Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి కోల్ కతాలో ఎక్కడ ఉండేది ఏం చేసేది లాంటి డీటెయిల్స్‌ తెలుసుకోవడానికి వైజయంతి తన టీంలోని ముగ్గురు పోలీసులను అక్కడికి పంపిస్తుంది. వాళ్లు కోల్‌కతానే కాదు హైదరాబాద్‌ కోడైకెనాల్‌ లాంటి ప్లేస్ లకు వెళ్లి ఎంక్వైరీ చేసి వస్తారు. వైజయంతిని అర్జెంట్‌గా ఆఫీసుకు రమ్మని ఫోన్‌ చేస్తారు. అమర్‌ ఇంట్లో పార్థు బతికే ఉన్నాడని చెప్పిన వైజయంతి వాళ్లు ఫోన్‌ చేయగానే.. ఆఫీసుకు వెళ్లిపోతుంది.

వైజయంతి ఆఫీసుకు వెళ్లగానే.. కోల్‌కతా వెళ్లి వచ్చిన పోలీసులు షాకింగ్ నిజాలు చెప్తారు. మనోహరి కోల్‌కతాలో రణవీర్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్తారు. ఆ మాటలకు వైజయంతి షాక్‌ అవుతుంది. ఏం చెప్తున్నారు మీరు అంటూ ప్రశ్నిస్తే అవును మేడం మనోహరి గురించి పూర్తి డీటెయిల్స్‌ కనుక్కుమని ఒక్కొక్కటిగా చెప్తారు.

అరుంధతిపై మనోహరి కక్ష్య సాధింపు అక్కడే మొదలైంది.

మనోహరి ఆశ్రమంలో ఉన్నప్పుడు తనను పెళ్లిచూపుల కోసం అమర్‌ ఆశ్రమం దగ్గరకు వెళ్తాడు. అక్కడ మనోహరి కాకుండా అరుంధతిని చూసి పెళ్లి చేసుకుంటాడు. దీంతో మనోహరి బాధతో కోల్‌కతా వెళ్లిపోయి అక్కడ ఒక ఆశ్రమంలో వాలంటీర్‌గా చేరింది. కోల్‌కతాలోనే ఉండే రణవీర్‌ అనే వ్యక్తి మనోహరిని అనుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. వాళ్లిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. రణవీర్‌తో పెళ్లి ఇష్టం లేని మనోహరి రణవీర్‌కు విడాకులు ఇచ్చింది. పాపను ఒక అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయింది.

మనోహరి బిడ్డను దత్తత తీసుకున్న అమర్‌, అరుంధతి

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

అదే టైంలో జాబ్‌ పని మీద అమర్‌ కోల్‌కతా వెళ్తూ.. అరుంధతిని తీసుకెళ్తాడు. అప్పటికే వాళ్లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కోల్‌కతా వెళ్లాక తెలియకుండానే మనోహరికి పుట్టిన పాపను దత్తత తీసుకున్నారు. తర్వాత అమర్‌ కొడైకెనాల్‌ లో ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత మనోహరి కొడైకెనాల్‌ వెళ్లి అరుంధతి దగ్గర ఉండేది. తన ఫ్రెండ్‌ వచ్చిందన్న సంతోషంలో అరుంధతి ఉంటే మనోహరి మాత్రం అరుంధతిని చంపేసి అమర్‌ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్‌ చేసింది. ఆ ప్రయత్నంలోనే అరుంధతిని చంపేసింది. అదేమీ తెలియని అమర్‌ మాత్రం మనోహరిని నమ్ముతూనే ఉన్నాడు.

భాగీని పెళ్లి చేసుకున్న అమర్‌

తర్వాత అమర్‌ హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యాడు. అమర్ తో పాటు మనోహరి హైదరాబాద్‌ వచ్చేసింది. అప్పుడే అరుంధతి సొంత చెల్లి రేడియో జాకీగా పనిచేసే భాగుమతి ఎంటర్‌ అయ్యింది. తెలియకుండానే అమర్‌ ఇంట్లో పిల్లలకు కేర్‌ టేకర్‌గా పనిలో కుదిరింది. తర్వాత అమర్ అనుకోకుండా భాగీని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మనోహరి రెండో ప్లాన్‌ ఫెయిల్ అయింది. దీంతో అప్పటి నుంచి మనోహరి, భాగీని చంపేసి అమర్‌ను పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తూనే ఉంది కానీ భాగీ తెలివైనది ఎప్పటికప్పుడు మనోహరిని అడ్డుకుంటూనే ఉంది. భాగీకి అమరేంద్ర నమ్మిన బంటు రాథోడ్‌ సాయం చేస్తూ వస్తున్నాడు.

బుజ్జమ్మను చంపేందుకు మనోహరి ప్రయత్నం

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

కొద్ది రోజులకు అమర్‌కు భాగీకి ఒక పాప పుట్టింది. అరుంధతియే మళ్లీ పుట్టిందని అందరూ అనుకున్నారు. ఆ పాపకు ఏవో దివ్య శక్తులు ఉన్నాయని మనోహరి తన మాజీ భర్త రణవీర్‌తో కలిసి ఒక మాంత్రికుడి సాయంతో ఆ పాపను చంపేయాలని చూసింది కానీ భాగీ ఎప్పటికప్పుడు అడ్డుకుంది. మనోహరి మాత్రం అమర్‌ను పెళ్లి చేసుకోవడానికి చేయని ప్రయత్నం లేదు.. అదే టైంలో అరుంధతి కోరిక మేరకు మనోహరికి పెళ్లి చేయాలని భాగీ, అమర్‌ అనుకున్నారు. అప్పుడే పార్థు సార్‌ హైదరాబాద్‌ రావడం మనోహరిని చూసి లవ్‌ చేయడం వీళ్లిద్దరికి పెళ్లి చేయడం జరిగిపోయాయి.. ఇదీ మేడం మా ఎంక్వైరీలో తేలింది అంటూ ఆ తర్వాత జరిగింది మీకు తెలుసిందే మేడం అంటాడు పోలీస్‌.

మనోహరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలి: వైజయంతి

ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే అరుంధతిని చంపింది మనోహరే అని అమర్‌కు తెలిసిపోయింది. పైగా ఈ కేసులో ఉన్న సాక్ష్యులను అరుంధతి అందరిని చంపేసినట్టే అమర్‌ను కూడా చంపాలని చూసింది. లక్కీగా అమర్‌ బతికారు కానీ గతం మర్చిపోయారు. అందుకే మనోహరిని ఏమీ చేయలేకపోయాడు అని చెప్పగానే.. అయితే అరుంధతిని ప్లాన్‌ చేసి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకోవాలి అని వైజయంతి చెప్తుంది.

ఇక అంజుకు జ్వరం వచ్చిందా అంటూ బాధపడుతున్న నటిస్తూ అమర్‌ ఇంట్లోకి వెళ్తుంది మనోహరి. మనోహరిని చూసి మీ కూతురుకు జ్వరం వచ్చిందా అంటాడు రాథోడ్‌. అందుకు నా కూతురు ఎవరు అంటూ మనోహరి షాకింగ్‌గా అడుగుతుంది. రాథోడ్‌ నేను ఏమన్నాను మీరేం అంటున్నారు మేడం అంటూ మాట మారుస్తాడు. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?