Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌ లో ఉన్న చిత్రగుప్తుడు ఆరును తిట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో యమలోకం నుంచి విచిత్రగుప్తుడు వస్తాడు. దీంతో చిత్రగుప్తుడు అనుమానంగా నా గురించి ప్రభువుల వారికి నిజం చెప్పి ఇక్కడకు తీసుకుని వచ్చావా… ? అని అడుగుతాడు. దీంతో విచిత్రగుప్తుడు కోపంగా చిత్రగుప్తుడిని తిడతాడు.

విచిత్రగుప్త: నేను నీలా స్వార్థపరుడిని కాదులే చిత్రగుప్తుల వారు. తమరు మా స్థానమును చేజికించుకోవడానికి మీరు చేసిన ప్రయత్నములు అన్ని నాకు తెలుసు. అయినా నేను నీకు మంచి చేయుటకే వచ్చాను

చిత్రగుప్తుడు: నీ మాయ మాటలు మూట కట్టుకో ఆ బాలికతో పన్నాగం పన్ని.. నాతోనే ఆ బాలికను భూలోకం తీసుకువచ్చేలా చేసింది నువ్వేనని నాకు తెలియదు అనుకుంటివా..? ముందు తమరు ఎందుకు విచ్చేశారో అది తెలపండి

విచిత్రగుప్త: ప్రభువు వారు తమరి కోసం వెతుకుతున్నారు. యమభటులు మీ కోసం యమలోకం మొత్తం వెతుకుతున్నారు. తమరు ఇక్కడ ఉన్నారని ప్రభువుల వారికి తెలిసినచో.. మీరు శాశ్వతంగా ఇక్కడనే ఆ చెట్టు కింద సేద తీరతారు

చిత్రగుప్తుడు: ఇప్పుడు నేనేం చేయాలో చెప్పుము

విచిత్రగుప్త: నేను ఆ బాలికను తీసుకొని వచ్చెదను.. మీరు వెంటనే యమలోకం వెళ్లండి..

చిత్రగుప్తుడు: వెళ్తాను కానీ ఆ అనామికకు తన పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉందని తెలియజేయవలెను

విచిత్రగుప్త: ప్రమాదమా..? ఏం జరిగింది

అని అడగగానే.. రణవీర్‌ ఇంట్లో జరిగింది చెప్తాడు చిత్రగుప్తుడు. అయితే మనం ఈ సమాచారం ఆ ఆత్మకు తెలిసేలా చేయాలంటాడు విచిత్రగుప్తుడు. మరోవైపు అంజు బెడ్‌ మీద ఉంటుంది. డాక్టర్ చెక్‌ చేస్తుంటాడు. అమ్ము ఏడుస్తుంది.

అమ్ము: అంజుకు ఏమైంది మిస్సమ్మ..?

భాగీ: అంజుకు ఏం కాదు నువ్వేం భయపడకు అమ్ము

డాక్టర్‌ పిలవగానే.. అంజు మెల్లగా కళ్లు తెరుస్తుంది. కళ్లు తెరుస్తూనే.. మనోహరి కత్తితో పొడవడం గుర్తు చేసుకుని మమ్మీ, డాడీ అని గట్టిగా అరుస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. డాక్టర్‌ ఇంజక్షన్‌ ఇవ్వగానే.. మెల్లగా నిద్రలోకి వెళ్తుంది.

భాగీ: డాక్టర్‌ పాప కళ్లు తెరుస్తుంది. కానీ ఎందుకో ఇలా అరుస్తుంది..

అమర్‌: ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు డాక్టర్‌

డాక్టర్‌: పాప ఏదో చూసి భయపడింది..

మను: నేను కాళీని పొడవడం చూసేసింది. కన్ఫంగా ఆ పొట్టిది కళ్లు తెరిస్తే.. అమర్‌కు నిజం చెప్పేస్తుంది (అని మనసులో అనుకుంటుంది.)

డాక్టర్‌: కళ్లు తెరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కళ్ల ముందు అదే కనిపించగానే మళ్లీ అందుకే ఇలా అరుస్తుంది

అనామిక: నిన్న నైట్‌ ఇంట్లోంచి చాలా యాక్టివ్‌గా వెళ్లింది. రణవీర్‌ గారి ఇంట్లోనే ఏదో జరిగి ఉండాలి.

రాథోడ్‌: అందరం వెళ్లాము.. డిన్నర్‌ చేశాం వచ్చేశాం

భాగీ: లేదు రాథోడ్‌ అనామిక గారు చెప్పినట్టు అక్కడ ఏదో జరిగింది. అంటే అంజు నిద్రలో దొర్లుకుంటూ కిందపడలేదు. తను అక్కడ ఏదో చూసి స్పృహ తప్పి పడిపోయిందన్నమాట

నిర్మల: పాపం భయంతో ఎంత కంగారు పడిపోయిందో ఏంటో..? దేవుడా.. ఎందుకయ్యా నా కుటుంబానికే ఇన్ని కష్టాలు ఇస్తున్నావు

శివరాం: అమర్‌ అంజు చాలా గట్టి పిల్ల అక్కడ ఏం చూసి ఉంటే.. ఇంతలా భయపడి ఉంటుంది.

అమర్: అదే నాకు అర్థం కావడం లేదు నాన్నా.. మేము అంజు కోసం వెళ్లినప్పుడు రణవీర్‌ నార్మల్‌ గానే ఉన్నారు. ఏదైనా జరిగి ఉంటే అలా ఉండేవారు కాదు కదా

అనామిక: మనోహరి గారు నిన్న మీరు సార్‌ వాళ్లు రణవీర్‌ వాళ్ల ఇంటికి వెళ్లారని తెలుసుకుని మీరు బయటికి వెళ్లారు కదా..? అప్పుడు మీరు అక్కడికి వెళ్లారా..?

మను: నేను అక్కడికి ఎందుకు వెళ్తాను. నాకు జూబ్లిహిల్స్‌ వెళ్లాను.

భాగీ: అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. రణవీర్‌ ఇంట్లో సీసీటీవీ పుటేజీ చెక్‌ చేస్తే సరి.

అని భాగీ చెప్పగానే అయితే రేపు వెళ్లి చెక్‌ చేద్దాం అని అమర్‌ చెప్తాడు. అందరూ వెళ్లిపోతారు. తన రూంలోకి వెళ్లిన మనోహరి ఎలాగైనా అమర్‌ సీసీటీవీ పుటేజ్‌ చూడకుండా ఆడ్డుకోవాలని అలాగే అంజును చంపేయాలని డిసైడ్‌ అవుతుంది. అందరూ పడుకున్నాక అంజు రూంలోకి వెళ్లి అంజును చంపబోతుంటే.. ఇంతలో రూంలోకి భాగీ వస్తుంది.. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!