మ్యాన్ అఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా 'సలార్', 'కేజీఎఫ్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తీసిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ఆగిందని... హీరో & డైరెక్టర్ మధ్య గొడవలు వచ్చాయని ఆ పుకార్ల సారాంశం. మరి, అందులో నిజం ఎంత? ఆ పుకార్లు గుప్పుమనడానికి కారణం ఏమిటి? అనేది చూస్తే...

'డ్రాగన్' షూటింగ్ ఆగింది... అది నిజమే!
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'డ్రాగన్' టైటిల్ ఖరారు చేశారు. కానీ ఆ సంగతి అనౌన్స్ చేయలేదు అనుకోండి. 'వార్ 2' రిలీజ్ కంటే ముందు సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అందులో ఎన్టీఆర్ జాయిన్ కాలేదు. ఆ తర్వాత సుమారు 20 రోజులు ఎన్టీఆర్ షూటింగ్ చేశారు. దాని తర్వాత షూటింగ్ చేయలేదు.

నిజం చెప్పాలంటే... 20 రోజులు కాకుండా ఎన్టీఆర్ ఇంకాస్త ఎక్కువ రోజులు షూటింగ్ చేయాలి. ఆ మేరకు షెడ్యూల్ కూడా వేశారు. అయితే... ఒక కమర్షియల్ యాడ్ చేస్తున్న సమయంలో ఆయనకు గాయాలు అయ్యాయి. దాంతో బ్రేక్ టైం ఇంకాస్త పెరిగింది. అందువల్ల షూటింగ్ ఆగింది తప్ప హీరోకి, దర్శకుడికి మధ్య గొడవల వల్ల కాదు.

అసలు ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్ తెలిస్తే...
దర్శకుడు ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన తీసేవి లార్జర్ దేన్ లైఫ్, భారీ యాక్షన్ ఫిలిమ్స్. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక అప్పటి వరకు వచ్చిన ఫుటేజ్ చూసుకుని అందుకు తగ్గట్టు నెక్స్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారు. ఈసారి ఆ షెడ్యూల్స్ మొదలు కావడానికి ఎన్టీఆర్ ఇంజ్యూరీ వల్ల కొంచెం ఎక్కువ టైం పట్టింది.

అక్టోబర్ లాస్ట్ వీక్ లేదా నవంబర్ నుంచి మళ్ళీ...
హైదరాబాద్ సిటీలో జరిగిన 'కాంతార చాఫ్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్ గనుక చూస్తే... ఎన్టీఆర్ ఇంజ్యూరీ గురించి అందరికీ ఐడియా ఉంటుంది. ఆయన రిబ్స్ దగ్గర గట్టిగా గాయమైందని, ఆ నొప్పిని భరిస్తూ ఈవెంట్ అంతా ఉన్నారని అర్థం అవుతుంది. అందువల్ల షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టడానికి కాస్త ఆలస్యం అవుతోంది.

Also Read: పద్మవ్యూహాన్ని చేధించిన పార్ధు... రెబల్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ 'ఫౌజీ' అప్డేట్ ఇచ్చిన హను!

Dragon Latest Schedule Update: అక్టోబర్ లాస్ట్ వీక్ లేదా నవంబర్ నెలలో మళ్ళీ 'డ్రాగన్' షూటింగ్ మొదలు కానుంది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ పెద్దగా గ్యాప్ తీసుకోకుండా షెడ్యూల్స్ చేసి సినిమాను పూర్తి చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడు.

Also Read: థామా ఫస్ట్ రివ్యూ... బాలీవుడ్‌లో రష్మిక హారర్ కామెడీ... సినిమా హిట్టా? ఫట్టా? ప్రీమియర్స్ టాక్ ఏమిటంటే?