Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా, మిధునని తీసుకొని ఇంటికి బయల్దేరుతాడు. మిధున పానీ పూరి తినిపించమని అనడంతో దేవా తిడుతాడు. దాంతో మిధున నేను ఇంటికి వెళ్లిపోతాను అంటుంది. దాంతో దేవా నాకు అర్జెంటుగా పని ఉంది రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లి తర్వాత తినిపిస్తాను అంటే మిధున కుదరదు అని అంటుంది. దాంతో చచ్చినట్లు దేవా మిధునని తీసుకొని పానీ పూరి దగ్గరకు తీసుకెళ్తాడు.

మిధున దేవా కోసం కూడా పానీ పూరి తీసుకుంటుంది. దేవాకి తినమంటే తినను అంటాడు. మిధున రెండు ప్లేట్లు దేవా చేతిలో పెట్టి వెళ్లిపోతాను అంటే దేవా బతిమాలి తాను తింటాడు. దేవా పొలమారితే మిధున తల మీద కొడుతుంది. ఇక మిధున పానీ పూరి ఎలా తినాలా అని దేవాకి చెప్తుంది. నీ సెటిల్ మెంట్ హార్డ్‌ వేర్‌కి ఇలాంటివి తెలీదని అంటుంది. ఇక దేవాకి తినిపిస్తాను అంటే దేవా వద్దు అంటే మా ఇంటికి వెళ్లిపోతా అంటుంది. దాంతో దేవా మిధున తినిపిస్తే తింటాడు.

దేవా మిధునని వాళ్ల ఇంటి దగ్గర వదిలేశాడు ఇక మాకు అడ్డు లేదు ఈ రోజు పార్టీ ఇస్తాను అని భాను తన ఫ్రెండ్స్‌కి చెప్తుంది. ఇంతలో దేవా మిధునని తీసుకొని వెళ్లడంతో భాను షాక్ అయిపోతుంది. మిధున భానుని చూసి బండి ఆపిస్తుంది. ఎందుకు అని దేవా అడిగితే ఒకసారి బైక్ వెనక్కి తిప్పి మళ్లీ చెప్పినప్పుడు రివర్స్ చేయమని అంటుంది. భాను చూస్తుంటే భానుని ఉడికించినట్లు భాను ఎదురుగా తిరుగుతుంది. భానుని చూసి మిధున బాయ్ అని వెటకారంగా చెప్తుంది.

సూర్యకాంతం త్రిపురకు కాల్ చేసి మిధున మీ ఇంటికి రాగానే తనని పట్టించుకోవడం లేదని కేజీ బంగారం, కోటి రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తుంది. దాంతో త్రిపుర సూర్యకాంతాన్ని తిడుతుంది. కారణం చెప్పకుండా తిట్టిందని కాంతం ఏడుస్తుంది. ఇక దేవా, మిధునని తీసుకురావడం రంగ, కాంతం చూసి బిత్తరపోతారు. మిధున చేయి అందివ్వడంతో దేవా మిధునని చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. దేవా అన్నలు వదినలు చూసి బిత్తరపోతారు. సూర్యకాంతంతో మిధున అక్క నోరు మూయండి దోమలు ఈగలు వెళ్లిపోతే ఎలా అంటుంది. ఇక రంగాతో బావగారు బాగున్నారా అని అంటుంది. షాక్‌లో ఉన్నానని రంగ చెప్తాడు.

మిధున అత్తని చూసి ఏం మాట్లాడకుండా నిల్చొంటుంది. శారద కూడా మిధునను చూస్తూ ఉండిపోతుంది. మిధున అత్త కాళ్లకి మొక్కడంతో శారద తల మీద చేయి వేస్తుంది. దాంతో మిధున చాలా సంతోషంగా ఫీలవుతుంది. ఫైల్ ఇవ్వమని దేవా అడిగితే గుర్తు చేసుకుంటున్నాను అని మిధున అంటుంది. దేవా షాక్ అయిపోతాడు. ఇక సూర్యకాంతం వాళ్లతో ఈయన మా ఇంటికి వచ్చి మన ఇంటికి పద మన ఇంటికి పద అని ఒకటే గొడవ అందుకే వచ్చేశా అంటుంది. ఇక ఇళ్లంతా తిరిగి ఫైల్ ఎక్కడ పెట్టానా అని వెతుకుతుంది. నాతో ఆటలా అని దేవా అడుగుతాడు. పురుషోత్తం దేవాకి వరస పెట్టి ఫోన్లు చేస్తే దేవా మిధునను బతిమాలుతాడు. దాంతో మిధున దేవుడి ఫొటోల వెనక దాచిపెట్టి ఉంటుంది. వాటిని తీస్తుంది. అందరూ నోరెళ్ల పెడతారు. నన్ను మన ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ భర్త గారు అంటుంది. ఇంటికి వచ్చి నీ సంగతి చెప్తా అని దేవా పరుగులు తీస్తాడు. నువ్వు మామూలు దానివి కాదు బాగా సెటిల్ అయిపోయావని సూర్య కాంతం అంటుంది. కోపంతో సూర్యకాంతం భర్తని కొరికేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!