Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, రిషిల మెహందీ వేడుక మొదలవుతుంది. ముందు హరివర్థన్‌, లలిత డ్యాన్స్ చేస్తారు. తర్వాత మిథున, రిషిలకు అలంకృత డ్యాన్స్ చేయమని అంటుంది. మిథున తనకు ఇష్టం లేదు వదిలేయ్ అంటుంది. ఇక రిషి మా ఇద్దరి వంతు నువ్వే డ్యాన్స్ చేయ్ అని చెప్తాడు.

అలంకృత సరే అని వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే అని డ్యాన్స్ చేస్తుంది. తర్వాత అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. రిషి మిథున చేతికి మెహందీ పెడతాడు. మిథున, రిషిలను చూసి హరివర్థన్ వాళ్లు చాలా సంబరపడిపోతారు. అలంకృత బావతో మెహందీ విషయంలోనే నీ ప్రేమ తెలుస్తుంది బావ ఇక మా అక్కని ఎంత బాగా చూసుకుంటావో అని అంటే దానికి రిషి నా కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటా అని అంటాడు.

లలిత కాబోయే అల్లుడితో మీ కాపురం గోరింటాకు అంత అందంగా పండుతుంది. మీ జంటకి ఎవరి దిష్టి తగలకూడదు అని అంటుంది. అది విన్న త్రిపుర నా తమ్ముడు రాహువులా ఉంటే వీళ్లు సంతోషంగా ఎలా ఉంటారు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని అనుకుంటుంది.

ఆదిత్య పోస్టర్లు అంటించిన వాడి గురించి ఆలోచిస్తాడు. సడెన్‌గా రమ్మని అన్నాడేంటి అంటే దేవాకి విషయం తెలిసిపోయింటుందా అనుకుంటాడు. ఇంతలో దేవా ఆ పోస్టర్లు వేసిన వాడిని తీసుకొస్తాడు. ఆదిత్య చూసి వెంటనే ముఖానికి ముసుగు వేసుకుంటాడు. దేవాని చూసి పారిపోయే టైంకి దేవా వెంటపడి కొడతాడు. ఎవడ్రా నువ్వు అని దేవా ముసుగు తీయాలని చూస్తాడు. అయినా ఆదిత్య తీయనివ్వడు. ఇద్దరూ పెనుగులాటలో ఆదిత్య దేవాని గన్‌తో కాలి మీద కాల్చేసి పారిపోతాడు. దేవా ఓ చోట కుప్పకూలిపోతాడు.

మిథున చేతి గోరింట చాలా అందంగా పండుతుంది. మిథున గోరింటాకు చూసుకుంటూ ఉంటే రిషి మిథున దగ్గరకు వస్తాడు. రిషి మిథునతో హమ్మయ్యా టెన్షన్,భయం రెండూ పోయావి అంటాడు. ఎందుకు అలా అన్నావ్ అని మిథున అడుగుతుంది. దానికి రిషి టెన్షన్ ఎందుకు అని అంత కూల్‌గా అంటావ్ ఏంటి మిథున నీ చేతులకు గోరింటాకు సరిగా పండకపోతే నేను మంచోడినే కానీ ఇది సరిగా పండలేదు అని ఎవరైనా నీకు మంచి మొగుడు రాలేదు అంటే నేను చాలా ఫీలవుతాను అని అంటాడు. గోరింటాకు చక్కగా పండింది.. నా రూపంలో నీకు మంచి భర్త రాబోతున్నాడు అని అర్థమైంది థ్యాంక్యూ సో మచ్ అంటాడు.

ఈ అందమైన క్షణాన నీకు ఓ గిఫ్ట్ అని మోకాల మీద కూర్చొని డైమండ్ రింగ్‌తో మిథునకు ప్రపోజ్ చేస్తాడు. మిథున అలా చూస్తూ ఉంటుంది. తీసుకోవడానికి ఆలోచిస్తావేంటి తీసుకో మిథున అని అంటాడు. దాంతో మిథున తీసుకుంటుంది. రిషి చాలా సంతోషపడతాడు. నీ మనసు గెలుచుకున్నందుకు చాలా గర్వపడుతున్నా చాలా హ్యాపీగా ఉన్నాను అని రిషి చెప్తాడు.

దేవా మిథునకు కాల్ చేసి మిథున నేను చాలా డేంజర్‌లో ఉన్నాను.. బతుకుతానో లేదో తెలీదు.. నన్ను కాల్చేశారు.. అని అంటాడు. మిథున చాలా కంగారు పడుతుంది. నన్ను కాపాడు మిథున అని దేవా చెప్పి పడిపోతాడు. మిథున చాలా కంగారు పడుతుంది. దేవా దేవా అని పిలుస్తుంది. మిథున దేవా ఫోన్ లొకేషన్ చూసి వెళ్లి దేవాని చూసి దేవా ఏమైంది దేవా నేను కాపాడుతా అని అంటుంది. దేవా కాలి నుంచి వస్తున్న రక్తం చూసి చాలా కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.