Nindu Noorella Saavasam Serial Today Episode: సరస్వతి వార్డెన్‌, రాజు ఇద్దరూ కలిసి అమర్‌ ఇంటికి వెళ్తారు. వాళ్లను చూసిన రాథోడ్‌ లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్లిన వార్డెన్‌, రాజులను చూసిన భాగీ ఆశ్చర్యపోతుంది. మేడం మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. అందుకు రాథోడ్‌ వెంటనే వైజయంతి మేడం గారు రమ్మన్నారట మిస్సమ్మ అని చెప్పగానే.. భాగీ షాక్‌ అవుతుంది. వైజయంతి మేడంకు మీరెలా తెలుసు అని అడుగుతుంది. అందుకు రాథోడ్‌ ఆమె ఎంతైనా పోలీస్‌ ఆఫీసర్‌ కదా మిస్సమ్మ పునాదులతో సహా తవ్వాలనుకుంటున్నారు అని చెప్పగానే.. పునాదులు ఏంటి రాథోడ్‌ అని భాగీ అడుగుతుంది.

వైజయంతి, మనోహరి గురించి చెప్పొద్దన్న భాగీ

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

అందుకు సరస్వతి వార్డెన్‌ మనోహరి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర మొత్తం వైజయంతి మేడం తెలుసుకోవాలనుకుంటున్నారు భాగీ అని చెప్పగానే.. భాగీ అనుమానంగా అంటే మీరు మనోహరి గురించి చెప్పడానికి వచ్చారా..? అని అడిగితే.. రాజు అవును మేడం ఆ దుర్మార్గురాలు చేసిన పాపాల చిట్టా విప్పడానికే సరస్వతి మేడం వచ్చారు అని చెప్తాడు. ఆ మాటలకు భాగీ భయపడుతుంది. వద్దు మేడం మీరు ఆ వివరాలేవీ చెప్పొద్దు అంటుంది. ఇంకా ఎందుకు దాచిపెడతారు మేడం ఆ రాక్షసి వల్ల మీరు ఇప్పటికే చాలా నష్టపోయారు ఇంకా ఆవిడను క్షమిస్తారా..? అంటాడు రాజు. అవును భాగీ ఇప్పటికే అది రెండు హత్యలు చేసింది ఇంకా వదిలేస్తే ఎన్ని హత్యలు చేస్తుందో అంటుంది సరస్వతి. నా భయం కూడా అదే మేడం.. ఆ మనోహరి గురించి ఇప్పటికైనా అందరికీ తెలియాలి అంటాడు రాథోడ్‌..

మనోహరి గురించి కచ్చితంగా చెప్తానన్న వార్డెన్‌

అయితే మీరు మనోహరి గురించి చెప్పాల్సి వస్తే మా అక్క గురించి కూడా చెప్పాలి కదా మేడం అంటూ భాగీ అడిగితే.. చెప్తాను అమ్మా నా పెంపకంలో మనోహరి దేవతలా పెరిగితే.. మనోహరి దెయ్యంలా పెరిగింది అని చెప్తాను అంటుంది సరస్వతి వార్డెన్‌. అయితే మనోహరే మా అక్కను చంపింది అన్న విషయం కూడా చెప్పాలి కద మేడం అని భాగీ అడిగితే.. మనోహరి దుర్మార్గం మొదలైంది అక్కడే కదమ్మా.. స్నేహం ముసుగులో నమ్మకద్రోహం చేసింది అనగానే.. ఆ విషయం తెలిస్తే మా ఆయన భరించలేరు రాజుగారు అంటూ భాగీ చెప్పగానే.. అందుకే కదా మిస్సమ్మ నువ్వు ఇన్ని రోజులు ఓపిక పట్టావు.. ఆఖరికి ఆ రాక్షసి సార్‌ను కూడా చంపాలి అనుకుంది. అయినా కూడా క్షమిస్తారా..? అంటూ రాథోడ్‌ అడిగితే.. సరస్వతి, రాజు కూడా మనోహరిని ఇంకా క్షమించవద్దని అది ఎప్పటికీ మారదు అంటూ చెప్తారు. అయినా వినకుండా దయచేసి నిజం చెప్పొద్దు మేడం అంటూ భాగీ రిక్వెస్ట్‌ చేస్తుంది.

భాగీ, రాథోడ్‌కు షాక్ ఇచ్చిన అమర్‌

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

అప్పుడే అమర్‌ డోర్‌ చాటు నుంచి వస్తాడు. అమర్‌ను చూసి అందరూ షా్క్‌ అవుతారు.. అమర్‌ లోపలికి వచ్చి ఏంటి ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని అమర్‌ అడగ్గానే.. భాగీ ఊపిరి పీల్చుకుంటుంది ఆయన ఏమీ వినలేదన్న మాట అని మనసులో అనుకుని అంటే వైజయంతి గారు మనోహరి గురించి వార్డెన్‌ మేడంను అడగాలని పిలిపించారట అని భాగీ చెప్పగానే.. అవును మనోహరి గురించి తెలసకోవడానికి నేను వైజయంతి గారికి చెప్పాను అంటూ ఇంతకీ ఏం చెప్పొద్దు అన్నావు అని అమర్‌ అడిగితే.. భాగీ ఏదో మాట మారుస్తుంది. అమర్‌ మాత్రం మేడం వైజయంతి గారికి మీకు తెలిసిన నిజాలు మొత్తం చెప్పండి అంటాడు. సరస్వతి అలాగే సార్‌ అంటుంది.

వార్డెన్‌ను చంపేస్తానన్న మనోహరి

వైజయంతి నుంచి ఎలా తప్పించుకోవాలో మనోహరి ఆలోచిస్తుంది. చంభా వెటకారంగా మాట్లాడుతుంది. ఇవాళ నువ్వు సరస్వతి వార్డెన్‌ నుంచి తప్పించుకోవడం కష్టమే అంటుంది. అంత దూరం వస్తే పార్థుకు పట్టిన గతే ఆ సరస్వతి వార్డెన్‌ కు పడుతుంది అని మనోహరి వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలకు చంభా భయంతో వణుకుతుంది. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?