Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. శీనయ్యను కేసు నుంచి బయటకు తీసుకురావడం చిటికె వేసినంత పనని విక్కీ రాధకు మాటిస్తాడు.అంత ఈజీ అయినప్పుడు ఇన్నిరోజులు ఎందుకు తీసుకురాలేదని అడగ్గా...సాక్ష్యాలు ఇప్పుడే నాచేతికి వచ్చాయని చెబుతాడు. అటు దమయంతి,ప్రియాను ఏడిపించడానికి విక్కీ రోజూ రాత్రిపూట వచ్చి తనను కలుస్తున్నాడని చెప్పడంతో వాళ్లు నిద్రమానుకుని గేటు వద్ద విక్కీ కోసం కాపలా కాస్తుంటారు.
రాధకు మాటిచ్చిన విక్కీ
రాధను ఆనందంగా ఉంచిన విక్కీ...నువ్వు జీవితంలో ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని చెబుతాడు. నీకు అత్యంత సంతోషించదగిన క్షణం మీనాన్న జైలు నుంచి బయటకు వచ్చినప్పుడేనని నాకు తెలుసునని అందుకే మీనాన్నను రెండురోజుల్లో బయటకు తీసుకొస్తానని చెబుతాడు. మానాన్నను బయటకు తీసుకురావడం నీకు అంత ఈజీనా అని అడుగుతుంది.చిటికె వేసినంత పనని చెబుతాడు.అయితే మరి ఇన్నిరోజులు ఎందుకు తీసుకురాలేదని రాధ నిలదీయగా...మీనాన్న నిర్దోషి అని నిరూపించే సాక్ష్యాలు నాకు ఈమధ్యనే అందాయని చెబుతాడు. అప్పటి నుంచి ఈ కేసు గురించి ట్రై చేస్తుంటే ఇప్పుడే నా చేతికి సాక్ష్యాలు అందాయని అంటాడు. దీంతో రాధ విక్కీ చెప్పిన మాటలు నమ్ముతుంది. ఈ నిజం బయటకు తెలిసిన రోజు రాధ రియాక్షన్ ఎలా ఉంటుందోనని రామలింగం భయపడుతుంటాడు.
రాధ మనసు తెలుసుకున్న రామచంద్రం
రామచంద్రం ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుండగా..వాళ్ల అమ్మ వచ్చి ఏంటని అడుగుతుంది. రాధ గురించే ఆలోచిస్తున్నానని చెబుతాడు.నిన్న జైలుకు వెళ్తుంటే మా ఇద్దరిపైనా ఎటాక్ జరిగిందని చెబుతాడు.అప్పుడు రాధ తన ప్రాణాలు ఇవ్వడానికైనా అంగీకరించింది కానీ...విక్కీ తన మెడలో కట్టిన తాళి మాత్రం తియ్యడానికి ససేమీరా అన్నదని అంటాడు. అంటే విక్కీ కట్టిన తాళికే రాధ అంత ప్రాధాన్యమిచ్చిందని అంటాడు. రాధ,విక్కీ చేసుకోవడానికి అగ్రిమెంట్ పెళ్లి అయినప్పుటికీ...రాధ మాత్రం విక్కీని తన భర్తగానే అంగీకరిస్తుందని మామ్మఅంటుంది. విక్కీకి తన మనసులో భర్త స్థానం ఇచ్చిందని చెబుతుంది. ముందుగా అగ్రిమెంట్‌పై ఇంటికి వచ్చినా...ఆ తర్వాత ఇంట్లోవాళ్లందరినీ తనవాళ్లుగా మార్చుకుందని చెబుతుంది. ఈ విషయంలో రాధకు ఎలాంటి అన్యాయం జరిగినా నా మనవరాలు చిట్టికి జరిగినట్లుగానే భావిస్తానని కొడుకును హెచ్చరిస్తుంది. రాధ మనసులో ఏం ఉందో అర్థమైందని..కానీ విక్కీ మనసులో రాధకు ఎలాంటి స్థానం ఉందో తెలియడంలేదని అంటాడు. ఇంకా చెప్పేది ఏముందిరా...అగ్రిమెంట్ పెళ్లి గురించి తెలిసినప్పుడే తప్పు మొత్తం తనపై వేసుకుని వాడు బయటకు వెళ్లినప్పుడే భార్యను ఒక్క మాట అననివ్వడని అర్థంకాలేదా అని కొడుక్కి చెబుతుంది.
వాచ్‌మెన్‌లా దమయంతి కాపలా
అగ్రిమెంట్ పెళ్లి గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా విక్రమ్‌కృష్ణ మానాన్నను విడిపించడానికి ప్రయత్నిస్తున్నాడంటే...నిజంగా నామీద ఉన్న ప్రేమతోనేనని రాధ ఆనందపడుతుంది.విక్కీ ఫొటో పట్టుకుని గుండెలకు హత్తుకుంటుంది.అప్పుడే ప్రియ,దమయంతి అక్కడికి వచ్చి ఎందుకు మురిసిపోతున్నావని నిలదీస్తారు.చావుతప్పి కన్నులొట్టపోయినట్లు చివరి నిమిషంలో తప్పించుకున్నావని..కానీ ఏదో ఒకరోజు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాల్సిందేనని హెచ్చరిస్తారు. నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టగలరు కానీ...నా భర్త మనసులో నుంచి పంపించలేరని చెబుతుంది. ఇప్పుడు మా బంధం మరింత బలపడిందని చెబుతుంది.ప్రతిరోజూ రాత్రి విక్రమ్‌కృష్ణ దొంగచాటుగా ఇంటికి వచ్చి నాకు ముద్దులుపెడుతున్నారని చెబుతుంది.దీంతో ప్రియా, దమయంతి దుప్పట్లు కప్పుకుని విక్కీ కోసం అర్థరాత్రి గేటు ముందు వాచ్‌మెన్‌లా కాపలా కాస్తుంటారు.