Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఇంటికి రావడంతో మిథున గొడవ గురించి అడుగుతుంది. పురుషోత్తం దగ్గర రౌడీయిజం మానేస్తా అని చెప్పా.. అందుకే అతని కొడుకు అనుచరులు నాతో గొడవకు వచ్చారు.,. నీ కోసం తప్పుగా మాట్లాడారు అందుకే కోపం ఆపుకోలేక గొడవ పడ్డానని దేవా అంటాడు.

కోపం కంట్రోల్ చేసుకోవాలి దేవా.. మాటలతో రౌడీయిజం మానేస్తున్నా అని చెప్పడం కాదు.. చేతల్లోనో నిజంలోనో కాదు.. కోపం తగ్గించుకుంటేనే అది సాధ్యం అవుతుంది. ప్రస్తుతం మనకి రెండు కుటుంబాల అండ లేదు.. ప్రస్తుతం మనం అందరూ ఉన్న అనాథలం.. తిరిగి మనల్ని వాళ్లు కలుపుకునేలా మనం చేయాలి.. దేవా మారాడు.. నన్ను బాగా చూసుకుంటాడు అనే నమ్మకంతో వచ్చేశా.. నా నమ్మకం నిలబెట్టు దేవా.. నా పుట్టింటి వాళ్ల దగ్గర తలెత్తుకునేలా చేయ్ అని మిథున దేవా చేయి పట్టుకొని అడుగుతుంది. దాంతో దేవా మిథునని పట్టుకొని నేను నీ కోసమే బతుకుతా అని ఇచ్చిన మాట కోసం.. మీ వాళ్ల ముందు నువ్వు తలెత్తుకునేలా చేయడానికి మరోసారి మాటిస్తున్నా ఇక నుంచి ఎవరితోనూ గొడవలు పెట్టుకోను.. కావాలని రెచ్చగొట్టినా సైలెంట్‌గా ఉంటా అని అంటాడు. మిథున దేవాని హగ్ చేసుకొని ఏడుస్తుంది.

దేవా రాత్రి ఇంటికి వెళ్తుంటే ఓ బామ్మ దేవాని ఆపి మాట్లాడి.. నువ్వే ఈ పూల కొట్టు పెట్టించావ్ మర్చిపోయావా అని పరిచయం చేసుకుంటుంది. త్వరలోనే మీ ఇంట్లో వాళ్లతో కలిసిపోతావులే అని చెప్పి మిథునకు ఇవ్వమని మల్లెపూలు ఇస్తుంది. దేవాకి కోపం తగ్గించుకోమని చెప్తుంది. మరోవైపు మిథునకు లలిత కాల్ చేసి మాట్లాడుతుంది. మిథున తల్లితో దేవా జాబ్ చూసుకుంటా అని చెప్పాడని.. గొడవలకు వెళ్లను అని చెప్పాడని దేవా బంగారం అమ్మా అని చెప్తుంది. వీలు చూసుకొని రేపు వస్తానని లలిత అంటుంది. నాన్నకి తెలిస్తే నీ మీద కోప్పడతారు వద్దమ్మా అని అంటుంది. పర్లేదు అని లలిత ఎవరికీ తెలీకుండా వస్తా అంటుంది.

దేవా మల్లెపూలు తీసుకొచ్చి మిథునకు ఇవ్వడానికి ఇబ్బంది పడతాడు. ఏం తీసుకొచ్చావ్ అని మిథున అడిగితే ఏం లేదు అనేస్తాడు. మిథున ఆటపట్టించి దేవా చేతిలో పూలు చూస్తుంది. మొదటి సారి ఇవ్వడం కదా కంగారుగా ఉందని దేవా అంటాడు. ఇలా చేతికి ఇవ్వడం కాదు తలలో పెట్టు అని మిథున చెప్తే దేవా మిథున తలలో పువ్వులు పెడతాడు. మిథున దేవా ఒకర్ని ఒకరు చూసుకుంటూ ఉంటే లక్కీ పాప చూసేసి అమ్మ బాబాయ్ పిన్నికి పువ్వులు పెట్టాడు అని అరుస్తుంది. దాంతో దేవా, మిథున పరుగున పాప వెనక సత్యమూర్తి ఇంట్లోకి వెళ్తాడు. పాప ఇంట్లో అందరికీ దేవా బాబాయ్ పూలు పెట్టాడని చెప్పేస్తుంది. దేవా, మిథునని ఇంట్లో చూసి అందరూ షాక్ అయిపోతారు.

సత్యమూర్తి శారద, ప్రమోదిని తిడతాడు. పాప ఎక్కడికి వెళ్తుందో చూడరా అని పాపని తీసుకెళ్లమని చెప్తాడు. ఇక కాంతం మామయ్యని రెచ్చగొట్టాలి అని మీరు గుమ్మం తొక్కొద్దని చెప్పినా ఇంట్లోకి వచ్చారని రెచ్చగొడుతుంది. వదినా ఎందుకు అలా అంటారు.. ఏదో పొరపాటున పాప వెనక పరుగెత్తుతూ వచ్చేశామని అంటాడు. అయినా కాంతం రెచ్చగొడుతూ ఉంటే ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేస్తారు అని దేవా అడుగుతాడు. సత్యమూర్తి దేవాతో నీకు ఎప్పుడో నీళ్లు వదిలేశా అయినా ఏ ముఖం పెట్టుకొని నా ఇంట్లోకి వచ్చావ్‌రా నా ఇంట్లోకి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతాడు. నాన్న మిమల్ని బాధ పెట్టేలా ప్రవర్తించినందుకు సగం చచ్చిపోయాను.. ఇప్పుడు పూర్తిగా చంపేయకండి.. నేను మారిపోయాను.. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అంటాడు. మిథున కూడా దేవా మారిపోయాడు.. రౌడీయిజం వదిలేశాడు అని అంటుంది. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వీడిని నమ్మను క్షమించను అని సత్యమూర్తి చెప్పి ఇద్దరినీ ఇంటి నుంచి వెళ్లిపోమని అంటాడు.

మిథున, దేవా వెళ్లిపోతారు. మరోవైపు పురుషోత్తంతో తన మనుషులు వెళ్లి దేవా మనతో లేడని తెలిసి మన అపొజిషన్ వాళ్లు ప్లాన్స్ చేస్తున్నారని అంటాడు. దేవా లేకపోవడం వల్ల నా రాజకీయం నాశనం అయ్యేలా ఉందని పురుషోత్తం అంటాడు. రుద్ర తల్లితో దేవా మారింది వాడి పెళ్లాం కోసమే కదా ఆ పెళ్లమే లేకుండా చేస్తా ఆట మిథునతో మొదలు పెడతా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.