హైదరాబాద్: రౌడీ షీటర్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన నిజామాబాద్ పోలీస్ కానిస్టేబుల్, అమరుడు ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి పోలీస్ శాఖ పరిహారం ప్రకటించింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెబుతూ ప్రమోద్ కుటుంబానికి అందిస్తున్న సాయంపై కీలక ప్రకటన చేసింది. మొత్తం రూ.1.24 కోట్ల పరిహారంతో పాటు ఇంటి స్థలం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.

ప్రమోద్ కుటుంబానికి రూ.1 కోటి సహా అదనపు ప్రయోజనాలు

నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్, భర్త ప్రమోద్ కుటుంబానికి GO Rt No. 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ శాలరీ తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నారు. GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామన్నారు. అదే విధంగా పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ. 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ పోలీస్ శాఖ తరుపున నా నివాళి. భర్తను కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్తాయిలో అండగా ఉంటాం. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు పోలీసు శాఖ నిబద్దతతో ఉంది. ఎలాంటి తీవ్ర నేరస్తులు ఉన్నా కఠినంగా అణచివేస్తామని’ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కు పోలీసుశాఖ తరపున ఘననివాళులు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం.

తెలంగాణలో శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో కాపాడేందుకు రాష్ట్ర పోలీసుశాఖ నిబద్దతతో ఉంది. ఎంతటి తీవ్ర నేరస్తులను అయినా అత్యంత కఠినంగా అణచివేస్తాం. pic.twitter.com/p5uqXKMowD

— Telangana Police (@TelanganaCOPs) October 20, 2025