Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. అల్లుడికి సేవలు చేస్తున్న తల్లిని చూసి రాధమ్మ మండిపడుతుంది.అల్లుడి మంచితనం తెలుసుకున్నతర్వాత నువ్వే మారిపోతావులేనని పద్మావతి అంటుంది. ఆ తర్వాత విక్కీ అక్కడ ఎందుకు ఉంటున్నాడో తెలుసుకునేందుకు దమయంతి కుట్రతో అక్కడికి రాగా....పద్మావతి ఆమెను బయటే నిలబెడుతుంది.
అల్లుడికి అత్త సేవలు
చెల్లిని చూడటానికి వెళ్తే ఇంట్లోవాళ్ల అవమానించి పంపించివేయడంతో విక్కీ చాలా బాధపడుతుంటాడు.ఏమైందని పద్మావతి అడిగితే నన్ను మా అమ్మ ఇంట్లోకి రానివ్వకుండా గెంటివేసిందని చెబుతాడు.అదిచూసిన అత్తయ్య బాధపడి శీనయ్య దగ్గరకు వెళ్లి అతనికి చెబుతుంది.మీరు లేచి మాట్లాడితేనే అల్లుడికి అవమానాలు పోతాయని చెబుతుంది.త్వరగా మీరు కోలుకోవాలని వేడుకుంటుంది.ఇంతలో రాధమ్మ ఇంటికి రావడం చూసివాళ్లిద్దరూ ఆ గదిలో నుంచి బయటకు వచ్చేస్తారు. విక్కీకి పద్మ టిఫిన్ పెడుతుండగా అక్కడికి వచ్చిన రాధ..అక్కడ తిట్లు తిని సిగ్గులేకుండా ఇక్కడ అట్లు తింటున్నారా అని నిలదీస్తుంది. అల్లుడుగారు వద్దని చెబుతున్నా నేనే బలవంతంగా ఆయనకు టిఫిన్ పెట్టానని పద్మావతి అంటుంది.అయినా నీలాగా నేను రాయిని కాదని అంటుంది.ఇంట్లోఅందరూ ఆయన్ను తిడుతుంటే నువ్వు ఆయనపక్కన ఉండకుండా వాళ్లతో చేతులు కలిపి తిట్టావని తెలిసిందని అంటుంది.ఆయన నిన్ను ఏం మాయచేశాడని రాధమ్మ నిలదీస్తుంది.అల్లుడుగారు తప్పు చేయలేదని నేను నమ్మానని నువ్వు కూడా నమ్మితే ఆయన గురించి నీకే తెలుస్తుందని పద్మావతి కూతురిని తిడుతుంది.
దొరికిపోయిన అనసూయ
దెబ్బలు తగిలి ఇంట్లో ఉన్న అనసూయ రామలింగానికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఆనందంగా ఉండటం ఇంట్లోవాళ్లు చూస్తారు.ఎవరితో మాట్లాడుతున్నావని వాళ్ల అమ్మ నిలదీస్తుంది.దీంతో దొరికిపోయానని అనసూయ చాలా భయపడుతుంది. మా ప్రెండ్ రామలక్ష్మీతో మాట్లాడుతున్నానని అనసూయ అబద్ధం చెబుతుంది.నాకు తెలియకుండా నీకు అలాంటి ఫ్రెండ్ ఎవరూలేరు కదా అని సునంద అంటుంది. దీంతో అనసూయ ఏదోవిధంగా మాయమాటలు చెప్పి తప్పించుకుంటుంది. ఇంతలో సునందకు విక్కి గుర్తుకు వచ్చి ఏడుస్తుంది.అన్నయ్య ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పు చేయడని అనసూయ అంటుంది.అదే నాకు కావాలని సునంద కన్నీళ్లు పెట్టుకుంటుంది.
దమయంతి ఎత్తు...పద్మావతి పైఎత్తు
విక్కీ రాధమ్మ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడో తెలుసుకోవాలని దమయంతి బయలుదేరుతుంది.ఎమ్మెల్యే టిక్కెట్ వచ్చింది కాబట్టి అందరినీ ఓట్లు అడగాటనికి వెళ్తున్న నెపంతో దమయంతి పద్మావతి ఇంటికి వస్తుంది. ఎందుకు ఇలా వచ్చారని పద్మావతి నిలదీయగా....భర్తను పోగొట్టుకున్న బాధలో ఉన్నే నిన్ను పరామర్శించడానికి వచ్చానని అంటుంది.అయినా భర్త చనిపోయినా నువ్వు ఇంకా గాజులు,బొట్టు ఎందుకు తీసివేయలేదని అడుగుతుంది. నా భర్త చనిపోయాడని నీకు ఎవరు చెప్పారని పద్మావతి నిలదీస్తుంది.నీకూతురే విక్కీపై కేసుపెట్టింది కదా అని అంటుంది. అక్కడే ఉన్న విక్కీ కల్పించుకుని ఎవరో ఏదో అనుకుంటే జరిగిపోదని అంటాడు. శీనయ్య చనిపోయినట్లు ఆధారాలు కావాలని..డెడ్‌బాడీ దొరకాలని అప్పుడే కదా ఆయన చనిపోయాడని తేలేది అని అంటాడు. ఈకేసు చేధించి దీని వెనక ఎవరు ఉన్నారో తేల్చి వాళ్లకు శిక్షపడేలా చేస్తానని బెదిరించడంతో దమయంతి భయపడుతుంది. దీంతో ఆమె పద్మావతిని రెచ్చగొట్టడంతో నాభర్త నాతోపాటే నా ఇంట్లోనే ఉన్నాడని ఆమె అంటుంది.దీంతో దమయంతి వెతకడానికి లోపలికి వెళ్తుంది.