Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న సంతోషంలో సూర్యకాంతం కళ్లజోడు పెట్టుకొని చేతిలో ఇళ్లు తుడిచే మాబ్ పట్టుకొని మైకిల్ జాక్షన్ పాటకు డ్యాన్స్ చేస్తుంది. ప్రమోదిని వచ్చి ఏమైందని అడిగితే మిధున వెళ్లిపోయిందనే సంతోషంలో డ్యాన్స్ చేస్తున్నా అని చెప్తుంది. ఇంతలో మార్కెట్ నుంచి సత్యమూర్తి రావడంతో సైలెంట్ అయిపోతుంది.

దేవా పురుషోత్తంతో ఫోన్‌లో మాట్లాడి డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చాస్తా అని చెప్తాడు. దేవా అన్నలు డాక్యుమెంట్లు ఏంటి అని అడిగితే పురుషోత్తం అన్న పేదలకు ఇళ్ల పట్టాలు పంచుతారని పురుషోత్తం అన్నని రౌడీ అనేవాళ్లకి మంచితనం గుర్తించమని చెప్పండి అని తండ్రిని ఉద్దేశించి అంటాడు. దాంతో సత్యమూర్తి" ఉత్తమ గుణములు నీచునకెత్తెరుగున గలుగనేర్చు నెయ్యడలం దా నెత్తిచ్చి కరగిపోసిన నిత్తడి బంగార మగునె ఇలలో సుమతి' అని పద్యం చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇత్తడి బంగారం అవ్వదు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీచులు ఉత్తములు అవ్వరు అని చెప్తారు. దాంతో దేవా వెళ్లిపోతాడు.

మిధున, ఆదిత్య మాట్లాడుకుంటే ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్తారు. త్రిపుర మామయ్యతో మిధున చాలా ప్రశాంతంగా ఉంది ఈ టైంలో ఆదిత్యతో పెళ్లి గురించి మాట్లాడమని అంటుంది. హరివర్దన్ మిధునని పిలిచి నీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకు తీసుకెళ్లాడు. మరోవైపు దేవా డాక్యుమెంట్ల కోసం బీరువాలో వెతుకుతాడు. అందులో డాక్యుమెంట్లు కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్లందరినీ పిలిచి అడుగుతాడు. ఎవరూ తమకు తెలీదని చెప్తారు. డాక్యుమెంట్స్ ఎవరు తీశారో మర్యాదగా చెప్పమని అంటాడు. ఎవరూ తమకు తెలీదని మా మీద అరవొద్దని అంటాడు. మరోవైపు పురుషోత్తం ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. దేవా చాలా టెన్షన్ పడతాడు.

హరివర్ధన్ మిధునతో ప్రేమగా మాట్లాడి ప్రతీ క్షణం నీ గురించే ఆలోచిస్తాను అని నీ జీవితాన్ని భవిష్యత్‌ని అద్భుతంగా మార్చడం కోసం ఓ మంచి నిర్ణయం తీసుకున్నానని చెప్తారు. నిర్ణయం ఏంటి అంటే మిధున తల్లి ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని అంటుంది. ఆదిత్యకు నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని మిధునతో చెప్తారు. మిధున షాక్ అయిపోతుంది. మరోవైపు దేవా పెద్దన్న గది మొత్తం వెతుకుతాడు. తర్వాత సూర్యకాంతం వాళ్ల గది వెతుకుతా అంటే శ్రీరంగం, సూర్యకాంతం బిత్తరపోతారు. గదిలో వెతికితే తాము దాచుకున్న బంగారం, డబ్బు అన్నీ దొరికిపోతాయని చాలా టెన్షన్ పడతారు. మా గదిలో వెతికితే మీ అన్నయ్యకి విడాకులు ఇస్తానని అంటుంది.

శారద సూర్యకాంతాన్ని తిడుతుంది. దాంతో సూర్యకాంతం మా గదిలో వెతికితే దొంగలా అవుతుందని మా గదిలో వెతికితే వెళ్లిపోతా అని అంటుంది. దేవా సూర్యకాంతం వాళ్ల గదిలోకి వెళ్లబోతే శ్రీరంగం, సూర్యకాంతం అడ్డుకుంటారు. ఇక సూర్యకాంతం మామయ్యకి కంప్లైంట్ ఇస్తుంది. దేవా ఇళ్లు వదిలి వెళ్లిపోమని చెప్తున్నాడని రౌడీయిజం చేస్తున్నాడని చెప్తుంది. ఇక సూర్యకాంతం దేవాతో నువ్వు తాళి కట్టిన మిధున ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఉండొచ్చని అంటుంది. మిధునకు కాల్ చేసి అడగమని అంటారు. ఆ దరిద్రానికి కాల్ చేయాలా అని దేవా అనుకుంటాడు.

మిధున నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్న టైంలో దేవా మిధునకు కాల్ చేస్తాడు. మిధున చాలా సంతోషిస్తుంది. నువ్వుతూ ఫోన్ పట్టుకొని పరుగులు తీస్తుంది. ఎక్కడ మాట్లాడాలా అని ఇళ్లంతా పరుగులు తీస్తుంది. చివరకు ఆరు బయటకు వెళ్లి మాట్లాడుతుంది. మిధున అంత సంతోషంతో వెళ్లింది అంత ముఖ్యమైన కాల్ ఎవరిది అయింటుందని అందరూ అనుకుంటారు. కాల్ లిఫ్ట్ చేసి ఎవరు.. అంటే దేవా నేను అంటే నేను మీ పేరా చాలా బాగుంది.. అని దేవాని విసిగిస్తుంది. నేను ఎవరో తెలీదా నా నెంబరు లేదా ఓవర్ చేస్తున్నావా అంటే మీరు తెలీదు సార్ మీ నెంబరు లేదు అంటుంది. నా వాయిస్ గుర్తు పట్టలేదా అంటే ఆ గుర్తొచ్చింది రౌడీ దేవా కదా అంటుంది. దేవాకి మండిపోతుంది.

దేవా డాక్యుమెంట్స్ గురించి అడుగుతాడు. నాకు తెలీదు సార్ అని మిధున అంటే అవి నువ్వే తీశావని నాకు తెలుసు నేను వాటిని దాయడం నువ్వు చూశావా ఎక్కడ ఉన్నాయో చెప్తావా చెప్పవా అని అంటాడు. దాంతో మిధున ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ రౌడీ దేవా అని అంటే దేవా తిడతాడు. దాంతో మిధున ఫోన్ కట్ చేస్తాస్తా అంటే దేవా వద్దని బతిమాలుతాడు. ఇక మిధున తనని వచ్చి ఇంటికి తీసుకెళ్తే ఎక్కడ డాక్యుమెంట్లు పెట్టానో గుర్తొస్తుందని.. బండీ తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లు అంటుంది. దాంతో నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా అని దేవా అంటే నీకు డాక్యుమెంట్లు కావాలి అంటేరా లేదంటే లేదు అని ఫోన్ పెట్టేస్తుంది. టైం చూసి నాతో ఆడుకుంటుందని దేవా అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!