Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. రాధ రాకపోయేసరికి అందరూ విక్కీని నిలదీస్తారు. అప్పుడే రాధను దొంగ పెళ్లి చేసుకున్నానని విక్కీ చెబుతుండాగ రాధ వచ్చి అడ్డుకుంటుంది.అటు సుందరి దగ్గరకు వెళ్లి నీ నాటకాలన్నీ తెలిసిపోయాయని రేపటికల్లా ఇల్లు వదిలిపెట్టి వెళ్లాలని వార్నింగ్ ఇస్తుంది.అలాగే దమయంతి దగ్గరకు వెళ్లి చేసిన తప్పు ఒప్పుకుని గురూజీకి క్షమాపణలు చెప్పాలని చెబుతుంది.

నిజం చెప్పబోయిన విక్కీ

వరలక్ష్మీ వ్రతం సమయానికి రాధ రాకపోయేసరికి అందరూ విక్కీని నిలదీస్తారు. అంతలో చిట్టి కూడా విక్కీ దగ్గరకు వెళ్లి నీ అగ్రిమెంట్ పెళ్లి గురించి చెప్పడానికి ఇదే సరైన సమయమని చెప్పేయమని చెబుతుంది.దీంతో విక్కీ నాకు,రాధకు జరిగింది నిజమైన పెళ్లి కాదని...దమయంతి అత్తయ్య చెప్పినట్లు అగ్రిమెంట్ పెళ్లి అని చెబుతాడు. అందుకే రాధను వాళ్ల ఇంట్లో వదిలిపెట్టి వచ్చేశాను అని చెప్పబోతుండగా...రాధ వచ్చి అడ్డుకుంటుంది. నేను లేకపోయేసరికి ఇంట్లో వాళ్లు ఇలా అంటారని మా ఆయన చెప్పబోతున్నారని అడ్డుకుంటుంది. రాధ రాక చూసి దమయంతి, ప్రియా షాక్ తింటారు.ఇది మళ్లీ వచ్చిందేంటని అనుకుంటారు. మా అమ్మకు ఒంట్లో బాగుండకపోవడంతో...ఆమె ఇక్కడికి రాలేకపోయిందని అందుకే ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లానని చెబుతుంది.రాధ వచ్చింది కాబట్టి పూజ చేయిద్దామి సునంద అనడంతో అందరూ కలిసి అమ్మవారి పూజ చేయిస్తారు.

ALSO READ: Illu Illalu Pillalu Serial Today August 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?

సుందరికి వార్నింగ్ ఇచ్చిన రాధ

మేడమీద ఒంటరిగా ఉన్న సుందరి వద్దకు వెళ్లి సుందరి అని పిలవగానే చిట్టి షాక్‌ తింటుంది. నీ గుట్టు మొత్తం నాకు తెలుసునని అంటుంది. సుందరివాళ్ల అమ్మ,నాన్న పేరు చెప్పినా....సుందరి దబాయిస్తుంది. నేను వాళ్లకు దొరికానని అందుకే పెంచారని చెబుతుంది. మీ అమ్మకు స్టేజీపైనే నొప్పులు రావడం....నువ్వు డ్రామా స్టేజీ వెనకే పుట్టడం గురించి కూడా నాకు తెలుసునని అంటుంది. ఇంకా నాటకాలు ఆడితే జైలుకు పంపిస్తానని హెచ్చరిస్తుంది. అయినా నేను నిన్ను ఏం అనడం లేదని మంచి బేరం వచ్చింది కాబట్టి నటించడానికి వచ్చావని అంటుంది. నీ వెనక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరని నిలదీస్తుంది. కానీ సుందరి చెప్పకపోవడంతో రేపటి కల్లా ఇల్లువదిలి వెళ్లకపోతే నీ సంగతి చూస్తానని బెదిరిస్తుంది.

ALSO READ: Karthika Deepam 2 Serial Today August 17th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!

దమయంతికి స్ట్రాంగ్ వార్నింగ్

అటు దమయంతికి సైతం రాధ గట్టి వార్నింగ్ ఇస్తుంది. నీకు నాపై కోపం ఉంటే నాతో ఆడుకోమని...పాపం గురూజీని ఎందుకు మోసం చేశావని నిలదీస్తుంది. మర్యాదగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని ఆయన కాళ్లమీదపడి క్షమాపణలు చెప్పాలని బెదిరిస్తుంది.లేకపోతే నా విశ్వరూపం చూస్తావని హెచ్చరించి వెళ్లిపోతుంది. నేను దీనికి దొరికిపోయాను ఏంటని దమయంతి బాధపడుతుంది. అటు విక్కీ రాధను నిలదీస్తాడు. రానని చెప్పి వెళ్లిపోయినదానివి మళ్లీ ఎందుకు వచ్చావని అడుగుతాడు.మీరు చాలా బాధపడుతున్నారని మీ ఫ్రెండ్ చెబితే వచ్చానని రాధ అంటుంది. నేను రాకపోయి ఉంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఏం జరిగేదో నీకు బాగా తెలిసి ఉంటుంది కదా అని అంటుంది. సుందరి, దమయంతి విషయం విక్కీకి చెప్పాలని అనుకున్నా...వాళ్లు తట్టుకోలేరని తర్వాత చెబుదామని రాధ అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి. " href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.