Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. రంగాను ఇంటరాగేషన్ చేస్తున్న రామచంద్రం నిజం చెప్పకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు.అప్పుడే అక్కడికి టీ తీసుకుని వచ్చిన విక్కీని చూసిన రంగా...ఆ విక్రమ్‌కృష్ణగారే నేను నిజం చెప్పకుండా అడ్డుపడ్డారని అతనిపై తోసేస్తాడు. అనసూయ తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్లడానికి వాళ్ల అమ్మానాన్నను కాకాపడుతుంది. గోపాల్‌ వెళ్లమని పర్మిషన్ ఇవ్వడంతో రామలింగాని ఫోన్ చేసి వచ్చి రాత్రికి తీసుకెళ్లమని కోరుతుంది.
తల్లిని కాకాపట్టిన అనసూయ
అనసూయ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉండటంతో తప్పకుండా వస్తానని చెబుతుంది.కాకపోతే అర్థరాత్రి వరకు పార్టీ జరగుతుండటంతో వెళ్లి వాళ్ల అమ్మను కాకాపడుతుంది. పార్టీకి వెళ్లమని కాకపోతే రాత్రి 8గంటల కల్లా ఇంట్లోఉండకపోతే కాళ్లు విరగ్గొడతానని చెబుతుంది. దీంతో వెళ్లి వాళ్ల నాన్నకు చెబుతుంది.అమ్మ వద్దని అంటుందని అంటుంది.వద్దనడానికి తనెవరని నువ్వు వెళ్లు అంటూ పర్మిషన్ ఇస్తాడు.కాకపోతే మీ అమ్మకు తెలియకుండా వెళ్లమని చెబుతాడు. రాత్రి అవుతుంది కాబట్టి మీ ఆన్నయ్యకు ఫోన్ చేసి చెప్పమని వాడు వచ్చి ఇంటి దగ్గర దిగబెడతాడని అంటాడు.దీంతో అనసూయ సరేనని అంటుంది.వెంటనే రామలింగానికి ఫోన్ చేసి నేను రాత్రికి బర్త్‌డే పార్టీకి వెళ్లాలని చెబుతుంది.రాత్రి 11గంటల కల్లా ఎవరికీ తెలిలయకుండా మా ఇంటికి రమ్మని అంటుంది.నన్ను బయటకు తీసుకెళ్లమని చెబుతుంది. మా నాన్న కూడా ఒప్పుకున్నారని చెబుతుంది.దీంతో రామలింగం నాకు కుదరదని చాలా పనులు ఉన్నాయని అంటాడు.దీంతో అనసూయ గట్టిగా తిట్టడంతో ట్రైచేస్తానని చెబుతాడు.
రామచంద్రం ఇంటరాగేషన్
రంగా నోటి నుంచి నిజం చెప్పించేందుకు రామచంద్రం ఇంటరాగేషన్ మొదలుపెడతాడు. గన్‌తీసి అతని తలకు గురిపెడతాడు.నేను విక్రమ్‌కృష్ణ అంత మంచివాడిని కాదని అంటాడు.మర్యాదగా నిజం చెప్పకపోతే ఎన్‌కౌంటర్ చేయడానికి ఏమాత్రం ఆలోచించనని అంటాడు. మర్యాదగా శీనయ్య కేసులో నువ్వు సాక్ష్యం ఎందుకు చెప్పలేదని అడుగుతాడు.అలాగే శీనయ్యకు ఉన్న శత్రువులు ఎవరో కూడా నువ్వు చెప్పాలని బెదిరిస్తాడు.అప్పుడే టీ పట్టుకుని లోపలికి వచ్చిన విక్రమ్‌...త్వరగా ఎన్‌కౌంటర్ చేయండిసార్‌ లేకపోతే వాడి నోటినుంచి ఒక్కమాట కూడా బయటకు రాదని అంటాడు.ఈ విక్కీ ఇంకా వాళ్ల మామయ్యను రెచ్చగొడుతున్నాడని రంగా అనుకుంటాడు. దీంతో విక్కీని ఇరికించాలని అనుకున్న రంగా..నిజం చెబుతానుసార్‌ ఈ విక్రమ్‌కృష్ణగారే నాతో నిజం చెప్పొద్దని బెదిరించారని అంటాడు. అంటే వీడు నోరుతెరిస్తే ఆ శీనయ్య బయటకు వస్తాడని రాధ వెళ్లిపోతుందని నువ్వే ఇలాంటి పని చేశావా అని అంటాడు. అది కాదని అసలు శీనయ్యకు ఉన్నశత్రువులు ఎవరో తెలుసుకోవాలనే అప్పుడు అలా వాడితో చెప్పానని విక్కీ అంటాడు. ఎస్‌ఐ డ్రెస్‌లో ఉండాల్సిన విక్కీ టీ కప్పులు తీసుకుని రావడం చూసి రామచంద్రం చాలా బాధపడతాడు.ఎలా చూడాలనుకున్నానురా నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని అంటాడు. శ్రీకృష్ణుడికే నీలాపనిందలు తప్పలేదని..నాకు కూడా అంతేనని అంటాడు. నేను తప్పుచేయలేదని నిజం నిరూపించిన నాడు మీరంతా నన్ను క్షమిస్తారని చెప్పి వెళ్లిపోతాడు.
హోటల్‌ పని అల్లుడికి అప్పగించిన అత్త
ఇంట్లో నానబెట్టిన మినపగుండ్లు తీసుకుని వచ్చి రాధకు ఇచ్చి ఇది రుబ్బించమని చెప్పి ఇంటికి వెళ్లబోతుంది.ఇప్పుడే కదా వచ్చావు అప్పుడే ఇంటికి ఎందుకు అని రాధ నిలదీస్తుంది.నువ్వు అసలు హోటల్‌లో కన్నా ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నావని అంటుంది. ఏంలేదమ్మా నాకు కొంచెం నీరసంగా ఉంది ఇంటికి వెళ్లి పడుకుంటానని అంటుంది. అయితే నేను కూడా వస్తానని రాధ అంటుంది.నువ్వు వస్తే మీ నాన్న పనులు ఎలా చేయగలనని అనుకుని నువ్వు హోటల్ పనులు చూసుకోమ్మా అని చెప్పి వెళ్లిపోతుంది.దీంతో రాధ విక్రమ్‌తో ఇడ్లీ పిండి రుబ్బిస్తుంది.