మిథునని తన బైక్ ఎక్కమంటే మిథున దేవాలో మార్పు వస్తుందనుకొని బైక్ ఎక్కుతుంది. దేవా నిజంగానే మారాడా మిథునని భార్యగా అంగీకరించాడేమో అనుకొని చాలా సంతోషపడతారు దేవా ఫ్రెండ్స్. అయితే దేవా మిథునని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావేంటి అని మిథున అడిగినా దేవా సమాధానం చెప్పుకుండా మిథున ఇంటి వాళ్లని పిలుస్తాడు. అందరూ బయటకు వస్తారు. మిథున ఫ్యామిలీ మెంబర్స్ మిథునని చూసి చాలా సంతోషిస్తారు. దగ్గరకు వెళ్లబోతే మిథున తండ్రి జడ్జి వాళ్లని ఆపుతాడు.

దేవా: ఆ రోజు గుడిలో మీ అమ్మాయికి బుద్ధి చెప్పాలని తాళి కట్టాను కానీ కానీ ఆ తాళే నా పాలిట శాపం అయింది సార్. ఒక వైపు మీ అమ్మాయి మరోవైపు మీరు కేసులు మీద కేసులు పెట్టి నన్ను టార్చర్ చేస్తున్నారు. నేను ఓ చిన్న రౌడీని సార్ ఏవో దందాలు చేసి బతుకుతున్నా. నా పని నన్ను చేసుకోనివ్వండి సార్ మీ మధ్యలోకి వచ్చి మీతో పోరాడే శక్తి నాకు లేదు సార్. మీతో పడలేకపోతున్నా సార్ నన్ను వదిలేయండి సార్. అందుకే శాంతి చర్చలతో ఈ యుద్దానికి ముగింపు పలకాలి అని నేనే మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చా. మీ ఫ్యామిలీ మొత్తం గుంపులు గుంపులుగా చెప్తున్నా మీ అమ్మాయి వినడం లేదు అందుకే నేను తనని మీకు అప్పగిస్తున్నా. ఇదిగో మీ అమ్మాయి తీసుకోండి ఇక నుంచి మీరు ఎవరో నేను ఎవరో మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక మీరు నా జోలికి రావొద్దు. నన్ను వదిలేయండి. మహానుభావులకు వందనం సెలవు.
మిథున: దేవా ఆగు ఏంటి ఓవర్ చేస్తున్నావ్. నన్ను ఇక్కడి దించే ఎక్కడికి వెళ్తున్నావ్. నన్ను నీతో తీసుకెళ్లు.
దేవా: అమ్మా తల్లీ నా నెత్తి నొప్పిని వదిలేసి వెళ్తున్నా నన్ను వదిలేయ్ నీకు దండం పెడతా. నన్ను నా ఇంట్లో ప్రశాంతంగా వదిలేయ్ నువ్వు నీ ఇంట్లో ప్రశాంతంగా ఉండు.
మిథున: అరే చెప్తే అర్థం కాదా నీకు నన్ను తీసుకెళ్లు.

మిథునని దేవా వదిలేసి వెళ్లిపోతాడు. మిథున చాలా ఏడుస్తుంది. మరోవైపు దేవా కోసం భాను చాలా బాధపడుతుంది. మిథున అనవసరంగా తన జీవితంలోకి వచ్చిందని తిట్టుకుంటుంది. భానుని తన తల్లి దేవాని మర్చిపోమని అంటుంది. దేవా ముందు మంచి వాడే తర్వాత రౌడీ అయిపోయాడు మారిపోతాడని అంటుంది. దేవాని పెళ్లి చేసుకుంటే నీ పసుపుకుంకుమలు ఎప్పుడు పోతాయో అని అంటుంది తల్లి. దానికి దేవానా భర్త అని తన రాజా తనని పెళ్లి చేసుకుంటాడని భాను తెగేసి చెప్తుంది. దేవా నిన్ను ప్రేమించడం లేదు కదా వదిలేయ్ అని తల్లి ఎంత చెప్పినా భాను వినదు. కూతురికి నచ్చచెప్పాలని భాను తల్లి చాలా ప్రయత్నిస్తుంది కానీ భాను వినదు. మరోవైపు మిథున ఆలోచిస్తూ కూర్చొని ఉంటే తన తండ్రి ప్రేమగా మిథునని చూస్తూ చిన్నతనం మొత్తం గుర్తు చేసుకుంటాడు. మిథున తల్లి లలితతో పాటు చెల్లెళ్లు అందరూ సందడిగా మిథున కోసం వంటలు చేస్తారు. దేవా మిథున గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మిథున తన వెంటే వచ్చినట్లు కల కంటాడు. కంగారు పడతాడు. తనెందుకు నాకు గుర్తొస్తుందని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: సంధ్య ఫోన్ కాల్ వినేసిన సత్య.. సంజయ్‌కి వార్నింగ్.. కోడలికి ఉచ్చు బిగించిన మామ!