Actress Nupur Sanon Wedding With Stebin Ben : 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ ఫేం, హీరోయిన్ నుపుర్ సనన్ తన ప్రియుడు స్టెబిన్ బెన్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో శనివారం ఇరువురు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వారం క్రితమే ఎంగేజ్మెంట్ జరగ్గా ఎక్కువ గ్యాప్ లేకుండా పెళ్లి పీటలెక్కారు.

పెళ్లిలో ఇద్దరూ తెలుపు దుస్తుల్లోనే మెరిశారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?