NBK111 సినిమా చిత్రీకరణలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని అబ్బాయి నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ట్వీట్ చేశారు. మావయ్యకు ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

బాలయ్యకు నారా లోకేష్ ఫోన్!
Nara Lokesh On Balakrishna Injury: కాకినాడలో ఎన్‌బీకే111 సినిమా షూటింగ్‌లో గాయపడిన మావయ్య బాలకృష్ణకు అల్లుడు నారా లోకేష్ ఫోన్ చేశారు. ముద్దుల మావయ్యను ఫోనులో పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది? వంటి వివరాలు బాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు లోకేష్. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన లోకేష్, యథావిధిగా మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

బాల బాబాయ్... ఎన్టీఆర్ ట్వీట్!
"మీరు త్వరగా కోలుకోవాలి బాల బాబాయ్'' అంటూ ఎన్టీఆర్ జూనియర్ సైతం 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. ఇంకా ''మీరు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ పూర్తి ఫామ్‌లో సింహంలా గర్జించడాన్ని చూడాలని ఎదురు చూస్తున్నాను" అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.

Also Read: Kajal Aggarwal On Bikini Scenes - నో బోల్డ్ సీన్స్‌, బికినీలు... కొడుకు కోసం కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం

Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form…

— Jr NTR (@tarak9999) July 21, 2026

గెట్ వెల్ సూన్ బాబాయ్!
''మీరు త్వరగా కోలుకోవాలి బాబాయ్'' అంటూ నందమూరి కళ్యాణ్ రామ్ 'ఎక్స్'లో ట్వీట్ చేశారు. ఇంకా ''మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు మళ్ళీ అతి త్వరలో పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ సెట్స్‌లోకి వచ్చి... యాక్షన్‌లో అడుగు పెట్టాలని, మీకు ఎంతో ఇష్టమైన పనిని (సినిమా షూటింగ్) మళ్ళీ మొదలు పెడతారని నాకు నమ్మకం ఉంది'' అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.

Also Read: OG Television Premiere ETV - ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?

Get well soon Babai. ❤️

Wishing you a speedy recovery. I'm sure you will be back in action in no time, doing what you love the most.

— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) July 21, 2026

సర్జరీ చేయాలన్న వైద్యులు
Vriddhi Cinemas Statement On Balakrishna Injury: ప్రస్తుతం కాకినాడలో ఎన్‌బీకే 111 సినిమా షెడ్యూల్‌ జరుగుతోంది. అందులో నందమూరి బాలకృష్ణకు కండరాలు పట్టేయడంతో ప్రమాదం జరిగిందని చిత్రనిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆస్పత్రికి తీసుకు వెళ్ళగా... బాలకృష్ణను పరీక్షించిన డాక్టర్లు, పూర్తిగా కోలుకోవడానికి ఓ మైనర్ సర్జరీ అవసరమని సూచించారు. దాంతో ఆయన త్వరగా కోలుకోవడమే కాకుండా... భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ సెట్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. బాలయ్య అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also Read: Aishwarya Sindogi Online Harassment - బిగ్ బాస్ బ్యూటీకి ఆన్‌ లైన్ వేధింపులు... బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదు