Nindu Noorella Saavasam Serial Today Episode: హాల్లో పిల్లలు అందరూ భోజనం చేస్తూ.. భాగీని గుర్తు చేసుకుంటుంటే అమర్‌ కూడా భాగీని గుర్తు చేసుకుంటూ సైలెంట్‌గా బెడ్‌ రూంలోకి వెళ్లి కప్‌బోర్డులో ఉన్న భాగీ ఫోటో తీసుకుని చూస్తుంటాడు. భాగీతో ఉన్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. భాగీ పాయసం తీసుకొచ్చిన జ్ఞాపకం అమర్‌కు గుర్తుకు వస్తుంది.

భాగీ: ఏవండి మీకోసం అని జీడిపప్పు కిస్‌మిస్‌ వేసి సేమియా పాయసం చేశాను. తిని టేస్ట్‌ ఎలా ఉందో చెప్పండి.. త్వరగా రండి.. ఏవండి మిమ్మల్నే ఫ్లీజ్‌

అని పిలవగానే.. అమర్‌ దగ్గరకు వస్తాడు. భాగీ పాయసం తినిపిస్తుంది. పాయసం తిన్న అమర్‌ వెటకారంగా చూస్తుంటాడు.

భాగీ: ఏమైందండి అలా చూస్తున్నారు..? పాయసం బాగాలేదా..? చెప్పండి ఏమీ పలకరేంటండి..? చెప్పండి..

అమర్‌: చాలా బాగుంది.. పాయసం..

భాగీ: నిజంగా బాగుందా..? అలా చెప్తున్నారా..?

అమర్‌: నిజమే చెప్తున్నాను.. భాగీ పాయసం.. అమృతంలా ఉంది

భాగీ: అయితే అంత నచ్చిందా..? మీకు

అమర్‌: ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను

భాగీ: మరి నేను నచ్చానా..? పాయసం నచ్చిందా..?

అమర్‌: అదేం ప్రశ్న పాయసానికి నీకు పోలికేంటి..?

భాగీ: పాయసం స్వీటు.. నేను స్వీటు.. మాలో ఎవరు ఎక్కువ నచ్చారు మీరు చెప్పండి

అమర్‌: నిజం చెప్పాలంటే.. నాకు..

భాగీ: నిజమే చెప్పాలి మీరు.. త్వరగా..

అమర్‌: ఓకే నీకంటే పాయసమే స్వీటుగా ఉంది.

భాగీ: నా కంటే నా పాయసమే నచ్చిందా నీకు పోండి.. నేను అలిగాను బుంగమూతి పెట్టుకున్నాను.. పోండి

అమర్‌ రొమాంటిక్‌గా భాగీని దగ్గరకు తీసుకుంటాడు

అమర్‌: అలిగితే నువ్వు చాలా బాగుంటావు తెలుసా..?

భాగీ: నాకేం మీ పొగడ్తలు అక్కరలేదు.. నాకన్నా పాయసం నచ్చింది అన్నారుగా

అమర్‌: నిజంగా అలిగినప్పుడు నువ్వు ఈ పాయసం కంటే బాగుంటావు తెలుసా..? నేను అదే చెప్పబోతున్నాను నువ్వు ఇంతలోనే అలిగావు..

భాగీ: మీరేగా నాకన్నా నా పాయసం నచ్చింది అన్నారు..

అమర్‌: పాయసంలో తీసి మాత్రమే ఉంటుంది భాగీ.. కానీ నాకోసం నువ్వు పడే తపనలో ఆ తీపిని మించిన ప్రేమ ఉంటుంది. నాకు అన్నింటికన్నా ఆ ప్రేమే ఎక్కువ..

భాగీ: ఎందుకండి మీకు ప్రేమంటే ఎక్కువ..

అమర్‌: ఎందుకంటే ఒకసారి మిస్‌ అయిన ప్రేమ మళ్లీ దక్కడు అంటారు. కానీ నా విషయంలో నేను ఒకసారి కోల్పోయిన ప్రేమ రెండో సారి నీ రూపంలో నాకు దక్కింది..

భాగీ: ఈ ప్రేమను మీరు ఎప్పటికీ కోల్పోవడానికి లేదు. నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటాను మీ పక్కనే ఉంటాను. నిండు నూరేళ్లు మనిద్దరం ఇలాగే కలిసి ఉండాలి. అదే ఆ దేవుడిని నేను కోరుకుంటాను.

అంటూ అమర్‌ను దగ్గరకు తీసుకుని హగ్‌ చేసుకుని ఫోర్‌ హెడ్‌ మీద కిస్‌ చేస్తుంది భాగీ. అమర్‌ కూడా ‌హ్యాపీగా నవ్వుతూ ఉండిపోతాడు. ఇదే విషయం గుర్తు చేసుకుని అమర్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు. తర్వాత భాగీ ఫోటో తీసి కప్‌బోర్డులో పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. అమ్మును పిలుస్తాడు. అప్పటికే మేడ మీద ఉన్న అమ్మును మనోహరి కిందకు తోసేసి చంపేయాలనుకుంటుంది. అమర్‌ పిలవగానే అమ్ము వెళ్లిపోతుంది. మనోహరి కింద పడబోతుంది. వెంటనే అమర్‌ వెళ్లి చేయి పట్టుకుంటాడు. అంటూ అమర్‌ను హగ్‌ చేసుకుని కిస్‌ చేసిన విషయం గుర్తు చేసుకుంటాడు అమర్‌… మిస్సమ్మ ఫోటో చూస్తూనే ఎమోషనల్‌ అవుతుంటాడు.

మరోవైపు మేడ మీదకు వెళ్లిన అమ్మును కిందకు తోసేసి చంపేయాలనుకుంటున్న మనోహరికి షాక్‌ తగులుతుంది. అమర్‌ పైకి వస్తూ.. అమ్మును పిలుస్తాడు. అమ్ము ఏంటి డాడ్‌ అనుకుంటూ అక్కడి నుంచి కిందకు వెళ్తుంది. వెనకే తోసేయడానికి వెళ్లిన మనోహరి కిందపడబోతుంది. ఇంతలో అమర్‌ వచ్చి మనోహరి చేయి పట్టుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!