Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌, మనోహరి హాల్లో ఉండగా అప్పుడే నిద్ర లేచిన బుజ్జమ్మ రూంలోంచి వస్తూ.. భాగీని అమ్మా అమ్మా అంటూ పిలుస్తుంది. మనోహరి షాక్‌ అవుతుంది. వెంటనే బుజ్జమ్మను ఆపాలని చూస్తుంది.
మనోహరి: ( మనసులో) అరే ఈ పిల్ల నిద్రమత్తులో భాగీని అమ్మా అని పిలుస్తుంది. అమర్‌కు తెలిసిపోతుందేమో..?
భాగీ: నేను ఇక్కడున్నాను
బుజ్జమ్మ: అమ్మా నేను నిద్ర లేచాను నాకు పాలు కావాలి
భాగీ: బ్రష్‌ చేశావా..?
బుజ్జమ్మ: ఇంకా లేదు బెడ్‌ మిల్క్‌ కావాలి
భాగీ: బెడ్‌ కాఫీలా..? బెడ్‌ మిల్కా..?
మనోహరి: భాగీ, అమర్‌ హాల్లోనే ఉన్నాడు భాగీ
రాథోడ్‌: (మనసులో) పాపం నైట్‌ జరిగింది తెలియక మనోహరి టెన్షన్‌ పడిపోతుంది
అమర్‌: నేను హాల్లో ఉంటే ఏంటి మనోహరి
మనోహరి: అంటే అమర్‌ అది…
భాగీ హాల్లోకి వస్తుంది.
అమర్‌: పాప పాలు అడుగుతుంది కదా ఇవ్వు
భాగీ: పళ్లు తోముకోకుండా పాలేంటి.. బ్రష్‌ చేశాకే ఏదైనా
అమర్: అది నీ ఇష్టం కాదు పాప ఇష్టం..
బుజ్జమ్మ: ఇట్స్‌ ఓకే సార్ అమ్మ ఎలా చెప్తే అలా చేస్తాను బ్రష్‌ చేశాకే పాలు తాగుతాను..
భాగీ: విన్నారా… పాప నా మాటే వింటుందట. అన్నయ్యలు అక్కలు నిద్ర లేచారా..?
బుజ్జమ్మ: వాళ్లు ఎప్పుడో నిద్ర లేచారు
భాగీ: అంటే నువ్వు వాళ్లకంటే లేట్‌ అన్నమాట
అమర్‌: పాప ఇష్టం వచ్చినప్పనుడు నిద్రలేస్తుంది. నీ యజమాయిషీ ఏంటి..?
బుజ్జమ్మ: లేదు సార్‌ తప్పు నాదే కదా అమ్మనేం అనకండి
భాగీ: గుడ్‌ గర్ల్‌ పద నీకు బ్రష్‌ చేయిస్తాను
అంటూ బుజ్జమ్మను తీసుకుని భాగీ వెళ్లిపోతుంది. అమర్‌ కూడా వెళ్లిపోతాడు. మనోహరి మాత్రం కంగారు పడుతుంది.
మనోహరి: రాథోడ్‌ ఆ పిల్ల తన కూతురని చెప్పేసిందా..? అమర్‌కు తెలిసిపోయిందా..?
రాథోడ్‌: లేదు మేం.. తెలియదు..
మనోహరి: మరి అమర్‌ ముందే ఆ పిల్ల భాగీని అమ్మా అని పిలుస్తుందే..
రాథోడ్‌: సారే పిలవమన్నాడు
మనోహరి: ఎప్పుడు చెప్పాడు
రాథోడ్‌: రాత్రి చెప్పారు మేడం. (రాత్రి జరిగిన విషయం చెప్తాడు.) సార్‌కు ఏమీ తెలియదు.. మీరేం కంగారు పడకండి.. మిస్సమ్మ ఏమీ చెప్పలేదు
అంటూ రాథోడ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మనోహరి కూల్‌ అవుతుంది.
మనోహరి: చూశావా చంభా, భాగీ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. పాప గురించి అమర్‌కు ఏమీ చెప్పలేదు
చంభా: కానీ పాపతో అమ్మా అనిపించుకుంటుంది కదా
మనోహరి: తల్లి లేని పిల్ల భాగీని అమ్మా అని పిలిస్తే తప్పేంటి చెప్పు
చంభా: నాకు అలా అనిపించడం లేదు ఆ పాప తన పాపే అని భాగీ మెల్లగా అమరేంద్రకు చెప్పే ప్రయత్నం చేస్తుంది అనిపిస్తుంది
మనోహరి: అనవసరంగా భాగీని అనుమానించకు పాపం భాగీ నాకోసమే వచ్చింది. నన్ను అమర్ ను కలపడానికి వచ్చింది.
చంభా: (మనసులో) నువ్వు అలాగే కలలు కంటూ ఆ భ్రమలోనే ఉండు.
మనోహరి: చూస్తూ ఉండు.. ఈరోజు నుంచి భాగీ తన పని మొదలు పెడుతుంది.
చంభా: ఆవిడ గారు తాను వచ్చిన పని మొదలు పెట్టి చాలా సేపు అయింది. కానీ నీకే ఇంకా అర్థం కావడం లేదు..
మనోహరి: నువ్వు అంటున్నది నాకేమీ అర్థం కావడం లేదు.
చంభా: నేను చెప్పినా నీకు అర్థం కాదులే పోను పోను నీకే అర్థం అవుతుంది. భాగీ ఇక్కడికి ఎందుకు వచ్చిందో
అని చెప్పి చంభా వెళ్లిపోతుంది. మనోహరి ఏంటో ఈ యాదమ్మ అంటూ ఆలోచిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.