Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి నన్స్‌ తో కలిసి వెళ్లబోతుంటే అప్పుడే వచ్చిన వైజయంతిని చూసి మనోహరి షాక్‌ అవుతుంది. కోపంగా చ ఇదీ ఇప్పుడే రావాలా..? అని మనసులో తిట్టుకుంటుంది. వైజయంతి దగ్గరకు వెళ్లి ఎక్కడికి వెళ్తున్నావు మనోహరి అని అడగ్గానే.. వాళ్లు కోల్‌కతా మథర్‌ థెరిస్సా ఆశ్రమం నుంచి వచ్చిన నన్స్‌ మేడం అని భాగీ చెప్తుంది. మనోహరి వాళ్లతో వెళ్తుంది అని చెప్పగానే.. కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఉండగా మధ్యలో ఎలా వెళ్తావు మనోహరి నువ్వు ఎక్కడికి వెళ్లకూడదని చెప్పాను కదా వాట్‌ ఈజ్‌ దిస్‌ అమర్‌ అంటుంది వైజయంతి.

మనోహరిని కోల్‌ కతా తీసుకెళ్లడం లేదన్న నన్‌

తను కోల్‌కతా వెళ్తే తనకు కాస్త రిలాక్స్‌గా ఉంటుందని నేనే చెప్పాను మేడం అని అమర్‌ చెబితే.. తాను కోల్‌కతా వెళితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్‌ ఆగిపోతుంది అమర్‌ అంటుంది వైజయంతి. అప్పుడే అక్కడే ఉన్న నన్‌ సారీ మేడం మనోహరిని మేము కోల్ కతా తీసుకెళ్లడం లేదు అని చెప్తుంది. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని వైజయంతి అడిగితే.. ఇక్కడే హైదరాబాద్‌లో మాకో బ్రాంచ్‌ ఉంది అక్కడికి తీసుకెళ్తున్నాము అని చెప్తుంది. వాళ్ల మాటలకు అందరూ షాక్‌ అవుతారు. చంభా మాత్రం ఏంటి మనోహరి నువ్వు కోల్‌కతా వెళ్లడానికి ప్లాన్‌ చేయలేదా..? అని మనసలో అనుకుంటుంది. మనోహరి కోపంగా చంబాను చూస్తూ ఏంటి చంభా నన్ను కోల్‌కతా పంపించడానికి ప్లాన్‌ చేయలేదా..? అని మనసులో అనుకుంటుంది.

మనోహరి నన్‌ తో వెళ్లేందుకు ఒప్పుకున్న వైజయంతి

ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

వైజయంతి మాత్రం ఓ నువ్వు హైదరాబాద్‌లోనే ఉండబోతున్నావా..? అంటే.. అది నాకు ఇప్పుడే తెలిసింది అని మనసులో అనుకుంటుంది మనోహరి. అలాగయితే నాకు ఆబ్జెక్షన్‌ లేదు. బట్‌ నువ్వు ఈ సిటీ దాటి ఎక్కడికి వెళ్లకూడదు. నువ్వు నీ పాస్ఫోర్ట్‌ ఇక్కడే ఉంది కదా అని అడిగితే.. మనోహరి పాస్‌ఫోర్ట్‌ మా దగ్గరే ఉంది మేడం అని భాగీ చెప్తుంది. ఓ ముందే తీసేసుకున్నారా..? అని వైజయంతి అడిగితే.. అదేం లేదు మేండం ముందు నుంచి మనోహరి పాస్ఫోర్ట్‌ మా దగ్గరే ఉంటుంది. తను హైదరాబాద్‌లోనే ఉంటుంది కాబట్టి మీ ఇన్వెస్టిగేషన్‌కు ఇబ్బంది ఉండదు అని అమర్‌ చెప్తాడు. అందుకు వైజయంతి ఓకే అంటూ నాకు మీ ట్రస్ట్‌ అడ్రస్‌ ఇచ్చి వెళ్లండి.. మనోహరి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంక్వైరీకి రావాలి అంటూ చెప్పగానే.. మనోహరి కోపంగా చ ఇది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.. ఇంత ప్లాన్‌ చేసిన దావిని కోల్‌కతా ఎందుకు వెళ్లకుండా చేశావు చంభా అని మనసులో అనుకుంటుంది. చంభా కూడా అంత ప్లాన్‌ చేసినదానివి మళ్లీ హైదరాబాద్‌లోనే ఎందుకు ఉండాలనుకున్నావు మనోహరి అని మనసులో అనుకుంటుంది. హైదరాబాద్‌ అడ్రస్ ఇచ్చిన నన్ మనోహరిని తీసుకుని వెళ్లిపోతుంది.

చంభాకు ఫోన్‌ చేసిన మనోహరి – నిజం చెప్పిన చంభా

కారులో నన్ తో కలిసి కొద్ది దూరం వెళ్లాక మనోహరి ఇరిటేట్‌ అవుతుంది. అసలు చంభా ఏం ప్లాన్‌ చేసిందో ఏంటో.. హైదరాబాద్ ఉంటే ఏంటి అమర్‌ ఇంట్లో ఉంటే ఏంటి..? అయినా ఈ చంభాకు చెప్తాను ఉండు అనుకుంటూ కారు పక్కకు ఆపమని చెప్పి కారు దిగి పక్కకు వెళ్లి చంభాకు ఫోన్‌ చేస్తుంది. మనోహరి కాల్‌ చేయడం చూసిన చంభా ఏం ప్లాన్‌ చేసింది మనోహరి చెడా మడా తిట్టాలి అనుకుంటూ కాల్‌ లిఫ్ట్‌ చేస్తుంది. మనోహరి కోపంగా ఏం ప్లాన్‌ చంభా అంటుంది. చాలా చెత్తగా దరిద్రంగా ఉంది కదా అంటూ చంభా అంటే సగం సగం పనులే చేస్తావా..? అంటూ మనోహరి తిడుతుంది. నువ్వు కూడా పూర్తిగా ఏ పని చేయవు కదా అంటుంది చంభా ఇలా ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే మనోహరి నన్స్‌ ఏర్పాటు చేసిన దానివి హైదరాబాద్‌ కాకుండా కోల్‌కతా పంపించొచ్చు కదా అంటుంది మనోహరి. దీంతో ఇద్దరికి తాము ప్లాన్‌ చేయలేదని తెలుస్తుంది. మరి నువ్వు చేయక నేను చేయక ఎవరు చేసినట్టు అని షాక్‌ అవుతారు. కట్‌ చేస్తే నేనే ప్లాన్‌ చేశాను రాథోడ్‌ అంటూ భాగీ చెప్తుంది. ప్లాన్ అదిరిపోయింది మిస్సమ్మ.. ఇది మనోహరి అసలు ఎక్స్‌ఫెక్ట్‌ చేయదు అంటాడు రాథోడ్‌. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?