Actress Nivetha Pethuraj About Her Wedding Plans: ప్రముఖ హీరోయిన్ నివేతా పేతురాజ్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే వరున్ని పరిచయం చేశారు. ఆమె ప్రముఖ బిజినెస్ మ్యాన్ రజిత్ ఇబ్రాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. వినాయక చవితి రోజున ఆయనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ సర్ప్రైజ్ ఇచ్చారు. వీటిని చూసిన నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం జరిగిపోయిందనే అనుకున్నారు. అయితే, తమకు ఇంకా ఎంగేజ్మెంట్ జరగలేదంటూ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

పెళ్లి ఎప్పుడంటే?

ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేశామని చెప్పిన నివేతా... అక్టోబరులో ఎంగేజ్మెంట్, వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పారు. అయితే తేదీలు ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో సింపుల్‌గానే ఈ వేడుకలు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో నెటిజన్లు అందరూ ఆమెకు విషెష్ చెబుతున్నారు.

Also Read: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే లవ్ - 'హరిహర వీరమల్లు' నుంచి తప్పుకోవడానికి రీజన్స్ అవే... డైరెక్టర్ క్రిష్ క్లారిటీ