Nindu Manasulu Serial Today Episode |  బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 30న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మంజు దగ్గరకు సాహితి..

గణ దగ్గరకు ఒకావిడ వచ్చి తన కూతురు కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చా ఇంకా డిటైల్స్ లేవు అని కాలేజ్‌ నుంచి ఇంటికి రావాల్సిన అమ్మాయి రాలేదు.. మాకు ఎవరూ శత్రువులు లేరు మీరే నా కూతుర్ని నాకు అప్పగించండి అని ఏడుస్తుంది. మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత మాది అని గణ చెప్తాడు. మరోవైపు సాహితి మంజు, విజయానంద్ దగ్గరకు వస్తుంది. ఏంటమ్మా అర్జెంట్‌గా రమ్మని చెప్పావ్ అని అంటే నా కూతురికి పెళ్లయిపోయినా నాకు చూడాలి అని ఉంటుంది కదా అని మంజు అంటుంది. మంజు పంతుల్ని పిలిచి మా అమ్మాయికి పెళ్లి అయి చాలా ఏళ్లు అయినా పిల్లలు లేరు.. ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అని చెప్తుంది. తన భర్త జాతకం వల్లే ఇలా అని భార్యాభర్తలు ఇద్దరూ శాంతి హోమం చేయాలని అంటారు. సరే అని సాహితి అంటుంది. ఈ హోమంలో మీ అమ్మాయి, వాళ్ల ఆయన రక్త సంబంధీకులు అందరూ ఉండాలి. వాళ్ల ఆశీర్వాదం ఉండాలి అని పంతులు చెప్తారు.

ఇందిరను కాపాడిన సిద్ధూ..

సిద్ధూ ప్రేరణ మాటలు తలచుకొని రోడ్డు మీద ఆగి ఉంటాడు. ఇంతలో ఇందిర అటుగా వెళ్తూ సిద్ధూని చూసి ఆటో ఆపుతుంది. సిద్ధూతో మాట్లాడాలి అని అనుకుంటూ వెళ్తూ ఓ బైక్ గుద్దేయడంతో చేతికి దెబ్బ తగులుతుంది. దాంతో సిద్ధూ కంగారుగా వెళ్లి హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు.

పర్మిషన్ ఇచ్చేసిన గణ..

సాహితి గణతో మా అమ్మ ఇంటికి పిలిచింది.. పూజ గురించి చెప్తుంది. ఇద్దరి ఇంటి వాళ్లు ఉండాలి అని చెప్తుంది. వాళ్లందరితో కలిసి హోమం చేయడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. తర్వాత సాహితి బాధ పడితే గణ నీ ఇష్టం కానీ నాకు ఎవరూ లేరు కదా అంటే మీ నాన్న ఉన్నారు. ఇందిరా అత్తయ్యా, ప్రేరణ వాళ్లు ఉన్నారు కదా అని సాహితి అంటే పిలిచినా వాళ్లురారు అని గణ అంటే నేను పిలుస్తా అని సాహితి అంటుంది. దాంతో గణ సరే అంటాడు.

ఏం చేశావ్ మా అమ్మని..

సిద్ధూ ఇందిరకు కట్టు కట్టించి ఇంటికి తీసుకొస్తాడు. ప్రేరణ చూసి కంగారుగా వెళ్లి ఏమైంది అంటుంది. చిన్న గాయం అయింది అని సిద్ధూ అంటే ఏం చేశావ్ మా అమ్మని అని ప్రేరణ అడుగుతుంది. నువ్వు నన్ను చాలా తప్పు పడుతున్నావ్.. ఏం చేశావు అని నన్ను అడుగుతున్నావేంటి? నేను మీ అమ్మని చేస్తాను? నాకేం అవసరం? మీ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అయినంతమాత్రాన అందరినీ అనుమాన దృష్టితో చూడడమేనా? ముందూ వెనకా చూసుకోకుండా ఇలా ఆవేశపడడమేనా? ముందు తనకు మంచి డాక్టర్కి చూపించండి. అప్పుడైనా తనేం మాట్లాడుతుందో తనకి తెలుస్తుంది అని సిద్ధూ అంటాడు. దానికి ఇందిర ప్రేరణ నేనే రోడ్డు మీద ఉన్న సిద్ధూ బాబుని పలకరిద్దాం అని వెళ్తూ ఉంటే, ఎవరో బైక్తో ఢీకొట్టి వెళ్లిపోయారు. సిద్ధూ బాబే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి ఈ కట్టు కట్టించి జాగ్రత్తగా తీసుకొచ్చారు అని చెప్తుంది. దానికి ప్రేరణ నువ్వు అసలు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఏం వచ్చిందమ్మా నీకు? అయినా మా అమ్మకి ఏమైనా జరిగితే ముందు మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా? నువ్వేవరు ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి? ఇలాంటి పనులు చేసి మా దగ్గర సింపతీ సంపాదించాలనీ చూస్తున్నావా? అని ప్రేరణ అడుగుతుంది. దానికి సిద్ధూ నీకు ఇందాకే చెప్పా మంచి డాక్టర్‌కి చూపించుకోమని అని అంటాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటే సాహితి, మంజుల అక్కడికి వస్తారు.

అందరూ రావాలి..

మంజుల, సాహితి రావడం చూసిన ఇందిర చాలా సంతోషంగా ఉంది రండి అని పిలుస్తుంది. సిద్ధూ వెళ్లిపోతాడు. ఇక మంజుల, సాహితి ఇందిర వాళ్లతో సాహితి కోసం రేపు హోమం చేస్తున్నాం.. దానికి భార్యాభర్తల తరుఫున అయిన వాళ్లు ఉండాలని పంతులు చెప్పారు. రేపు మీరంతా గుడిలో జరిగే హోమానికి రావాలి అని చెప్తుంది. సాహితి ఆడవాళ్లకి కుంకుమ పెట్టి హోమానికి పిలుస్తుంది. కచ్చితంగా వస్తాం అని ఇందిర అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.