Nindu Manasulu Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "నిండు మనసులు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 28న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పాప తల్లిగా నటించండి..

సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ గతం గురించి వాదించుకుంటారు. తర్వాత కిడ్నాపర్ పాప వాళ్ల అమ్మకి ఫోన్ చేసి లొకేషన్ పంపాను డబ్బు తీసుకొని రా అని అంటాడు. వెంటనే సిద్ధూ ప్రేరణలకు పోలీసులు చెప్పడంతో నా దగ్గర ఓ ఐడియా ఉంది.. మీరు కొంచెం రిస్క్ చేయాలి అని సిద్ధూ అంటాడు. ఏం చేయాలి అని ప్రేరణ అడిగితే మేడం మీరు పాప తల్లిలా నటించాలి.. అప్పుడు మేం మిమల్ని ఫాలో అవుతాం అని సిద్ధూ ఐడియా చెప్తాడు. ప్లాన్ బాగుంది అని ప్రేరణ సిద్ధూని మెచ్చుకొని అమలు చేయమని అంటుంది.

పాపని కాపాడిన సిద్ధూ, ప్రేరణ..

డబ్బులతో ప్రేరణ రౌడీలు పంపిన లొకేషన్‌కి వెళ్తుంది. సిద్ధూ వాళ్లు దూరం నుంచి చూస్తూ ఉంటారు. డబ్బులు ఇవ్వమని రౌడీలు అడిగితే నేను ఎవరితో మాట్లాడానో వాళ్లకే డబ్బు ఇస్తా అని అంటుంది. దాంతో రౌడీలు లోపలికి ప్రేరణని తీసుకెళ్తారు. పాపని చూపించి డబ్బు ఇవ్వమని అంటారు. రౌడీలు తమ బాస్‌కి వీడియో కాల్ చేసి డబ్బు తెచ్చిందని అంటుంది. ఇక బ్యాగ్‌లో డబ్బు లేకపోవడంతో రౌడీలు ప్రేరణని బాస్‌కి చూపిస్తారు. అతని తను అమ్మ కాదని చెప్తారు. ఇక పాప అది మా మామయ్య అని అంటుంది. మామయ్య అయి ఇలా చేయడానికి సిగ్గు లేదా అని ప్రేరణ తిట్టి రౌడీలను కొడుతుంది. ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ పాపని కాపాడుతారు.

మా ఆయన బామ్మర్ది..

సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ పాపని తమ తల్లిదండ్రులకు అప్పగిస్తారు. పాప తల్లిదండ్రులు ఇద్దరూ సిద్ధూ, ప్రేరణలకు థ్యాంక్స్ చెప్తారు. కిడ్నాప్ చేసిన వాళ్ల ఫోటో చూపిస్తే ఈయన నా భర్త బామ్మర్ది అని షాక్ అవుతారు. వీడి వల్లే మేం విడిపోయాం అని అంటారు. పాప కోసం ఆలోచించి మీ మధ్య అపార్థాలు వదిలేసి కలిసిపోండి అని అంటుంది ప్రేరణ. దానికి సుధాకర్ వాళ్లకి బాగా చెప్తున్నారు మీ ఇద్దరూ కలిసిపోండి అంటాడు. ప్రేరణ, సిద్ధూ కోపంగా చూడటంతో కవర్ చేస్తాడు.

సక్సెస్‌ ఫుల్ జంట..

ప్రేరణ సిద్ధూలను డీఐజీ ప్రశంసిస్తారు. మీ ఇద్దరినీ చూస్తుంటే ఇద్దరిదీ సక్సెస్‌ ఫుల్ జంటలా ఉందని అంటారు. ఏంటి సార్ అని ప్రేరణ అంటే మీ టీం వర్క్ నచ్చింది అందుకే ఇలాంటి కేసులు మీకు సాల్వ్ చేయమని అంటారు. ఇద్దరూ కలిసి పని చేయండి అని ఆయన అంటే నేను కలిసి చేయను అని అంటుంది. మీకు మీరే ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అని డీఐజీ అంటారు. తర్వాత ప్రేరణ వాళ్ల ఇంటి దగ్గర సుధాకర్, రాజశేఖరంతో డీఐజీ గారు ప్రేరణ, సిద్ధూని కలిసి పని చేయమంటే చేయడం లేదు. ఈమధ్య ప్రేరణకు గర్వం పెరిగింది అని అంటాడు. మిస్టర్ సుధా మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు అని ప్రేరణ అంటే నీ భర్తతో కలిసి పని చేయడానికి ప్రాబ్లమ్ ఏంటి అని సుధా అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.