Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థు చనిపోయిన ప్లేస్‌కు మనోహరిని తీసుకెళ్లి సీన్‌ రికంట్రక్షన్‌ చేస్తుంది వైజయంతి. తర్వాత వెళ్లిపోమ్మని తాను హైదరాబాద్‌ వస్తానని చెప్తుంది. ఇంకా ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పార్థు చనిపోయిన హిల్‌ స్టేషన్‌ దగ్గరకు మనోహరిని తీసుకెళ్లి సీన్‌ రీ కంట్రక్షన్‌ చేస్తుంది వైజయంతి. పార్థు ఎలా పడిపోయాడు. నువ్వేం పట్టుకోలేదా..? అంటూ మనోహరిని ప్రశ్నిస్తుంది. మనోహరి బాధపడుతన్నట్టు నటిస్తూ.. అన్ని విషయాలు చెప్తుంది. అప్పుడే అమర్‌ను పిలిచి పార్థు నిలబడిన ప్లేస్‌లో నుంచోబెట్టి ఇప్పుడు అమరే పార్తు అనుకో ఆరోజు ఏం జరిగింతో పిన్‌ పాయింట్‌గా నాకు చూపించి అంటుంది వైజయంతి. పార్థు వెళ్లి నుంచోగానే.. వచ్చేయమని నేను చెప్పాను కానీ పార్థు వినలేదు. తిరగి నా వైపు చూడబోతూ కాలు జారి పడిపోయాడు అని చెప్పగానే..

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

పార్థు పడిపోతుంటే నువ్వు పట్టుకునే ప్రయత్నం చేయలేదా అని వైజయంతి అడిగితే.. ప్రయత్నించాను కానీ నేను కొద్ది దూరంలో ఉన్నాను నేను పట్టుకునే లోపే పార్థు పడిపోయాడు అంటూ చెప్తుంది. అక్కడే నిలబడిన అమర్‌ కళ్లు తిరుగుతూ తూలుతుంటే.. భాగీ గమనించి దగ్గరకు వెళ్లి అమర్‌ను లాగేస్తుంది. అది చూసిన వైజయంతి పార్థు విషయంలో కూడా ఇలాగే జరిగి ఉంటే ఎంత బాగుండు అని మనసులో అనుకుంటుంది. సారీ అమర్‌ ఇక మీరు హైదరాబాద్ వెళ్లొచ్చు అని చెప్పగానే.. మనోహరి ఏడుస్తూ.. నా మీద మీ డౌటు తీరిందా మేడం.. నేను బాధపడతాను అని తెలిసి కూడా నా పార్థు చనిపోయిన ప్లేస్‌కు నన్ను తీసుకొచ్చారు. పార్థుతో పాటు నేను కూడా చనిపోయి ఉంటే నాకు ఈ బాధే ఉండేది కాదు అంటూ ఏడుస్తుంటే..

రాథోడ్‌ కోపంగా చూస్తూ.. పాపి చిరాయువు అని నువ్వు అంత తేలిగ్గా చావవే రాక్షసి. నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది అని మనసులో అనుకుంటాడు. నువ్వు పార్థును కాపాడుకుని ఉంటే అసలే ఏ బాధలు ఉండేవి కావు. ఈ కేసు నేనే టేకప్‌ చేస్తున్నాను. నిన్ను ఇక్కడికి రప్పించడం కాదు. అవసరం అయినే నేనే ఎక్కడికైనా వెళ్తాను. హైదరాబాద్‌కు కూడా.. ఈ కేసులో నాకు నీ హెల్ప్‌ కావాలి మేడం అని చెప్పగానే.. ష్యూర్‌ మేడం మీకు ఎలాంటి హెల్ప్‌ కావాలన్నీ చేస్తాను. మీరు హైదరాబాద్‌కు వచ్చినా ఓకే.. లేదా నన్ను ఢిట్టీ రమ్మనా ఓకే అని చెప్తాడు. రాథోడ్‌ కోపంగా పార్థు సార్‌ను చంపిన వాళ్లను వదిలిపెట్టోద్దు మేడం పార్థు సార్‌కు న్యాయం జరగాలి అంటే.. తప్పకుండా రాథోడ్‌ వాడికి న్యాయం చేయకపోతే నేను ఈ యూనిఫాం వేసుకుని వేస్ట్‌ అంటుంది వైజయంతి. మీరు హైదరాబాద్‌ వస్తే తప్పకుండా మా ఇంట్లోనే ఉండాలి అని భాగీ చెబితే.. తప్పకుండా భాగీ నేరుగా మీ ఇంట్లోనే ఉంటాను.. మీరిక బయలుదేరండి అంటూ చెప్పగానే.. అందరూ వెళ్లిపోతారు.

అమర్‌ వాళ్లు హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లగానే.. గుమ్మం దగ్గర పిల్లలు నిలబడి ఏడుస్తూ ఉంటారు. మనోహరి కారు దిగి పార్థుతో పెళ్లి జరిగిన విషయం అమర్‌తో ఈ ఇంటికి రెండు రోజుల్లో వచ్చేస్తాను అంటూ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఐయామ్‌ బ్యాక్‌ అనుకుంటూ వెళ్లిపోతుంది. పిల్లలు అమర్‌ను పట్టుకుని ఏడుస్తుంటారు. అది చూసిన చంభా చచ్చింది మనోహరి మొగుడు అయితే వీళ్లేంటి అమ్మా నాన్నా అంటూ ఏడుస్తున్నారు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?