Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ మాటలు బట్టి తనకు గతం గుర్తుకు వచ్చిందేమోనని భాగీ అనుమానిస్తుంది. కానీ అమర్‌ అదంతా ఏం లేదని భాగీని కన్వీన్స్‌ చేస్తాడు. తర్వాత పార్థు గురించి మనోహరి, చంభా మాట్లాడుకుంటుంటే మనోహరి రూంలోకి వెళ్లి వింటాడు అమర్‌. అమర్‌ను చూసి మనోహరి, చంభా షాక్ అవుతారు. ఇలాంటి ట్విస్టులతో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ ఆసక్తిగా జరిగింది.

అమర్‌ను అనుమానించిన భాగీ

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

రూం సర్దతున్న భాగీ తుమ్ముతుంటే.. అప్పుడే రూంలోకి వెళ్లిన అమర్‌ ఏంటి మిస్సమ్మ తుమ్ముతున్నావు అని అడిగితే భాగీ తుమ్ముతూనే నేను తుమ్మానా..? లేదే అంటుంది. ఆ మాటలకు అమర్‌ కోపంగా ఐస్‌క్రీమ్‌ తినోద్దు జలుబు చేస్తుంది అని చెబితే వినకుండా తిన్నావు.. ఇప్పుడు చూడు అనగానే.. భాగీ అనుమానంగా ఐస్‌క్రీమ్‌ తింటే నాకు జలుబు వస్తుందని మీకెలా తెలుసు అని అడుగుతుంది. అందుకు అమర్‌ ఎలా అంటే అది అంటూ తడబడుతుంటే.. భాగీ నిజం చెప్పండి మీకు గతం గుర్తుకు వచ్చింది కదా..? నాతో నాటకాలు ఆడుతున్నారు కదా..? అని అడిగితే అమర్‌ నాటకాలేంటి మిస్సమ్మ ఐస్‌క్రీమ్‌ తింటే ఎవరికైనా జలుబు చేస్తుంది అని చెబితే లేదు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అంటుంది భాగీ. లేదు నేనేం దాయడం లేదు పద ఆవిరి పడుదువు కానీ అని అమర్‌ చెబితే ఆవిరి ఎందుకు అని భాగీ అడిగితే.. అందుకే నీకు బ్రెయిన్‌ లేదు అనేది. మెడిసిన్‌ వాడకుండా జలుబు ఎలా తగ్గుతుంది అని చెబితే.. భాగీ టాబ్లెట్‌ వేసుకుంటాను అని చెప్తుంది. అయినా సరే ఆవిరి పట్టుకుంటే జలుబు త్వరగా తగ్గుతుంది ఆవిరి ట్యూబ్స్‌ అవి ఎక్కడ పెట్టావు అని అడిగితే మొన్న మనోహరి తీసుకుంది అని భాగీ చెప్పగానే.. అమర్‌ సరే నువ్వు రెడీగా ఉండు నేను మనోహరి దగ్గరకు వెళ్లి అవి తీసుకొస్తాను అని వెళ్లిపోతాడు.

పార్థును ఎలాగైనా అడ్డు తప్పించాలన్న మనోహరి

<a title="ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త" href="https://telugu.abplive.com/photo-gallery/lifestyle/who-should-avoid-eating-jamuns-know-the-potential-health-risks-248041" target="_self">ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

రూంలో చంభాతో ఉన్న మనోహరి ఆ పార్థు నేను ఊహించిన దానికంటే డేంజర్‌గా ఉన్నాడు చంభా.. వచ్చిన మొదటి రోజే నా దాకా వచ్చాడు అని భయపడుతుంటే.. చంభా కోపంగా అందుకే నిన్ను పారిపోమని చెప్పేది. ఇప్పటికైనా నువ్వు పారిపో మనోహరి అని చెప్పగానే.. నేను కాదు ఆ పార్థునే పారిపోయేలా చేయాలి. లేదంటే నేనే రణవీర్‌ వైఫ్‌ అని వాడు బయటపెట్టేలా ఉన్నాడు అని చెప్తుంది. అందుకు చంభా అవును అది నీ వల్ల అవుతుందా..? అగ్నికి వాయవు తోడైనట్టు భాగీ ఆ ఆఫీసర్‌కు నీ మీద అనుమానం వచ్చేలా చేస్తుంది అని చెప్పగానే.. అవును అది నిన్నటి వరకు నాతో డిఫెన్స్‌ ఆడింది. ఇప్పుడు అటాకే చేస్తుంది. దానికి రాథోడ్‌ తోడు అయ్యాడు అనగానే.. చంభా అనుమానంగా నాకెందుకో నువ్వు ఊబిలో కూరుకుపోతున్నావు అనిపిస్తుంది మనోహరి వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకో.. అని చెప్పగానే.. మనోహరి కోపంగా చూస్తూ.. వేరే నిర్ణయమే లేదు వెంటనే ఏదో ఒకటి చేసి ఆ పార్థు నా జోలికి రాకుండా చేయాలి అంటూ పక్కకు చూస్తుంది.

మనోహరి, చంభా మాటలు విన్న అమర్‌

మనోహరి, చంభాతో మాట్లాడుతుంటే.. రూంలోకి అమర్‌ వచ్చి వాళ్ల మాటలు వింటాడు. తన రూంలోకి వచ్చిన అమర్ ను చూసి మనోహరి షాక్‌ అవుతుంది. చంభా కూడా తిరిగి అమర్‌ చూసి భయంతో వణికిపోతుంది. అమర్‌ మనోహరి దగ్గరకు వెళ్లి ఏంటి మనోహరి పార్థు గురించి మాట్లాడుకుంటున్నారా..? నువ్వే రణవీర్‌ వైఫ్‌ అయి ఉంటావని పార్థు అన్నందుకు ఫీలవుతున్నావా..? వాడు అంతే మనోహరి ఎప్పుడూ జోక్‌ చేస్తూ సరదాగా ఉంటాడు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు అంటూ అమర్‌ చెప్పగానే.. మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. చంభా కూడా హమ్మయ్యా అని కూల్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?" href="https://telugu.abplive.com/spirituality/dhul-hijjah-2026-the-10-best-days-of-the-islamic-lunar-calendar-last-month-of-zul-hijjah-know-in-details-247866" target="_self">ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?