Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. సుందరి అమ్మానాన్నలను కలిసిన రాధ, రామలింగం...కోటిరూపాయల రియాల్టీషోలో నటించే ఆఫర్ ఉందంటూ వాళ్లను బోల్తా కొట్టించి నిజం రాబడతారు.అటు వరలక్ష్మీవ్రతం పూజ కోసం రాధను తీసుకురావడానికి విక్కీ చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయో ఈరోజు ఎపిసోడ్‌లో చూద్దాం.
సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ
సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...అసలు ఆమెను అక్కడికి ఎవరు తీసుకెళ్లారో తెలుసుకోవడం కోసం వాళ్ల ఇంటికి వెళ్తారు. వాళ్ల అమ్మానాన్నలనూ చూసి రామలింగంతో కలిసి రాధ నాటకం ఆడుతుంది. మేం రియాల్టీషో నుంచి వచ్చామని...మీ అమ్మాయిని మా షోలో నటించడానికి బుక్‌ చేసుకోవడానికి వచ్చామని చెబుతారు. ఇందులో మీకు కూడా మంచి పాత్రలు ఉన్నాయని ఆశ పుట్టిస్తారు. ఒక్కొక్కరికీ పదిలక్షలు చొప్పున మొత్తం 40 లక్షలు ఇస్తామని అంటారు.ఈ షోలో గెలుపొందితే మీకు అదనంగా కోటిరూపాయలు వస్తాయని చెబుతారు. దీంతో వాళ్లకు ఆ డబ్బుమీద ఆశపుడుతుంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ లేదని..ఓ నాటకం ఆడటానికి హైదరాబాద్‌ వెళ్లిందని చెబుతారు. ఏంటి ఆ నాటకం అంటే అది స్టేజీపై ఆడే నాటకం కాదని...ఓ ఇంట్లో తండ్రికి కూతురిలా నటించడానకికి వెళ్లిందని చెబుతారు. పదిలక్షలు ఇచ్చి ఓ అమ్మగారు తీసుకెళ్లారని చెబుతారు.
దమయంతి కుట్ర తెలుసుకున్న రాధ
అయితే ఆమెకు పదిలక్షలు ఇచ్చేసి మీ సుందరిని రమ్మని చెబుదామని అంటుంది. మీకు మొత్తం కోటి 40లక్షలు వస్తాయి కదా అందులో నుంచి ఓ పదిలక్షలు వాళ్లకు ఇద్దామని అంటారు.మీరు ఆమె ఎవరో చెప్పండని మేమే మాట్లాడతామని చెబుతారు. ఆమె రాజకీయనాయకురాలైన దమయంతి అని సుందరి నాన్న చెప్పేస్తాడు.వాళ్ల బావ కూతురిగా నటింపజేయడానికే సుందరిని తీసుకెళ్లారని చెబుతాడు. దీంతో రాధకు విషయం అర్థమైపోతుంది.సరే మీరు మీ అమ్మాయితో మాట్లాడి మాకు ఏం విషయం చెప్పడండని వెళ్లిపోతారు. వెంటనే సుందరికి ఫోన్ చేసిన వాళ్ల అమ్మానాన్న...నువ్వు వెంటనే ఇంటికి వచ్చేయమని మనకు కోటిరూపాయలు బేరం తగిలిందని చెప్పడంతో సుందరి ఆనందపడిపోతుంది. వెంటనే దమయంతి దగ్గరకు వెళ్లి విషయం చెబుతుంది.ఇప్పుడు వెళ్లడం కుదరదని ఇప్పుడే అందరూ నువ్వు చిట్టి అని నమ్ముతున్నారని ఇప్పుడు తిరిగి వెళ్లిపోతానంటే ఎలా అని అంటుంది. నాకు కోటిరూపాయల బేరం తగిలిందని చెప్పగా...దమయంతికి అనుమానం వస్తుంది. వీళ్ల ముఖానికి కోటిరూపాయలు ఇచ్చేది ఎవరని అనకుంటుంది.అయినా సరే నువ్వు వెళ్లడానికి వీళ్లేదని...చెప్పింది వినకపోతే చంపేస్తానని బెదిరించడంతో సుందరి నోరుమూసుకుంటుంది.
వరలక్ష్మీవ్రతం ఏర్పాట్లు
కోడలితో వరలక్ష్మీ పూజ చేయించాలని భావించిన సునంద అన్ని ఏర్పాట్లు చేస్తుంది.రాధ కోసం రూమ్‌లోకి రాగా....స్నానం చేస్తుందని విక్కీ అబద్ధం చెబుతాడు. త్వరగా రెడీ అయ్యి రమ్మని చెప్పి వెళ్లిపోతుంది. పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తారు.అప్పటి వరకు రాధ ఇంట్లోనే ఉన్నట్లు నటించిన విక్కీ ఏం చేస్తాడన్నది తర్వాత ఏపిసోడ్‌లో చూద్దాం.