Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఇంటికి బుజ్జమ్మను తీసుకుని వస్తున్న రాజు గేటు లోపలికి ఎంట్రీ కాగానే.. పై బిల్డింగ్‌ మీద నుంచి మనోహరి కింద పడిపోవడం చూస్తాడు. కింద మిలటరీ వాళ్లు మనోహరిని సేవ్‌ చేస్తారు. అంతా చూసిన రాజు వెంటనే భాగీకి ఫోన్‌ చేస్తాడు.

రాజు: అమ్మా ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది

భాగీ: ఎవరికి బాబాయ్‌ అమ్ముకా..?

రాజు: కాదమ్మా.. మనోహరికి మేడ మీద నుంచి కింద పడిపోయింది. పక్కన అమ్ము కూడా ఉందమ్మా..?

భాగీ: బాబాయ్‌ అమ్ముకు ఏమీ కాలేదు కదా..?

రాజు: ఏం కాలేదమ్మా.. సమయానికి సార్‌ రావడం వల్ల మనోహరికి ప్రాణాపాయం తప్పింది.

భాగీ: బుజ్జమ్మ ఎక్కడుంది బాబాయ్‌ తను ఎలా ఉంది

రాజు: బుజ్జమ్మకు ఏమీ కాలేదమ్మా తను నా పక్కనే ఉంది

భాగీ: సరే బాబయ్‌ బుజ్జమ్మ జాగ్రత్త

అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది. అంత సేపు భాగీ పక్కనే ఉండి అంతా వింటుంది కరుణ

కరుణ: ఏమైందే ఎందుకు అంత కంగారు పడుతున్నావు. చెప్పు.. ఏమైంది..?

భాగీ: మనోహరి మేడ మీద నుంచి కింద పడబోయిందట. ఆ టైంలో అమ్ము పక్కనే ఉందట

కరుణ: నేను చెప్పిన కదా..? ఆ మనోహరి ఏదో ఒకటి ప్లాన్‌ చేసి ఉంటుందని

భాగీ: కానీ పడబోయింది మనోహరి కదే..

కరుణ: కాదే అమ్మును పై నుంచి మనోహరి తోసేయబోతే తనే పడిపోయి ఉంటుంది. ఆ దేవుడు ఉన్నాడే చూస్తూ ఉంటాడు

భాగీ: ఒకవేళ మనోహరి ప్లాన్ సక్సెస్‌ అయి అమ్ము పడిపోయి ఉంటే..?

కరుణ: ఏయ్‌ ఊరుకో అట్లా జరగదు. అటువంటి చెడ్డోళ్లకు దేవుడు ఎప్పుడూ సాయం చేయడు.. ఇప్పటికైనా నమ్ముతవా..? ఇది జాతకం కాదు ఆ మనోహరి కుట్ర అని

భాగీ: కానీ ఇప్పుడు కూడా బుజ్జమ్మ అక్కడ ఉన్నప్పుడే ఇలా జరిగింది కదా..?

కరుణ: ఏయ్‌ ఊరుకో పోరి ఇంకా ఏం మాట్లాడుతున్నావు.. బుజ్జమ్మ జాతకం వల్ల ఆ మనోహరికి ప్రాణగండం ఉందటావా..? ఏంటి..?

భాగీ: అది కాదే

కరుణ: ఏయ్‌ ఊరికే మాట్లాడకు..అయినా నీకు ఈ జాతకం గురించి ఎవరు చెప్పిండ్రే.. ఆ బద్మాష్‌ గాణ్ణి పట్టుకుని నాలుగు పీకాలే..

భాగీ: అయ్యోయ్యో అలా అనకే ఆ జాతకం చెప్పింది పంతులు గారు

కరుణ: ఆ పంతులు గాడేమన్నా కాలజ్ఞానం చెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనుకుంటున్నావా..? పోయి పోయి ఆ పిచ్చి పంతులు మాటలు నమ్ముతావేంటే నువ్వు…

భాగీ: అలా కాదే నా విషయంలో ఏం జరిగినా నేను తట్టుకోగలను కానీ పిల్లల విషయంలో అంటేనే నేను భరించలేను

కరుణ: ఏయ్‌ పో నీ ఈ వీక్‌నెస్‌ నే ఆ మనోహరి క్యాష్‌ చేసకుంది. మనం అర్జెంట్‌గా వెళ్లి ఆ పంతులును కలవాలి. పద పోదాం.. పంతులును కలుద్దాం పద

అని కరుణ బలవంతంగా భాగీని తీసుకుని పంతులు దగ్గరకు వెళ్తారు. పంతలు ఎదురుగా వస్తుంటాడు.

భాగీ: పంతులుగారు నమస్తే.. నేను గుర్తున్నానా..?

పంతులు: ఐదేళ్ల క్రితం మీ అమ్మాయికి జాతకం చెప్పింది నేనే కదా… మీ పెద్దమ్మాయికి ప్రమాదం తప్పిపోయి ఉండొచ్చు కానీ మీ చిన్న అమ్మాయికి ప్రమాదం జరగొచ్చు కదా

భాగీ: ఏం అంటున్నారు పంతులు గారు

పంతులు: ఇప్పుడు మీరు వెళ్లి మళ్ళీ ఆ మనుషులను కలిస్తే మీ చిన్నమ్మాయికే ప్రమాదం. ప్రాణసంకటమే వాటిల్లొచ్చు

అంటూ పంతులు భయపెట్టగానే.. భాగీ భయపడుతుంది. కరుణ పంతులును తిట్టగానే పంతులు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు చంభా తన మంత్ర శక్తిని నిద్ర లేపడానికి మనోహరితో కలిసి ఫారెస్ట్‌ లోకి వెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!