Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో పిల్లలను, బయట ఉన్న భాగీని ఏమీ చేయలేకపోతున్నానన్న కోపంతో మనోహరి తన రూంలో ఉన్న టెడ్డిబేర్‌ను కత్తితో పొడుస్తూ ఉంటుంది. అప్పుడే రూంలోకి చంభా వెళ్తుంది. మనోహరిని అలా చూసి ఆశ్చర్యపోతుంది.

చంభా: మనోహరి ఏం చేస్తున్నావు.. ఆగు మనోహరి.. చెయ్యాల్సిన పని చేయకుండా ఈ పిచ్చి పనులేంటి మనోహరి

మనోహరి: భాగీని భయపెట్టి పారిపోయేలా పోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. కానీ అన్ని బెడిసికొడుతున్నాయి

చంభా: బొమ్మను కత్తితో పొడిస్తే అది చస్తుందా..? గోడల్ని పిడికిలితో కొడితే నీ పని జరుగుతుందా..? పిల్లల్ని చంపితేనో నిన్ను నువ్వు గాయపర్చుకుంటేనో..? అమరేంద్ర నీ సొంతం అవడు మనోహరి. ఈ పిచ్చి ప్రయత్నాలు పక్కన పెట్టి అమరేంద్రను పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయ్‌. నువ్వు రణవీర్‌ భార్యవి అని తెలిస్తే నిన్ను చూడటం కాదు కదా..? అమరేంద్ర నిన్న చంపి కాటికి పంపిస్తాడు. ఆ లోపే నువ్వు అమరేంద్ర చేతితో పసుపుతాడు కట్టించుకో మనోహరి. లేదంటే అదే చేతితో నీకు ఉరితాడు బిగిస్తాడు

మనోహరి: మొదటిసారి అమర్‌ నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఆ అరుంధతి ఎగురేసుకుపోయింది. రెండో సారి అమర్‌ పక్కన పెళ్లిపీటల మీద కూర్చోవాలి అనుకున్నాను కానీ ఆ భాగీ కూర్చుంది.

చంభా: ముచ్చటగా మూడో సారి అయినా అమర్‌తో నీ పెళ్లి జరగాలి మనోహరి

మనోహరి: అందుకే కదా..? నేను ఇన్ని రోజులు ఎదురుచూస్తున్నాను

చంభా: నువ్వు ఎదురుచూసినంత మాత్రాన అమరేంద్ర తనకు తానుగా వచ్చి నీ మెడలో తాళి కట్టడు మనోహరి. నువ్వే ప్రయత్నం చేయాలి.

మనోహరి: ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇంకా నేను ఏం చేయాలి

చంభా: ఇప్పటి వరకు నీకు అమరేంద్రకు మధ్య అడ్డుగా ఉన్న వాళ్లను తప్పించడం కోసం నువ్వు అన్ని ప్రయత్నాలు చేశావు. ఇకనుంచి డైరెక్టుగా అమరేంద్రతో తాళి కట్టించుకునే ప్రయత్నం చేయ్‌.. పెద్ద పెద్ద మండపాల్లో మంగళవాయిద్యాలతో నీ పెళ్లి జరగాలని కోరుకోకు.. అది జరగని పని నీ పెళ్లి యాదృచ్చికంగా జరగాలి. అమరేంద్ర అనుకోకుండా నీ మెడలో తాళి కట్టాలి. కనురెప్ప మూసి తెరిచేలోపే నువ్వు అమరేంద్ర భార్య కావాలి. జరుగుతున్న దాడులన్నీ రణవీర్‌ భార్య చేస్తుందని అమరేంద్రకు అనుమానం వచ్చేలా నువ్వే చెప్పావు ఆ రణవీర్‌ భార్యవి నువ్వే అని తెలిస్తే అమర్‌ను పెళ్లి చేసుకోవాలన్న నీ కల ఎప్పటికీ నెరవేరదు ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు మనోహరి.. ఆలస్యం అమృతం విషం.

మనోహరి: కరెక్ట్‌ చెప్పావు చంభా నువ్వు చెప్పినట్టు అమర్‌ను అంగరంగవైభవంగా నేను పెళ్లి చేసుకోలేను.. అనుకోకుండా యాక్సిడెంటల్‌ గా మా పెళ్లి జరిగిపోవాలి. ప్లాన్‌ చేస్తాను. 48 గంటల్లోపు మాకు పెళ్లి జరిగేలా..? అమర్‌ నా మెడలో తాళి కట్టేలా ప్లాన్‌ చేస్తాను. మిగతా అన్ని ప్లాన్స్‌ పక్కన పెట్టి మా పెళ్లిపైన ఫోకస్‌ చేస్తాను. రెండు రోజుల్లో అమర్‌ తో మూడు ముళ్లు వేయించుకుంటాను.. ఈసారి మా పెళ్లి ఆ దేవుడు కూడా ఆపలేడు

అంటూ మనోహరి చెప్పగానే.. చంభా నవ్వుతూ. నీ ప్రయత్నం సఫలం కావాలి మనోహరి అంటుంది దీంతో మనోహరి కొత్త ప్లాన్‌ కోసం ఆలోచిస్తుంటుంది. తర్వాత ఈవెనింగ్‌ స్కూల్‌ లోంచి బయటకు వస్తారు బుజ్జమ్మ, అంజు. ఇంతలో బుజ్జమ్మ అక్కా ఇవాళ నేను మీ ఇంటికే వస్తాను అని చెప్తుంది. ఇంతలో అమర్‌ వస్తాడు. అంజు అమర్‌కు విషయం చెప్తుంది. వెంటనే మీ మేడంకు ఫోన్‌ చేసి చెప్పు బుజ్జమ్మ అంటూ తన ఫోన్‌లో భాగీ ఫోన్‌ చేస్తాడు. అటుసైడు కరుణతో మాట్లాడుతున్న భాగీ షాక్‌ అవుతుంది. అమర్‌ ఫోన్‌ చేస్తున్నాడని చెప్తుంది. స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడమని కరుణ చెప్పగానే.. స్పీకర్‌ ఆన్‌ చేసి హలో అంటుంది భాగీ. ఆ వాయిస్‌కు అమర్‌ వెంటనే భాగీని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

<a title="ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! " href="https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151" target="_self">ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!