nindu manasulu serial upcoming episodes ప్రాణ స్నేహితుడు అనుకుంది ప్రేరణ.. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేశాడు సిద్ధూ.. ప్రియురాలికి ఐలవ్‌యూ చెప్పకముందే ప్రియురాలి తల్లి పర్మిషన్ తీసుకున్నాడు.. తీరా అనుకోని పరిస్థితుల్లో ప్రేమించిన ప్రేరణ మెడలో తాళి కట్టిన సిద్ధూ సంతోషంగా ఉండాల్సి పోయి బాధ పడటానికి కారణమేంటి? ఆవేశంలో నోరు జారిన ప్రేరణ చేసింది నిజంగా అంత పెద్ద తప్పా? మాట పడని ప్రేరణ తగ్గి ఉండటానికి కారణమేంటి? సిద్ధూ, ప్రేరణలు ఐఏఎస్, ఏపీఎస్‌ గోల్స్‌ని పక్కన పెట్టేశారా? ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సిద్ధూ, ప్రేరణ నిండు మనసుల ప్రేమప్రయాణం ఎలా ఉండబోతుంది? ముందు ముందు సీరియల్‌లో ఏం జరగనుందో తెలుసా..

ప్రేరణని ప్రేమించిన సిద్ధూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అందరూ ప్రేరణ పుట్టక కోసం తప్పుగా మాట్లాడటంతో ప్రేరణకు తానే ఐడెంటిటీగా మారడానికి తాళి కట్టి ప్రేరణని దక్కించుకుంటాడు. సిద్ధూ, ప్రేరణల పెళ్లి ఇష్టం లేని సిద్ధూ తల్లిదండ్రులు మంజుల, విజయానంద్ గొడవ చేయడంతో సిద్ధూ కన్న తండ్రిని చంపింది పెంచిన తండ్రి విజయానంద్ అని నోరు జారుతుంది. విజయానంద్ చాలా గొప్పొడని విజయానంద్‌ని ఎంతో నమ్మిన మంజుల ఆ మాట తీసుకోలేకపోతుంది. ప్రేరణతో అలా మాట్లాడించింది సిద్ధూనే అని కొడుకుని దూరం పెట్టేస్తుంది. తల్లి ప్రేమకు దూరం కావడానికి ప్రేరణే కారణం అని సిద్ధూ ప్రేరణని దూరం పెడతాడు.

సిద్ధూ అనుమానం నిజమే.. మంజుల మొదటి భర్తని చంపింది విజయానందే కానీ అది నిరూపించడానికి సాక్ష్యాలు లేవు.. ప్రేరణకు కూడా మామ మీద అనుమానం ఉండటంతో మామే సిద్ధూ తండ్రిని చంపాడు అని నిరూపించడానికి రాను రాను విశ్వప్రయత్నాలు చేయనుంది. జీవితంలో క్షమించలేను అన్న భర్తకి ప్రేరణ దగ్గర అవ్వాలి అంటే విజయానంద్ తప్పు చేశాడు అని ప్రేరణ మంజుల దగ్గర నిరూపించాల్సి ఉంటుంది. భర్తకి దగ్గర అవ్వడానికి ప్రేరణ విజయానంద్‌ని గట్టిగానే టార్గెట్ చేస్తుంది. ప్రస్తుతం ఎపిసోడ్లో ప్రేరణ, సిద్ధూలను ఇందిర పుట్టింటికి పిలిచింది కాబట్టి ఇద్దరూ ప్రేరణ ఇంటికి వెళ్తారు. అక్కడ ప్రేరణ భర్తని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని అనిపిస్తుంది. ఇద్దరి మధ్య సన్నిహితంగా ఉండే సీన్స్ ఉండొచ్చు.. ఇక వ్రతంలో ప్రేరణ, సిద్ధూలను బ్యాడ్ చేయడానికి విజయానంద్ ప్లాన్ చేయొచ్చు.. దాన్ని ప్రేరణ చివరి నిమిషంలో తిప్పి కొట్టి మామకి షాక్ ఇవ్చొచ్చు.

ఈశ్వరి మీద దొంగ దాడి చేస్తే ఇందిర కాపాడుతుంది. తలకు గాయం అయిన ఈశ్వరిని ఇందిర, ఐశ్వర్యలు హాస్పిటల్‌కి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడొచ్చు. దాంతో ఈశ్వరికి ఇందిర మీద సదాభిప్రాయం ఏర్పడొచ్చు. ఇక గణ అయితే ఇందిర, ఈశ్వరిలే తన తల్లిని ఏదో చేశారని ఇద్దరి మీద తన ఖాకీ పవర్ చూపించొచ్చు. ఇందిర, ఐశ్వర్యలను రంజిత్, సిద్ధూ కాపాడొచ్చు. ఇంటి ఓనర్ రంజిత్ తనకు బావ అని తెలుసుకున్న ఐశ్వర్య రంజిత్‌ని ప్రేమించొచ్చు.. రంజిత్, ఐశ్వర్య ఇద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడటం రంజిత్ కూడా తన ప్రేమ విషయం ఇందిరకు చెప్పి ఒప్పించొచ్చు. మొత్తానికి ప్రేరణ, సిద్ధూ ఒకటి అవ్వాలి అంటే విజయానంద్ నిజస్వరూపం తేల్చక తప్పదు.