Nuvvu leka Neanu Lenu Serial Today July 24th: ఇంటికి తిరిగి వచ్చిన తప్పిపోయిన చిట్టి....విక్కీకి మాత్రం వచ్చింది చిట్టి కాదని అనుమానం
3 months ago 5
ARTICLE AD
రాధను దత్తత తీసుకున్న రామచంద్రం
రాధను దత్తత తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన రామచంద్రం...పూజ మొదలుపెడతాడు. ఎంత చెప్పినా రాధ వినకపోవడంతో విక్కీ కోపంతో రగిలిపోతుంటాడు. అటు దమయంతి కూడా ఇది కాసేపటి ముచ్చటేలే అని ఆనందపడిపోతుంటుంది. పూజ ముగింపు దశకు వచ్చి రాధ చేతుల మీదుగా పాలు రామచంద్రం చేతుల్లో పోయిస్తారు.దీంతో రాధ మీ దత్త పుత్రికగా మారిపోయిందని పూజారి చెబుతాడు. దీంతో రామచంద్రం రాధను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటాడు.
ఇంట్లో అడుగుపెట్టిన చిట్టి
రాధ దత్తత కార్యక్రమం జరుగుతుండగానే చిట్టి ఇంట్లో అడుగుపెడుతుంది.నాన్న అంటూ వెళ్లి రామచంద్రం గుండెలపై వాలిపోతుంది. ఏం అర్థంగాక రామచంద్రం అయోమయానికి గురవుతాడు. నేను మీ చిట్టినని చెబుతుంది. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్థంకాదు.ఇంతలో వాళ్ల అమ్మ దగ్గరకు రాగా...నాయనమ్మా అంటూ ఆమెపై వాలిపోతుంది. చిన్నప్పుడు నువ్వు కథలు చెబితేగానీ నేను నిద్రపోయేదాన్ని కాదని అంటుంది. సునంద దగ్గరకు వచ్చి నేను నీ దగ్గరే పడుకునేదాన్ని కదా అనిగుర్తు చేస్తుంది. చిన్నప్పుడు నీ జడ నేను కత్తిరించి గోపాల్ మామయ్యపై నెట్టేశానని...అప్పుడు మీ ఇద్దరికి బాగా గొడవ జరిగిందని గుర్తుచేస్తుంది. అలాగే ప్రియా దగ్గరకు వెళ్లి మనం చిన్నప్పుడు ఆడుకున్న విషయాలు గుర్తున్నాయా అని అడుగుతుంది.ఇదంతా చూసిన అందరూ వచ్చింది చిట్టినే అనుకుంటారు. రామచంద్రం కూడా తన కూతురు తిరిగి వచ్చిందని సంబరపడిపోతాడు.
దమయంతి ముందు జాగ్రత్త
ఇంట్లోవాళ్లందరినీ నమ్మించడానికి దమయంతి ముందుగానే జాగ్రత్తపడుతుంది. ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని ముందుగానే చిట్టిని ప్రశ్నిస్తుంది.అసలు నువ్వే మా చిట్టి అని నమ్మకం ఏంటని అంటుంది. మా చిట్టి చిన్నప్పటి విషయాలన్నీ తెలుసుకుని అబద్ధం ఆడి ఉండొచ్చు కదా అని నిలదీస్తుంది. మా చిట్టికి కందిగింజ అంత పుట్టుమచ్చ ఉంటుందని చూపించమని చెప్పగానే....నాటకాల అమ్మాయి చెవి కింద ఉన్న పుట్టుమచ్చ చూపిస్తుంది.అదేంటి నాకు కూడా అక్కడే ఉంది అని రాధ అనుకుంటుంది.  ఇంతలో వాళ్ల నాయనమ్మ కలుగజేసుకుని రాకరాక పిల్ల వెతుక్కుంటూ ఇంటికి వస్తే ఈ అనుమానాలు ఏంటని అంటుంది.ఇంతలో రాధ ముందుకు వచ్చి నేను కూడా ఓ ప్రశ్న అడుగుతానని అంటుంది.దీంతో దమయంతి గుండెల్లో గతుక్కుమంటుంది.ఇది ఏం అడుగుతుందో  ఆ తింగరిది ఏం చెబుతుందోనని అనుకుంటుంది. చిట్టికి చిన్నప్పుడు బాగా ఇష్టమైన పదార్థం ఏంటని అడగ్గా....నేను చిన్నప్పుడు మిర్చి బజ్జీలు బాగా తినేదాన్నని చెప్పడంతో అందరూ తనే చిట్టి అని నమ్ముతారు.రామచంద్రం కూడా కూతురిని దగ్గరకు తీసుకుంటాడు.
విక్కీకి అనుమానం
ఇంట్లో అందరూ వచ్చిన అమ్మాయి చిట్టి అని సంబరపడిపోతున్నా...విక్కీకి మాత్రం ఆమె చిట్టి కాదని అనుమానం వస్తుంది. తను ఒంటరిగా వెళ్లి ఆలోచిస్తుండగా...రాధ అక్కడికి వచ్చి విక్కీని ఏడిపిస్తుంది. అదేంటి మీ చిట్టి నిన్ను చూడకుండా ఉండలేదని చెప్పావు..కనీసం పట్టించుకోలేదని ఉడికిస్తుంది.అందుకే అలిగి వచ్చేశావా అని అంటుంది.నాకు ఎందుకో వచ్చిన అమ్మాయి చిట్టి కాదని అనిపిస్తుందని అంటాడు.. ఏం నీ దగ్గరకు పరుగెత్తుకుని రాలేదని కోపమా అని రాధ అంటుంది. అలా కాదు వచ్చింది చిట్టి అయితే నా మనసుకు తెలిసిపోతుందని అంటాడు. అక్కడ నేను ఉంటే ఎలా తెలుస్తుందని రాధ ఉడికిస్తుంది.
Read Entire Article