Nindu Noorella Saavasam Serial Today Episode: హాస్పిటల్‌లో సీసీటీవీ పుటేజీ కాలిపోవడంతో వైజయంతి సీరియస్‌ అవుతుంది. వీలైనంత త్వరగా నేరస్తుడిని పట్టుకుంటానని చాలెంజ్‌ చేస్తుంది. హోటల్‌ రూంకి వెళ్లి చూసిన వైజయంతి మనోహరిని అనుమానిస్తుంది. ఇంకా ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వైజయంతి మాటలకు నవ్వుకున్న మనోహరి

తనను ఎవరో ఫాలో అవుతున్నారు. వాళ్లెవరో కనిపెడతానని వైజయంతి చెబుతుంటే.. బయటి నుంచి వింటున్న మనోహరి నన్ను పట్టుకోవడం నీవల్ల కాదు. నాతో జైలు ఊచలు లెక్కపెట్టించలేవు అని మనసులో అనుకుంటుంది. వాళ్లెవరో చాలా తెలివైన వాళ్లు అనుకుంటున్నారు. కానీ వాళ్లెంతో మూర్ఖులు నాతోనే పెట్టుకుంటున్నారు. వాళ్లు ఏం చేస్తారో చేయని నేను చేసేది చేసి చూపిస్తాను.. అంటే ఆల్‌ ది బెస్ట్‌ మిసెస్‌ వైజయంతి ఐపీఎస్‌ అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది మనోహరి.

హోటల్‌ రూం ను చెక్‌ చేసిన వైజయంతి

తర్వాత పార్థు, మనోహరి కులుమనాలిలో స్టే చేసిన హోటల్ కు వెళ్తుంది వైజయంతి. అక్కడ పార్థు లగేజీ ఉండటం చూసి మనోహరి లగేజీ ఎక్కడుందని అడుగుతుంది. మనోహరి లగేజీ తానే తీసుకెళ్లినట్టు కానిస్టేబుల్‌ చెప్తాడు. దీంతో వైజయంతి అనుమానిస్తుంది. పార్థు లగేజీ ఎందుకు తీసుకెళ్లలేదు అనుకుంటుంది. సూట్‌ కేసు తీసుకుని ఓపెన్‌ చేస్తుంది వైజయంతి. అందులో పార్థు రాసిన డైరీ ఉంటుంది. అందులో తామిద్దరు కలిసి దిగిన ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి వైజయంతి ఎమోషనల్‌ అవుతుంది. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే అమర్‌ కాల్‌ చేస్తాడు. తాము హైదరాబాద్‌ వెళ్తున్నామని చెప్తాడు.

మనోహరిని డెడ్‌ స్పాట్‌కు తీసుకురమ్మన్న వైజయంతి

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

సరేనని ఒకసారి మనోహరిని తీసుకుని పార్థు చనిపోయిన దగ్గరకు రమ్మని చెప్తుంది. అమర్‌ సరే అంటాడు. కాల్‌ కట్‌ చేసిన తర్వాత మనోహరి మనం పార్థు చనిపోయిన ప్లేస్‌కు వెళ్దాం అంటాడు. ఎందుకని మిస్సమ్మ అడిగితే.. వైజయంతి గారు రమ్మంటున్నారు అని చెప్పగానే.. మనోహరి తాను రాలేనని అక్కడికి వచ్చి మళ్లీ బాధపడలేనని చెప్తుంది. అందుకు మిస్సమ్మ అప్పుడు నువ్వు మర్డర్‌ చేసినదానివి అవుతావు అంటుంది. ఆ హత్య మీరే చేశారని పోలీసులు అరెస్ట్ చేస్తారండి అంటూ రాథోడ్‌ అంటాడు.

ఇన్వెస్టిగేషన్‌ పూర్తి అయ్యే వరకు వైజయంతి గారు చెప్పనట్టు వినాలన్న అమర్‌

మనోహరి బాదపడుతున్నట్టు చూశావా అమర్ వీళ్లు ఏం మాట్లాడుతున్నారో.. వీళ్లు కూడా పోలీసుల్లాగా నన్ను అనుమానిస్తున్నారు అని చెప్పగానే.. మేము అనుమానించడం లేదు మనోహరి. మేము కూడా నీ నిజాయితీన నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం.. అంటుంది భాగీ.. పార్థు సార్‌ చనిపోయినప్పుడు మీరు పక్కనే ఉన్నారు కదండి అందుకే వైజయంతి మేడం గారు మిమ్మల్ని అక్కడకు రమ్మంటున్నారు అని రాథోడ్‌ చెప్తాడు. అమర్‌ కూడ అవును మనోహరి ఈ ఇన్వెస్టిగేషన్‌ అంతా వైజయంతి గారి చేతుల్లో ఉంది. తను ఏం చెబితే నువ్వు అది చేయాలి. తనను కాదని మనం ఢిల్లీ వదిలి వెళల్లేము అంటూ అమర్‌ చెప్పగానే.. ఎందుకు అమర్‌ నేను ఏం తప్పు చేశానని అందరూ నన్ను ఇలా వేధిస్తున్నారు అంటే.. ఒకసారి నీకు క్లీన్‌ చీట్‌ వస్తే ఇక విచారణ ఏమీ ఉండదు నీకు పదండి వెళ్దాం అంటూ అమర్‌ వెళ్లిపోతాడు. మనోహరి కోపంగా మళ్లీ ఏం విచారణ ఉందో ఏంటో అనుకుంటూ వెనకాలే వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!