Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. శీనయ్య బతికే ఉన్నాడని రామచంద్రం చెప్పడంతో రాధ ఆనందపడిపోగా..దమయంతి మాత్రం భయపడిపోతుంది.వెంటనే వెళ్లి భవానీశంకర్‌ను కలిసి విషయం చెప్పి మనుషులతో వెతికించమని చెబుతుంది.

దమయంతిలో భయం
శీనయ్య చనిపోలేదని..బతికే ఉన్నాడన్న కోణంలోనే మేం విచారణ చేస్తున్నామని రామచంద్రం చెప్పడంతో రాధ ఎంతో ఆనందపడిపోతుంది.నిజమా నాన్న మా నాన్న బతికే ఉన్నాడా అని అంటుంది.అవునమ్మా ఇప్పటికే వరకు మీ నాన్న డెడ్‌బాడీ దొరకలేదంటే ఖచ్చితంగా ఆయన బతికే ఉండిఉంటారని మేం నమ్ముతున్నామనిఅంటాడు. ఆదిశగానే విచారణ చేస్తున్నామని చెబుతాడు.నిజంగా ఆయన బతికే ఉంటే ఖచ్చితంగా మేం వెతికి పట్టుకుని మీనాన్నను నీకు అప్పగిస్తానని రామచంద్రం హామీ ఇస్తాడు.దీంతో ఆనందంతో రాధ మా అమ్మ దగ్గరకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోతుంది. మీరు విక్కీని పట్టుకుంటే శీనయ్య ఎక్కడ ఉంటాడో తెలుస్తుందని దమయంతి చెప్పగా...ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలో నువ్వు నాకు చెప్పాల్సిన పనిలేదని చెప్పి రామచంద్రం వెళ్లిపోతాడు.

భవానీ శంకర్‌ను కలిసిన దమయంతి
అర్థరాత్రి హాయిగా నిద్రపోతున్న భవానీశంకర్‌ వద్దకు వచ్చిన దమయంతి ఆయన్ను నిద్రలేపి తిడుతుంది.నేను ఇక్కడ టెన్షన్‌తో నిద్రపట్టక చస్తుంటే నువ్వుమాత్రం హాయిగా పడుకున్నావా అని మండిపడుతుంది.ఆ శీనయ్య బతికే ఉన్నాడంటా అని చెప్పగానే...భవానీ శంకర్‌కు నిద్రమత్తు వదిలిపోతుంది.నువ్వు చెప్పేది నిజమా అని అంటాడు.అవునని ఇప్పుడే మా బావగారు చెప్పారనిఅంటుంది.శీనయ్య బతికే ఉన్నాడని ఆయన్ను పోలీసులు వెతుకుతున్నారని చెబుతుంది.వాళ్ల చేతికి శీనయ్య దొరికేలోపు మనం పట్టుకోవాలని అంటుంది. వెంటనే మనుషులను పంపించి వెతికించమని అంటుంది. మనవాళ్లు అన్ని ఆస్పత్రులు వెతికారు కదా అని అంటే..వెళ్లి చూసిరావడం కాదని జల్లెడపట్టమని చెబుతుంది.ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదని..ఇప్పుడే మనుషులను పంపించమని చెబుతుంది. దీంతో భవానీశంకర్ వెంటనే మనుషులను శీనయ్యను వెతకడానికి పంపిస్తాడు.

శీనయ్యకు విదేశీ వైద్యం
శీనయ్య వెంటనే కోలుకోవాలని విక్కీ విదేశాల నుంచి ఖరీదైన మందుకు తెప్పిస్తాడు.వీటిని పద్మావతికి ఇచ్చి క్రమం తప్పకుండా వాడాలని సూచిస్తాడు.వీటిని టైం టు టైం వేయకుండా రియాక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని కాబట్టి జాగ్రత్తగా వేయమని చెబుతాడు. శీనయ్య దగ్గరకు వెళ్లి నువ్వు త్వరగా కోలుకోవాలని అంటాడు. ఈ కేసు నుంచి నేను తప్పించుకోవడం కోసం కాకున్నా...నా చిట్టి ఎవరన్న నిజం నీకు మాత్రమే తెలుసునని అది చెప్పడానికైనా నువ్వు త్వరగా కోలుకోవాలని అంటాడు. అల్లుడుగారు నీకోసం ఎంతో తాపత్రయపడుతున్నారని నువ్వు వెంటనే కోలుకోమని పద్మవతి కూడా ఏడుస్తుంది.ఆయనకు మీరు అంటే ఎంతో ప్రేమ అని విక్కీకి చెబుతుంది.అల్లుడు వస్తున్నాడని తెలిస్తే చాలు..కోడికూర వండమని ఎంతో హడావుడి చేసేవాడని అంటుంది.అందుకే మీకోసం కోడికూర వండానని తప్పకుండా ఇవాళ తిని వెళ్లండని చెబుతుంది. విక్కీ భోజనానికి కూర్చోగా...అప్పుడే అక్కడికి వచ్చిన రాధ...కోడికూరలో మొత్తం కారం వేసి తీసుకుని వచ్చి విక్కీకి పెడుతుంది.