Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలను చంపేందుకు ప్రచండకు ఇదే అఖరి అవకాశం అని చెప్తుంది మనోహరి. ప్రచండ కూడా ఇవాళ్టీ పిల్లలందరూ చనిపోతారని చెప్తాడు. మరోవైపు కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలుసుకున్న అమర్‌ పార్థుతో కలిసి వెళ్లిపోతాడు. అంతా చూసిన చంభా వెళ్లి మనోహరికి మొత్తం చెప్తుంది. దీంతో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

ప్రచండకు ఫోన్‌ చేసిన మనోహరి – ఇంకాసేపట్లో పిల్లలు చనిపోతారన్న ప్రచండ

చంభా సలహా ప్రకారం మనోహరి, ప్రచండకు ఫోన్‌ చేస్తుంది. పని అయిందా..? లేదా అని అడగ్గానే.. ప్రచండ కోపంగా ఇప్పుడే కారు బ్రేకులు కట్‌ చేశాను. ఆ కారుకు యాక్సిడెంట్ జరిగి పిల్లలందరూ పోతారు అని చెప్పగానే.. మనోహరి ఆశ్చర్యంగా ఏంటి బ్రేక్‌ వైర్స్‌ కట్‌ చేశావా..? నువ్వు మాత్రికుడివి కదా ఇంకేదో చేస్తావు అనుకున్నాను అని అడగ్గానే.. ఇన్నాళ్లు నా మంత్రాలతో ఏ పని జరగలేదు. అందుకే ఇప్పుడు తంత్రాలతో బ్రేకులు తీసేశాను. ఈసారి కచ్చితంగా పిల్లల పని అయిపోతుంది అని చెప్పగానే.. మనోహరి భయంగా చూడు ప్రచండ ఇది నీకు మాత్రమే కాదు నాకు కూడా చివరి అవకాశం ఇప్పుడు మిస్‌ ఆయ్యామా..? నీకు బుజ్జమ్మ శక్తులు దక్కవు నాకు అమరేంద్ర దక్కడు. అని చెప్పగానే.. ఈసారి మనం ఓడిపోయే ప్రసక్తే లేదు మనోహరి పిల్లలను ఆ దేవుడు కూడా కాపాడలేడు. జరగబోయే ఆ మృత్యువు ప్రళయాన్ని కళ్లారా చూద్దామని కాచుకు కూర్చున్నాను అని ప్రచండ చెప్పగానే.. ఆ యాక్సిడెంట్‌ లైవ్‌లో చూడాలని.. వాళ్ల చావు కేకలను వినాలని నాకు కూడా ఉంది. కానీ నేను ఇప్పుడు బయటకు రాలేను. పని అవ్వగానే నాకు ఫోన్‌ చేయ్‌.. నీ కాల్‌ కోసం నేను వెయిట్‌ చేస్తూ ఉంటాను అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది మనోహరి. చంభా కూడా నమ్మకంగా కచ్చితంగా పని అయిపోతుంది మనోహరి. నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్తుంది.

కారు బ్రేకులు ఫెయిల్‌ అయిన విషయం అమర్‌ ఫోన్‌ చేసి చెప్పిన అంజు

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

కారు బ్రేకులు పడకపోవడంతో పిల్లలు భయపడుతుంటారు. రాథోడ్‌ కారును కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. పిల్లలు భయంతో రాథోడ్‌ డాడీకి కాల్‌ చేసి చెప్తాము అంటే వద్దు అంజు పాప ఎలాగైనా నేను కారును కంట్రోల్‌ చేస్తాను అంటాడు. అంజు ఆగకుండా వెంటనే ఫోన్‌ తీసుకుని అమర్‌కు కాల్ చేస్తుంది. కాల్‌ లిఫ్ట్‌ చేసిన అమర్‌, రాథోడ్‌ పిల్లలను స్కూల్‌ లో డ్రాప్‌ చేశావా అని అడగ్గానే.. అంజు భయంగా డాడీ నేను అంజును అని చెప్పగానే.. అమర్‌ కంగారుగా అంజు ఏమైంది అందరూ ఏడుస్తున్నారు.. అని అడగ్గానే.. అంజు ఏడుస్తూ.. మా కారు బ్రేక్స్‌ ఫెయిల్‌ అయ్యాయి. కారు స్పీడుగా వెళ్తుంది. రాథోడ్‌ ఆపలేకపోతున్నాడు డాడీ అని చెప్పగానే.. అమర్‌ కంగారుపడుతూ మీరు ఎక్కడున్నారు.. ఫోన్‌ రాథోడ్‌కు ఇవ్వు అని చెప్పగానే.. రాథోడ్‌ ఫోన్‌ మాట్లాడుతూ ఉన్న సిచ్యుయేషన్‌ చెప్తాడు. అమర్‌ వెంటనే తాను వస్తున్నానని చెప్పి కాల్‌ కట్‌ చేస్తాడు. పార్థును తీసుకుని అమర్‌ బయలుదేరుతాడు.

మనోహరికి గుడ్‌ న్యూస్‌ చెప్పిన చంభా

అంతా చూసిన చంభా సంతోషంగా లోపలికి వెళ్తుంది. మనోహరికి విషయం చెప్తుంది. నీ ప్లాన్‌ సక్సెస్‌ అవ్వబోతుంది మనోహరి. పిల్లలను కాపాడటానికి అమర్, పార్థు వెళ్లారు అని చెప్తుంది. మనోహరి కంగారుగా ఏంటి అమర్‌ వెళ్లాడా..? అని అడగ్గానే.. వెళ్లాడు కానీ వాళ్లు వెళ్లే సరికి కారుకు యాక్సిడెంట్‌ అయి రాథోడ్‌, పిల్లలు చనిపోయి ఉంటారు.. ఈసారి నువ్వు గెలవబోతున్నావు.. ఇక అమర్ సార్‌ నీకే సొంతం.. నీ కల నెరవేరబోతుంది అంటూ చెప్పగానే.. మనోహరి సంతోషంగా చంభాను కిస్‌ చేసి ఫస్ట్‌ టైం నీ నోట నుంచి పాజిటివ్‌ మాట వింటున్నాను చంభా.. నీ నోటి వాక్కు ఫలిస్తే నువ్వు ఏమి అడిగినా నేను ఇస్తాను అని చెప్తూ.. దేవుడా థాంక్యూ దేవుడా థాంక్యూ సో మచ్‌ అనుకుంటూ ఆరు ఫోటో దగ్గరకు వెళ్లి ఓసేయ్‌ అరుంధతి ఇప్పుడు కాపాడుకోవే నీ పిల్లలను చనిపోయిన నువ్వే కాదు బతికి ఉన్న భాగుమతి కూడా నీ పిల్లలను కాపాడలేదు అంటూ చాలెంజ్‌ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?