Nindu Manasulu Serial Today Episode ప్రేరణ ఇందిరను నాన్న ఉన్న ఏరియాకు ఎందుకు వెళ్లావని ప్రశ్నిస్తుంది. నేను ఆ ఏరియాకు వెళ్లానని నీకు ఎలా తెలుసు.. నువ్వు వెళ్లావా అని ఇద్దరూ ఒకర్ని ఒకరు ప్రశ్నించుకుంటారు. దాంతో ప్రేరణ నాన్న దగ్గరకు వెళ్లాను.. వెళ్తూనే ఉన్నాను.. అని చెప్తుంది. నాకు చెల్లికి వచ్చి ఎందుకు చెప్పలేదని ఇందిర అడిగితే నాన్న లేచే వరకు మీరు వెళ్లొద్దని ఆ గణ రాక్షసుడని నన్ను ఏం చేయలేక మిమల్ని ఏదో ఒకటి చేస్తాడని ప్రేరణ అంటుంది. ఇవాళ ఏం జరిగింది అంటే..

ప్రేరణ దగ్గర ఉన్న బుక్ కోసం సిద్ధూ రాత్రి ఇంటికి వస్తాడు. ఇందిరను చూసి నాకు మీరు ఓ సాయం చేయాలి ఆంటీ అంటాడు. ఏంటి అని అంటే ప్రేరణ దగ్గర పుస్తకం ఉందని నాకు కావాలని రేపు ఇద్దరికీ పరీక్ష ఉందని చెప్తాడు. మీ అమ్మాయి నాకు ఇవ్వడం లేదు అంటే తప్పు కదా నేను ఇప్పిస్తాను రా అని ఇందిర సిద్ధూని లోపలికి తీసుకెళ్తుంది. ఇందిర ప్రేరణని పిలుస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అని ప్రేరణ అడిగితే చూడండి ఆంటీ మీ ముందే ఎలా బెదిరిస్తుందో అని అంటాడు.

ఇందిర అలా బెదిరించకే అని అంటుంది. నేను మీ అమ్మాయిలానే సివిల్స్ రాస్తున్నా.. కష్టపడి చదువుతున్నా అని సిద్ధూ ఇందిరని మెల్ట్ చేసేస్తాడు. దాంతో ఇందిర పుస్తకం ఇచ్చేయమని అంటుంది. నేను ఇవ్వను ఇంటి నుంచి వెళ్లిపో అని ప్రేరణ అంటుంది. ఇంతలో ఓనర్‌ వచ్చి అది నేను చెప్తా అని లాయర్‌లా ఇద్దరి వాదనలు విని ఇద్దరూ కలిసి చదువుకోండి అని అంటాడు రంజిత్. ఇందిర కూడా కరెక్టే కదా ఇద్దరూ చదువుకోండి అంటుంది.

ప్రేరణ తిట్టుకుంటూ ఒప్పుకుంటుంది. ఇద్దరూ కలిసి చదువుకోవడానికి వెళ్తారు. ప్రేరణ పక్కనే సిద్ధూ కూర్చొంటే నాకు స్పేస్ కావాలి అని అంటుంది. నేను ముందు చదువుతా అంటే నేను చదువుతా అని తన్నుకుంటారు. దాంతో సిద్దూ నువ్వు చదువు నేను నోట్స్ రాసుకుంటా అంటాడు. దానికి ప్రేరణ ఒప్పుకోదు పోనీ నేను చదువుతా అని సిద్ధూ అంటే దానికి ఒప్పుకోదు. చివరకు నువ్వు గంట చదువు నేను గంట చదువుతా అని ఒప్పదం పెట్టుకుంటారు. ప్రేరణ చదివితే సిద్ధూ రాసుకుంటాడు. అందులో కూడా వినిపించడం లేదు.. గట్టిగా చదువు.. గట్టిగా చదివితే మెల్లగా చదువు అని పొట్లాడుకుంటారు.

చదువుతూ చదువుతూ ప్రేరణ పడుకుండి పోతుంది. సిద్ధూ చూసి ఏంటి పడుకుంది.. రేపే టెస్ట్ కదా అని అనుకొని కిచెక్‌కి వెళ్లి ప్రేరణ కోసం టీ చేసి తీసుకొస్తాడు. ప్రేరణని నిద్ర లేపుతాడు. టీ ఇస్తే అప్పుడే తెల్లారిపోయిందా.. నన్ను లేపకుండా మొత్తం చదివేశావా అని కంగారు పడుతుంది. మిస్ మిస్‌ అండర్ స్టాండ్ ఆగు అని సిద్ధూ అంటాడు. నువ్వు పడుకొని పది నిమిషాలే అయింది అని టీ తెచ్చాను అంటాడు. ప్రేరణ టీ తాగుతుంది. తర్వాత ఇద్దరూ చదువుతారు. ఏస్వేర్ బీ స్వేర్ ఏ ప్లస్‌బీ హోల్ స్వేర్ అంటూ నాగచైతన్య, తమన్నలు 100 పర్సెంట్ లవ్లో తన్నుకొని చదువుకున్నట్లు ఇద్దరూ చదువుకుంటారు.

ఉదయం డోర్ కొట్టడంతో ఇంత పొద్దున్న ఎవరు వచ్చారు అని ఐశ్వర్య డోర్ తీస్తుంది. గుమ్మం ముందు తండ్రిని చూసి బిత్తరపోతుంది. నాన్న అని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అక్క అమ్మా అని పిలుస్తుంది. ప్రేరణ, ఇందిర రాజశేకరాన్ని చూసి ఎమోషనల్ అవుతారు. ఇద్దరూ రాజశేఖరాన్ని హగ్ చేసుకొని ఏడుస్తారు. ఇది కలా నిజమా అని ఇందిర అంటే దేవుడు నా ఆరోగ్యం నాకు ఇచ్చేశాడు ఇది నిజమే అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.